Horsocpe Matching for Marriage :పెళ్ళికి ముందు జాతకం ఎందుకు చూడాలి? జాతకాలకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారంటే?
Horsocpe Matching for Marriage: ఈ రోజుల్లో కూడా ఇంకా చాలామంది పెళ్లికి ముందు జాతకాలు చూసుకుంటున్నారు. జాతకాలు సరిపోతేనే పెళ్లి చేసుకుంటున్నారు. పురాతన కాలం నుంచి ఈ పద్ధతిని అందరూ అనుసరిస్తూ వస్తున్నారు. పెళ్లికి ముందు కచ్చితంగా జాతకం చూసి అది సరిపోతూనే పెళ్లి చేసుకుంటున్నారు.
ప్రతి ఒక్కరు కూడా జీవితంలో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని అనుకుంటారు. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మార్పు వస్తుంది పెళ్లి అనేది కేవలం రెండు మనసులు దగ్గర అవడం కాదు. రెండు కుటుంబాలు ఒకటి అవ్వడం.
ఈ రోజుల్లో కూడా ఇంకా చాలామంది పెళ్లికి ముందు జాతకాలు చూసుకుంటున్నారు. జాతకాలు సరిపోతేనే పెళ్లి చేసుకుంటున్నారు. పురాతన కాలం నుంచి ఈ పద్ధతిని అందరూ అనుసరిస్తూ వస్తున్నారు. పెళ్లికి ముందు కచ్చితంగా జాతకం చూసి అది సరిపోతూనే పెళ్లి చేసుకుంటున్నారు.
అసలు పెళ్లికి జాతకాలు ఎందుకు చూడాలి?
అసలు పెళ్లికి జాతకాలు చూడడం ఎందుకు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా పెళ్లి చేసుకోవడానికి ముందు జాతకాలు చూసుకుంటూ ఉంటారు. అవి నప్పితేనే పెళ్లికి సిద్ధపడుతున్నారు. పెళ్లి చేసుకోవడానికి ముందు జాతకాలు చూడడం అనేది ముఖ్యమైన ప్రక్రియ.
అసలు జాతకాలు సరిపోవడం అంటే ఏంటి?
- ఒక వ్యక్తి జాతకం, పుట్టిన తేదీ, సమయం, ప్రదేశం ఆధారంగా తయారు చేయబడుతుంది. పెళ్లి కోసం వధూవరులు, గుణాలు, చంద్రస్థానం, మంగళదోషాలని వారి జాతకాలని చూసి తనిఖీ చేస్తారు.
2. జాతకాలు చూసి అబ్బాయి, అమ్మాయి, వైవాహిక జీవితం ఎలా ఉంటుందనేది నిర్ధారించబడుతుంది. ఇద్దరు పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందా లేదా అనేది జాతకాలు చూసి చెప్తారు.
3. వధూవరుల చంద్ర గ్రహం స్థానం పరిగణలోకి తీసుకుంటారు.
అసలు ఎందుకు జాతకాలు చూడడం ముఖ్యం?
పెళ్లంటే ఇద్దరినీ జీవితాంతం కలిసి ఉంచే బంధం. కనుక పెళ్లికి ముందు వధూవరుల జాతకాన్ని చూస్తారు. ఈ బంధం సఫలం అవుతుందా సంతానం కలుగుతుందా ఇటువంటివన్నీ కూడా చూస్తారు. అడ్డంకులు ఏమైనా ఉంటే ఎలా తొలగించాలి? వివాహం, విజయవంతం కావడానికి జాతక సరిపోలిక అవసరమని భావించడానికి ఇదే కారణం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం