Karthika Pournami Diyas : కార్తీక పౌర్ణమి రోజున ఎన్ని దీపాలు పెట్టాలి? ఏ దిక్కున వెలిగించాలి?
Karthika Pournami Deepam 2023 : కార్తీక మాసంలో దీపాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మాసంలో అత్యంత పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈరోజున దీపాలు ఎన్ని వెలిగించాలి? ఏ దిక్కున పెట్టాలి?
Karthika Pournami 2023 : కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఏడాదిలో ఈ మాసం చాలా పవిత్రంగా భావిస్తారు. శివుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఉంటారు. కార్తీకంలో దీపాలు పెట్టడం అనే సంప్రదాయం ఉంది. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఈ మాసంలో చాలా పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈరోజున దీపాలు పెడుతుంటారు. అయితే ఎన్ని దీపాలు పెట్టాలో తెలుసుకుందాం..
హిందువులకు అతి పవిత్రమైన పండగలలో కార్తీక పౌర్ణమి ఒకటి. ఈరోజున ఇళ్లలో దీపాలను వెలిగిస్తుంటారు. వీటిని కార్తీక దీపాలు అంటారు. శివుడు, మహావిష్ణువును పూజిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున 365 దీపాలను వెలిగించడం మంచిది. ఒకవేళ కుదరకపోతే 27 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలకు 27 నక్షత్రాలు అని అర్థం. అయితే అన్ని దీపాలను వెలిగించడం సాధ్యం కాకపోతే.. 9 దీపాలనైనా వెలిగించాలి.
కార్తీక పౌర్ణమి నాడు తూర్పు దిక్కున దీపాలన వెలిగిస్తే మంచిది. మీ కష్టాలు తొలగిపోతాయి. పడమర దిశలో వెలిగిస్తే రుణ సమస్యలు పోతాయని చెబుతారు. అదే ఉత్తర దిశలో దీపాలు వెలిగిస్తే.. వివాహానికి ఉంటే ఆటంకాలు అన్ని తొలగిపోతాయని అంటారు. కార్తీక దీపాన్ని దక్షిణ దిశలో వెలిగించకూడదు.
దీపాలను వెలిగించేప్పుడు కూడా కొన్ని రకాల పద్ధతులు పాటించాలి. ఒక ముఖం ఉండే దీపం వెలిగిస్తే అనుకున్నవి నెరవేరుతాయి. అదే రెండు మూఖాలున్న దీపాలు వెగిలిస్తే కుటుంబానికి ప్రయోజనం కలుగుతుంది. మూడు ముఖాలు ఉంటే సంతానం కలుగుతుంది. నాలుగు ముఖాలు ఉంటే సిరి సంపదలు పెరుగుతాయని నమ్ముతారు. ఐదు ముఖాలు ఉన్న దీపాన్ని వెలిగిస్తే సకల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతుంటారు.
దీపాన్ని వెలిగించేప్పుడు కొన్ని పనులు చేయకూడదు. స్వచ్ఛమైన దీపం.. అంటే గతంలో కాల్చిన వత్తి లేదా నూనె లేకుండా శుభ్రమైన దీపం. పాత కాలిన దీపాన్ని పూర్తిగా నీటితో శుభ్రం చేసి దీపాన్ని వెలిగించాలి. పాత దీపాన్ని వెలిగించకూడదని గుర్తుంచుకోండి.
దీపాన్ని వెలిగించడానికి ఇత్తడి, రాగి, మట్టితో చేసిన దీపాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఇది ఉత్తమమైనది, పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అందువల్ల, ఇతర లోహాలతో చేసిన దీపాలను ఉపయోగించవద్దు. ప్రయోజనం ఉండదు. ఇత్తడి దీపంలో దీపం వెలిగించేటప్పుడు వత్తి, నెయ్యి, నూనె, పసుపు బియ్యం, పూల రేకులు వేసి దీపం వెలిగించాలి.