భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర రాష్ట్రంలోని సహ్యాద్రి పర్వతాల్లో, పుణె జిల్లా ప్రాంతంలో విస్తరించి ఉంది. ఈ పవిత్ర స్థలం శివ భక్తులకు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా పరిగణిస్తారు.
భీమశంకర్ జ్యోతిర్లింగానికి సంబంధించిన పురాణకథ, భక్తుల యాత్ర అనుభవం ఎంతో పవిత్రంగా, ప్రత్యేకంగా ఉంటుంది అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
భీమశంకర్ జ్యోతిర్లింగానికి సంబంధించిన ప్రధాన కథ రాక్షసుడు భీముడి చుట్టూ తిరుగుతుంది. భీముడు, రాక్షసరాజు కుంభకర్ణుని కుమారుడిగా జన్మించాడు. రామాయణంలో కుంభకర్ణుడు శ్రీరామచంద్రుడి చేత చేతిలో మరణించిన తర్వాత భీముడు తండ్రి మరణం గురించి తెలుసుకొని ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించాడు. తల్లి కర్కతి ద్వారా తన తండ్రి మరణం గురించి తెలిసిన భీముడు బలవంతంగా తపస్సు చేసి బ్రహ్మ దేవుని నుంచి అశీర్వాదం పొందాడు.
ఈ శక్తులతో భూమిని, ప్రజలను, సన్యాసులను బాధిస్తూ ప్రారంభించాడు. భీముని చంపడానికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. భీముడు, శివుడి మధ్య మహా యుద్ధం జరిగింది. చివరకు భీముడిని సంహరించిన శివుడు, ఆ ప్రదేశంలో జ్యోతిర్లింగ రూపంలో పుట్టుకొందాడు. ఈ జ్యోతిర్లింగమే భీమాశంకరంగా ప్రసిద్ధి చెందింది. భీమాశంకర ఆలయం పర్వతశ్రేణుల మధ్యలో ఉండి, సహజసిద్ధమైన అందాలను ఆస్వాదించేలా ఉంటుంది. ఆలయం దక్షిణ భారత శైలిలో నిర్మించబడింది. ప్రధాన గర్భగృహంలో భీమాశంకర స్వామి జ్యోతిర్లింగంగా కొలువై ఉంటాడు. ఇక్కడి జలపాతం, నదులు, పర్వతాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
భీమశంకర్ జ్యోతిర్లింగ దర్శనం కోసం భక్తులు దేశమంతా నుండి వస్తుంటారు. ఆలయానికి చేరడానికి పుణె నుండి రోడ్డు మార్గంలో యాత్రికులు చేరవచ్చు. భీమశంకర్ ఆలయ సమీపంలోని సహ్యాద్రి పర్వతాలు, వైల్డ్ లైఫ్ సాంక్చురీ భక్తులకు మాత్రమే కాకుండా ప్రకృతి ప్రేమికులకు కూడా విశేషంగా ఆకర్షణీయంగా ఉంటాయి.
భక్తులు ప్రధానంగా శివరాత్రి సందర్భంగా ఇక్కడికి రావడం అనవాయితీ. ఈ సమయంలో ఆలయ ప్రాంగణం భక్తుల నినాదాలతో మారుమోగుతుంది. భీమశంకర్ దర్శనం కోసం యాత్రికులు కొంత ప్రయాణాన్ని నడిచే ఉంటారు, ఎందుకంటే ఆలయం కొండచరియల్లో ఉంది. ఈ ప్రయాణం, భక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడికి చేరుకున్న తరువాత భక్తులు భీమాశంకర స్వామిని దర్శించుకొని కృతార్థత చెందుతారు.
భీమశంకర్ జ్యోతిర్లింగం శివభక్తులకు మాత్రమే కాకుండా అన్ని భక్తులకు కూడా ఒక పవిత్ర స్థలంగా నిలుస్తోంది. భీముడు, శివుడి మధ్య జరిగిన యుద్ధం, భక్తులు చేసే యాత్ర, ఈ ఆలయానికి గౌరవాన్ని, భక్తి పరిపూర్ణతను తీసుకువచ్చాయి అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్