Funny zodiac signs: ఈ రాశుల జాతకులు నవ్వించడంలో దిట్ట.. ఇలాంటి వాళ్ళు మీ పక్కన ఉంటే ఎప్పుడు హ్యాపీనే-horoscopes of these zodiac signs are good at making people laugh ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Funny Zodiac Signs: ఈ రాశుల జాతకులు నవ్వించడంలో దిట్ట.. ఇలాంటి వాళ్ళు మీ పక్కన ఉంటే ఎప్పుడు హ్యాపీనే

Funny zodiac signs: ఈ రాశుల జాతకులు నవ్వించడంలో దిట్ట.. ఇలాంటి వాళ్ళు మీ పక్కన ఉంటే ఎప్పుడు హ్యాపీనే

Gunti Soundarya HT Telugu
Apr 09, 2024 11:00 AM IST

Funny zodiac signs: కొంతమంది పక్కన ఉంటే మనకి అసలు టైమే తెలియదు. వాళ్ళు వేసే జోకులతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ ఉంటారు. ఈ రాశుల జాతకులు ఎదుటి వారిని నవ్వించడంలో దిట్ట. ఇలాంటి వాళ్ళు మీ పక్కన ఉన్నారంటే మీ బాధలను ఇట్టే పోగొట్టేసి హ్యాపీగా ఉంచుతారు.

ఈ రాశి జాతకులు నవ్వించడంలో దిట్ట
ఈ రాశి జాతకులు నవ్వించడంలో దిట్ట (pixabay)

Funny zodiac signs: నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రశాంతంగా కాసేపు నవ్వుకున్నారంటే మీ ఆయుష్హు పెరిగినట్టే. కొంతమంది పక్కన ఉంటే వారితో ఎంతసేపు సమయం గడుపుతున్నామని విషయం కూడా తెలియదు. 

కొంతమంది ఎప్పుడూ పక్కవారిని నవ్వించడంలోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. హాస్యం అనేది వారి రక్తంలోనే ఉందేమో అనిపిస్తుంది. వారి మాటలు, చేతలు, ముఖ కవళికలతో అందరిని నవ్విస్తూ ఆకర్షిస్తారు. తమ చిలిపితనంతో జోకులు వేస్తూ హాస్యంతో అందరిని తమ వైపుకు తిప్పుకుంటారు. అందరికీ అలా నవ్వించడం చేత కాదు. కానీ ఈ ఐదు రాశుల జాతకులు మాత్రం నవ్వించడంలో దిట్టలు. ఇలాంటి వాళ్ళు మీ పక్కన ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంటారు. కాసేపు అయినా మీ బాధలు మర్చిపోయి సంతోషంగా గడిపేస్తారు. మరి ఆ రాశులు ఏంటి? అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి. 

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి జాతకులు చాలా సరదాగా ఉంటారు. కోపాన్ని క్షణాల్లో చల్లార్చి నవ్వు తెప్పించడంలో నిష్ణాతులు.  ప్రయాణాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఈ రాశి వారికి చాలా ఇష్టం. ఈ రాశి జాతకులతో స్నేహం చేయడం వల్ల మీ జీవితం సంతోషమయంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు తమ బాధలు మర్చిపోయేలా చేసి ఆనందంగా ఉంచుతారు. తమ జోకులతో పొట్టచెక్కలయ్యేలా నవ్వించేస్తారు. వీళ్ళు పక్కన ఉంటే అసలు టైమే తెలియదు. 

మిథున రాశి

మొత్తం 12 రాశి చక్రాలలో మిథున రాశి వారు అత్యంత చమత్కారమైన రాశి వారిగా పేరుగాంచారు. క్లిష్టమైన పరిస్థితులను కూడా అర్థం చేసుకోవడంలో దిట్టలు. జోకులు వేస్తూ ఎదుటివారి బాధను క్షణాల్లో మాయం చేయగలుగుతారు. అయితే కొన్నిసార్లు వీళ్ళు వేసే జోకులు కొంతమందికి ఇబ్బంది కలిగిస్తాయి. కానీ నవ్వించడంలో వీరి తర్వాతే ఎవరైనా. 

సింహ రాశి

ఇతరులను ఆకర్షించడంలో తమ హాస్య చతురతతో ఆకట్టుకోవడంలో సింహరాశి జాతకులు ముందుంటారు. ఈ రాశి ఐదో గృహంలో వినోదం, ఆనందం, సృజనాత్మకత ఉండటం వల్ల సహజంగానే హాస్య చతురత కలిగి ఉంటారు. ఆనందంగా ఉండటం, ఇతరులకు నవ్వి తెప్పించడం వీరికి క్షణాల్లో పని. అయితే వీరి మీద ఎదుటి వాళ్ళు ఎవరైనా జోకులు వేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. ఈ రాశి జాతకులు మీ పక్కన ఉన్నారంటే లైఫ్ ఫుల్ ఎంటర్ టైనమెంట్ గా ఉంటుంది. 

తులా రాశి

జోకులు వేస్తూ ఇతరులను ఆకట్టుకోవడంలో తులా రాశి జాతకులు నిష్టాతులు.  అందరినీ ప్రేమించడం, ఎదుటి వారి క్షేమం కోరుకోవడం, వాళ్ళని సంతోషంగా ఉంచాలని ప్రయత్నించడం వీరి స్వభావం. హాస్య ఛలోక్తులతో అందరినీ నవ్విస్తూ ఆనందంగా ఉంచుతారు.

కన్యా రాశి

కన్యా రాశి జాతకులు ఎంతో చురుకుగా ఉంటారు. ఉల్లాసంగా ఉత్సాహవంతమైన ప్రవర్తనతో అందరినీ తమ వైపుకు తిప్పేసుకుంటారు. చిన్న చిన్న మాటలతోనే నవ్వు తెప్పించగల సమర్థలు. కొంచెం భయస్తులు కావడం వల్ల ఎదుటివారి మీద జోకులు వేయడానికి ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. అయితే తెలివితేటలు, సమయ స్పూర్తికి తగ్గట్టుగా హాస్యం పండించడంలో నిష్ణాతులు. 

 

WhatsApp channel

టాపిక్