Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఆ రాశుల వారికి ప్రయాణాలు అనుకూలించును!-horoscope today know your rasi phalalu in telugu for monday march 20 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Horoscope Today, Know Your Rasi Phalalu In Telugu For Monday, March 20, 2023

Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఆ రాశుల వారికి ప్రయాణాలు అనుకూలించును!

HT Telugu Desk HT Telugu
Mar 20, 2023 01:02 AM IST

Horoscope Today in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే, తేదీ మార్చి 20, 2023కు సంబంధించి అందించిన రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today in Telugu
Horoscope Today in Telugu (freepik)

Horoscope Today in Telugu: తెలుగు రాశి ఫలాలు (దిన ఫలాలు) 20.03.2023

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: ఫాల్గుణము వారం: సోమవారం, తిథి: కృ. చతుర్దశి నక్షత్రం: శతభిషం

మేష రాశి :

మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్థమునుండి చెడు ఫలితాలున్నాయి. మేషరాశికి జన్మరాశియందు శుక్ర, రాహువులు మరియు వ్యయస్థానమునందు రవి, బుధ, గురులు సంచారంచేత పనులు యందు ఆలస్యము మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉండును. ఖర్చులు అధికమగును. ధన నష్టము సూచనలు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వాహనాలు, గృహాలు వంటి వాటికి ధనము ఖర్చు చేయు సూచన. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మేషరాశి వారు రుద్రాభిషేకము, శివారాధన చేయటం వలన ఈ రోజు మంచిది.

వృషభ రాశి :

వృషభరాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. వృషభరాశివారికి లాభస్థానములో రవి, బుధ, గురుల ప్రభావంచేత చేసే పనులు అనుకూలించును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు అనుకూలము, వ్యాపారస్తులకు వ్యాపారమునందు లాభములు కలుగును. వృషభరాశి వారికి వాక్ స్థానమునందు కుజుని సంచారం వలన గొడవలు, వాగ్వివివాదములకు దూరంగా ఉండాలి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. ఆవేశపూరిత నిర్ణయాలకు పౌరుషపు పట్టుదలకు దూరంగా ఉండాలని సూచన. వృషభరాశివారికి లాభమునందు గురుడు, దశమము నందు శని ప్రభావం చేత ఆర్ధికపరంగా లాభము చేకూరును. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వృషభ రాశి వారు లింగాష్టకాన్ని పఠించడం మంచిది.

మిథున రాశి :

మిథునరాశివారికి ఈ రోజు మధ్యస్తముగా ఉంది. మిథున రాశి వారికి జన్మరాశి యందు కుజుని ప్రభావంచేత శారీరక శ్రమ, మానసిక ఘర్షణలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయమునందు జాగ్రత్తలు వహించాలి. రవి, బుధ, గురులు దశమంలో ఉండటంచేత ఉద్యోగస్తులకు అనుకూల ఫలితములు. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. కుజుని ప్రభావం చేత ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మిధున రాశి వారు రుద్రాభిషేకము మరియు శివారాధన చేయటం వలన ఈ రోజు మంచిది.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారికి ఈ రోజు మధ్యస్థమునుండి ఫలితాలు ఉన్నాయి. భాగ్యమునందు రవి, బుధ, గురులు సంచారము వలన కర్కాటక రాశివారికి వృత్తి ఉద్యోగ వ్యాపారములయందు మధ్యస్థ ఫలితములు ఏర్పడుతున్నవి. దశమ స్థానమునందు శుక్ర, రాహువుల సంచారం వలన ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయము. కర్కాటక రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బిల్వాష్టకము, శివాభిషేకం చేసుకోవడం మంచిది.

సింహ రాశి :

సింహరాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలున్నాయి. సింహరాశికి అష్టమ స్థానము నందు రవి, బుధ, గురుల ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. పనులయందు శ్రమ మరియు చికాకులు అధికమగును. ఆర్థిక విషయాలు ఇబ్బంది పెట్టు సూచన. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. లాభములో కుజుని ప్రభావం చేత సింహరాశి ఉద్యోగస్తులకు అనుకూలము. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడుచున్నవి. విద్యార్థులకు జాగ్రత్త వహించవలసినటువంటి సమయము. స్త్రీలు కుటుంబవిషయాలయందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. సింహరాశి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు శివాలయంలో శివునికి అభిషేకము చేసుకోవడం మంచిది.

కన్య రాశి :

కన్యారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కళత్ర స్థానమునందు రవి, బుధ, గురుల సంచారం వలన కుటుంబమునందు కొంత చికాకులు అధికముగా ఉండును. దశమంలో కుజుని అనుకూలత వలన ఉద్యోగస్తులకు లాభదాయకముగా ఉండును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము. శని ఆరో ఇంట అనుకూల ప్రభావంచేత అనుకున్న ప్రతీ పనియందు విజయాన్ని చూచెదరు. అష్టమ స్థానమునందు శుక్ర, రాహువుల సంచారము వలన శారీరక శ్రమ, ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అయినప్పటికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ప్రయాణములు లాభించును. ధనలాభము, కీర్తి కలుగును. కన్యా రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం చంద్రశేఖరాష్టకము మరియు లింగాష్టకం పఠించడం మంచిది.

తులా రాశి :

తులారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. పంచమంలో శని మరియు ఆరో ఇంట రవి, బుధ, గురుల ప్రభావంచేత తులారాశివారు చేసే పనులు అనుకూలించును. కళత్ర స్థానమునందు శుక్ర, రాహువులు భాగ్యస్థానమునందు కుజుని ప్రభావంచేత ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు శుభఫలితములు, వ్యాపారస్థులకు లాభము కలుగును. ఆరోగ్య విషయాల యందు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులకు అనుకూలమైన సమయము. తులారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో శివునికి అభిషేకం చేసుకోవడం వలన మరింత శుభఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి :

వృశ్చిక రాశికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. అష్టమ కుజుని ప్రభావంచేత వృశ్చికరాశి వారికి శారీరక శ్రమ, పని ఒత్తిళ్ళు మానసిక వేదన అధికమగును. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. జన్మరాశి యందు కేతువు, కళత్ర స్థానము శుక్ర రాహువుల ప్రభావంచేత కుటుంబములో సమస్యలు వేధించును. రవి, బుధ, గురులు ఆరో స్థానమునందు పంచమంలో శని ప్రభావంచేత ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకు వ్యాపారము నందు అనుకూల ఫలితములు కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము. ప్రయాణములు అనుకూలించును. శారీరక శ్రమ అధికముగా ఉండును. వివాదములకు దూరంగా ఉండాలని సూచన. వృశ్చిక రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లింగాష్టకము మరియు బిల్వాష్టకము చదువుకోవడం వలన మరింత శుభ ఫలితాలు పొందెదరు.

ధనుస్సు రాశి :

ధనూ రాశి వారికి ఈ రోజు అనుకూలముగా ఉన్నది. చతుర్థ స్థానమునందు రవి, బుధ, గురుల ప్రభావం చేత కుటుంబ సౌఖ్యము కలుగును. ఆర్థిక సమస్యల నుండి బయటకు వచ్చెదరు. పంచమ స్థానమునందు శుక్ర, రాహువుల ప్రభావంచేత కుటుంబ సౌఖ్యము, లాభము పొందెదరు. ప్రయాణములు అనుకూలించును. ధనూరాశి వారికి శని అనుకూల స్థితి వలన చేసే పనులయందు విజయము పొందెదరు. కళత్ర స్థానమునందు కుజుని ప్రభావం వలన కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము. ధనూరాశి వారికి ఈరోజు ధనలాభము, సౌఖ్యము కలుగు సూచన. ధనూరాశి వారు శివాలయంలో శివునికి అభిషేకం చేసుకోవడం వలన మరింత శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి :

మకర రాశి వారికి ఈ రోజు మధ్యస్థముగా ఉన్నది. ధనస్థానమునందు శని ప్రభావంచేత ఖర్చులు అధికమగును. భ్రాతృ స్థానమునందు రవి, బుధ, గురుల ప్రభావం చేత కుటుంబమునందు సమస్యలు, వివాదాలు, మానసిక ఘర్షణలు అధికమగును. చతుర్ధ స్థానమునందు శుక్ర, రాహువులు, ఆరో స్థానమునందు కుజుడు అనుకూలించును. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు, విద్యార్థులకు అనుకూలముగా ఉన్నది. మకరరాశివారికి ఏలినాటి శని ప్రభావంచేత ధన విషయమునందు జాగ్రత్తలు వహించాలి. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు శివాలయంలో శివుని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం శివాష్టకము, లింగాష్టకము పఠించడం వలన ఆరోగ్యస్థితి కలుగును.

కుంభ రాశి :

కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశివారికి జన్మరాశియందు శని సంచారం వలన శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ధన స్థానము కుటుంబ స్థానము వాక్ స్థానము అయినటువంటి 2వ ఇంట రవి, బుధ, గురుల ప్రభావం చేత ఆర్ధిక విషయాలలో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకొను సూచనలు. కుటుంబ సమస్యలతో వాగ్వివిదాలకు దూరంగా ఉండాలని సూచన. తృతీయ స్థానము నందు శుక్ర, రాహువులు, పంచమ స్థానముల కుజుని అనుకూలత వలన ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడియున్నటువంటి సమయము. విద్యార్థులకు మధ్యస్థ ఫలితములు కలుగును. పనుల యందు ఆలస్యము. కుటుంబ వ్యవహారాలయందు చికాకులు కలుగును. కుంభ రాశివారు ఈ రోజు విభూతితో శివునికి అభిషేకం చేసుకోవడం, అలాగే శివపంచాక్షరీ మంత్రంలో జపం చేయడం వలన వలన శుభ ఫలితములు కలుగును.

మీన రాశి :

మీన రాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలు అధికముగా ఉన్నవి. జన్మరాశియందు రవి, బుధ, గురులు ప్రభావంచేత మీనరాశి వారికి శారీక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు అధికమగును. మీనరాశివారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. వ్యయస్థానము నందు శని ప్రభావంచేత మీనరాశి వారికి ఖర్చులు అధికముగా అగును. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు చెడు సమయము. వ్యాపారస్తులకు ఆర్ధిక సమస్యలు అధికముగా ఉండును. విద్యార్థులకు కష్ట సమయము. కోర్టు విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
WhatsApp channel

సంబంధిత కథనం