Rahu mahadasha: రాహు మహాదశ ఎన్ని సంవత్సరాలు? దీని వల్ల శుభ ఫలితాలు ఏ దశలో కలుగుతాయి
Rahu mahadasha: రాహు మహాదశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? దీని ప్రభావం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటి? వాటి నుంచి బయటపడే నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం.
Rahu mahadasha: జ్యోతిష్య శాస్త్రంలో వివరించిన తొమ్మిది గ్రహాల మహాదశ లేదా అంతర్దశను ప్రతి వ్యక్తి ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ పరిస్థితులు శుభ, అశుభ ఫలితాలు రెండింటినీ కలిగి ఉంటాయి. ఈరోజు మనం రాహువు మహాదశ గురించి తెలుసుకుందాం.
నవగ్రహాలలో రాహువు అంతుచిక్కని నీడ గ్రహంగా పిలుస్తారు. రాహువు మహాదశ కూడా దాని స్థానం మీద ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. జాతకంలో రాహువు శుభస్థానంలో ఉన్నట్లయితే స్థానికులు మంచి స్థానంలో ఉంటారు. అదే అశుభ స్థానంలో ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. రాహువు మహాదశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, దాని ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి? వాటి నుంచి బయట పడేందుకు పాటించాల్సిన నివారణ చర్యలు ఏంటో తెలుసుకుందాం.
రాహువు మహాదశ ఎన్ని సంవత్సరాలు?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు మహాదశ 18 సంవత్సరాలు ఉంటుంది. జాతకంలో రాహువు ఐదు, ఏడు, తొమ్మిది స్థానాల మీద దృష్టి పెడతాడు. ఈ స్థానాల్లో ఉంటే దాన్ని రాహు మహాదశ అంటారు. రాహువు మహాదశలో 3, 6 లేదా 9 సంవత్సరాలలో అనుకూల, ప్రతికూల సంఘటనలు ఉన్నాయి. రాహువు మహాదశ ఆరు, ఎనిమిదవ సంవత్సరాలలో చాలా బాధాకరమైనది.
రాహువు మహదశ శుభఫలితాలు ఎప్పుడు?
మహాదశ ఫలితాలు రాహువు స్థానానికి అనుగుణంగా ఉంటాయి. జాతకంలో రాహువు శుభ స్థానంలో ఉన్నప్పుడు అంతుచిక్కని గ్రహం వ్యక్తిని పేదవాడి నుండి రాజుగా మారుస్తుంది. అశుభ స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తిని పేదవాడిగా మార్చడంలో క్షణం కూడా వృధా చేయదు. రాహువు శుభ స్థానంలో ప్రజలు చాలా గౌరవం, హోదా, డబ్బు పొందుతారు.
జ్యోతిష్యుల ప్రకారం జాతకంలో రాహువు స్థానం బలహీనంగా ఉంటే మహాదశలో విజయం సాధించడంలో వ్యక్తి చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది మహాదశ సమయంలో వ్యక్తి సామాజిక, ఆర్థిక హెచ్చు తగ్గులు అనుభవించేలా చేస్తుంది. ఈ సమయంలో వ్యక్తి శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో అనుకోని నష్టాలు సంభవిస్తాయి. మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతత లోపిస్తుంది.
ఈ పరిస్థితి కారణంగా వ్యక్తి స్వభావం చిరాకు, ఆత్రుత, కోపం లేదా నిరాశకు గురవుతుంది. మహాదశ ప్రభావం వల్ల కొంతమంది కోర్టు కేసుల్లో కూడా ఇరుక్కుంటారు. వాటిని వదిలించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దాని కారణంగా వారు కష్ట సమయాలను గడపవలసి వస్తుంది. ఈ సమయంలో వ్యక్తి భయం, అనుమానం చుట్టుముడతాయి.
అననుకూల ప్రభావాలను నివారించడానికి మార్గాలు-
1. రాహువు దశకు అనుగుణంగా ప్రతి సోమవారం శివునికి జలాభిషేకం చేసి శివ చాలీసా పారాయణం చేయాలి.
2. రాహు మహాదశ ఉన్నవారు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.
3. రాహు మహాదశలో ప్రతి శనివారం మర్రి చెట్టుకు పూజ చేయాలి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.