Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు.. వీళ్లు నువ్వుల నూనెతో దీపం వెలగించాలి..-horoscope today telugu rasi phalaluu check astrological prediction for day 23 may 2023
Telugu News  /  Rasi Phalalu  /  Horoscope Today Telugu Rasi Phalaluu Check Astrological Prediction For Day 23 May 2023
today Horoscope Telugu
today Horoscope Telugu

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు.. వీళ్లు నువ్వుల నూనెతో దీపం వెలగించాలి..

23 May 2023, 1:00 ISTHT Telugu Desk
23 May 2023, 1:00 IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 23.05.2023వ తేదీ కోసం పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 23.05.2023వ తేదీ మంగళవారం రోజు కోసం పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: వైశాఖము వారం: మంగళవారం, తిథి: శు. చవితి నక్షత్రం: ఆరుద్ర

 

మేషరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

మేషరాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. శారరీక శ్రమ అధికము. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకూడదని సూచన. మేషరాశికి జన్మస్థానమునందు బుధ, గురు, రాహువుల మరియు వాక్ స్థానం నందు రవి ప్రభావంచేత గొడవలకు దూరంగా ఉ ండాలని సూచన. పనులుయందు ఆటంకములు, చికాకులు కలుగును. కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సూచనలు అధికముగా ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశరుణ్ణి పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

వృషభరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదముగా గడిపెదరు. గొడవలు పడు సూచన. పనులను సకాలంలో పూర్తి చేసెదరు. జన్మరాశి యందు రవి ప్రభావం చేత అనారోగ్య సూచనలు అధికము. వ్యయ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత ఖర్చులు అధికముగా ఉండును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. దుర్గాదేవిని పూజించాలి. దేవీ ఉపాసన చేయడం మంచిది. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

మిథునరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

మిథునరాశివారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. శ్రమ అధికముగా ఉండును. కుటుంబ విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. మిధున రాశి వారికి జన్మరాశి యందు శుక్రుడు, వాక్ స్థానమునందు కుజుని ప్రభావంచేత వివాదాలు ఏర్పడు సూచన. ధనాన్ని కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేసెదరు. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుటచేత మిథునరాశివారికి కలసివచ్చును. విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

కర్కాటకరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

కర్కాటక రాశివారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆగ్రహ ఆవేశాలు నియంత్రించుకోవాలి. శ్రమ అధికముగా ఉ ండును. ఒత్తిళ్ళు పెరుగును. జన్మరాశియందు కుజుని ప్రభావంచేత శారీరక శ్రమ అధికముగా ఉండును. అయినప్పటికి లాభస్థానమునందు రవి, దశమ స్థానమునందు బుధ గురు, రాహువుల ప్రభావంచేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఋణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

సింహరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

సింహరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. శ్రమకు తగిన ఫలితము లభించును. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. సుబ్రహ్మణ్యేశరుణ్ణి పూజించాలి. లాభ స్థానములో శుక్రుడు దశమస్థానములో రవిప్రభావంచేత భాగ్య స్థానములో బుధ, గురు, రాహువుల ప్రభావం చేత సింహరాశివారికి చేసే ప్రతి పని అనుకూలించును. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కన్యారాశి వారికి ఈ రోజు దినఫలాలు

కన్యారాశివారికి ఈరోజు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ధనలాభము కలుగును. మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కన్యారాశి వారికి లాభస్థానములో కుజుడు, రాజ్యస్థానములో శుక్రుడు, భాగ్య స్థానములో రవి అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తు లాభము, కీర్తి కలుగును. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. 7 దుర్గాదేవిని పూజించాలి. దేవీ ఉపాసన చేయడం మంచిది. రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

తులారాశి వారికి ఈ రోజు దినఫలాలు

తులారాశివారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఖర్చులు అధికమగును. చర్చలకు దూరంగా ఉండాలి. ఆవేశాన్ని తగ్గించుకోవాలని సూచన. కళత్ర స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత కుటుంబము నందు సమస్యలు, వాదనలు అధికమగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగంలో శ్రమ అధికముగా ఉండును. అష్టమ రవి ప్రభావం చేత ఉద్యోగంలో శ్రమ అధికముగా ఉండును. దశమంలో కుజుడు, భాగ్యములో శుక్రుని అనుకూల ప్రభావం చేత సమస్యలు అధిగమించి ముందుకు వెళ్ళుదరు. విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

వృశ్చికరాశి వారికి ఈ రోజు దినఫలాలు

వృశ్చికరాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. శారీరక శ్రమ అధికముగా ఉండును. ఒత్తిళ్ళు అధికముగా ఉన్నాయి.కుటుంబ విషయాలయందు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. అష్టమ స్థానము నందు శుక్రుడు, కళత్ర స్థానమందు రవి ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. కుటుంబ విషయాల యందు శ్రమ అధికముగా ఉండును. ఋణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

ధనూరాశి వారికి ఈ రోజు దినఫలాలు

ధనూరాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. చర్చలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగస్తులకు అనుకూలం వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు. అష్టమ కుజుని ప్రభావంచేత కుటుంబములో మానసిక ఘర్షణలు, వాదనలు ఏర్పడు సూచన. ఏడో స్థానమునందు శుక్రుడు, ఐదో స్థానమందు నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత అనుకున్న పనులు పూర్తి చేసెదరు. సుబ్రహ్మణ్యేశరుణ్ణి పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

మకరరాశి వారికి ఈ రోజు దినఫలాలు

మకర రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ఖర్చులు అధికమగు సూచన ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి. చతుర్ధ స్థానమునందు బుధ, గురు, రాహువుల అనుకూలత వలన పంచమస్థానమునందు రవి అనుకూలత వలన అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. కళత్ర స్థానమునందు కుజుని ప్రభావంచేత కుటుంబములో సమస్యలు, ఘర్షణలు అధికమగును. దుర్గాదేవిని పూజించాలి. దేవీ ఉపాసన చేయడం మంచిది. రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాలు

కుంభరాశివారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. చర్చలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ముఖ్యమైన విషయాల కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు. ఆరో స్థానమునందు కుజుడు ఐదో స్థానమునందు శుక్రుడు తృతీయ స్థానమునందు రాహువు అనుకూల స్థితివలన అనుకున్న ప్రతీ పని అనుకున్న విధంగా పూర్తి చేసెదరు. ప్రయాణములు అనుకూలించును. ఏలినాటి శని ప్రభావంచేత శారీరక శ్రమ, ధన వ్యయము ఏర్పడును. విఘ్నేశ్వరుని పూజించాలి సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

మీన రాశి వారికి ఈ రోజు దినఫలాలు

మీనరాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. చర్చలకు వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబ వ్యవహారాలయందు ఆచితూచి వ్యవహరించాలి. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ఏలినాటి శని ప్రభావం మరియు వాక్ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉద్యోగ వ్యాపారాలయందు చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఋణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్: 9494981000

 బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ