Rasi Phalalu Today: ఈరోజు రాశి ఫలాలు.. స్నేహితులు మీ విలువను గుర్తిస్తారు
Rasi Phalalu Today: ఈరోజు రాశి ఫలాలు తేదీ 22.09.2023 శుక్రవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 22.09.2023
ట్రెండింగ్ వార్తలు
వారం: శుక్రవారం, తిథి: సప్తమి,
నక్షత్రం : జ్యేష్ట, మాసం: భాద్రపదం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
మేషరాశి
మేషరాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. సమాజంలో విలువ, ఆదరణ పెరుగుతుంది. స్నేహితులు బంధువులు మిమ్ములను గౌరవిస్తారు. ప్రయత్నించిన పనులు నెరవేరుతాయి. ఇష్టకార్య సిద్ధి. సంతానం పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వాహన సౌఖ్యం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీ ఆదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కనిపిస్తుంది. శత్రువులను జయించటానికి వ్యూహాలు రచిస్తారు. మంచి స్నేహితులతో ఆనందాన్ని ఆస్వాదిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీస్తోత్రం పఠించండి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందిస్తాయి. మీ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మీ విలువను గుర్తిస్తారు. మీకు గౌరవం ఇస్తారు. మీరు చాలా మానసిక ప్రశాంతత, ఉపశమనాన్ని అనుభవిస్తారు. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతుంది. గృహ వాతావరణం బాగుంటుంది. సమాజంలో పెద్దవారికి మీ సలహాలు, సూచనలు అవసరం. మిమ్ములను సంప్రదించడం ద్వారా కార్యసిద్ధి. నియామకపు పరీక్షలలో గెలుపొందుతారు. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి
సింహరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. కుటుంబముతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార వృద్ధి. శత్రువర్గంపై విజయం. అదృష్టం కలసివస్తుంది. శుభవార్తలు వింటారు. స్నేహితుల నుండి లాభం. మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.
కన్యా రాశి
కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఆర్థికంగా లాభదాయకము. విందులు వినోదాల్లో పాల్గొంటారు. విదేశీ యాత్రలో ధనమును అధికముగా ఖర్చుచేస్తారు. సంపద వృద్ధి. వ్యాపారంలో లాభములు. ప్రయాణములు అనుకూలించును. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. శుభఫలితాలు కలుగుతాయి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. తోబుట్టువుల వలన లాభాలు, శుభవార్తలు వింటారు. నిద్రలేమి వలన శరీర రుగ్మతలు, విద్యార్థులకు అనుకూలం. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. దేవతానుగ్రహం వలన ధనధాన్య లాభములు. గృహమున మంగళకరమైన వాతావరణం. భూ గృహ స్థిరాస్తుల వృద్ధి. సంతోషకరమైన వాతావరణం. మృష్టాన్న భోజన ప్రాప్తి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పదోన్నతులు దక్కుతాయి. అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. స్నేహితులు గౌరవిస్తారు. అధిక లాభం కలుగుతుంది. ఆరోగ్యం అనుకూలించును వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించండి.
మకర రాశి
మకర రాశివారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఖర్చులను నియంత్రించుకోవాలి. మానసిక ప్రశాంతత కరువవుతుంది. శత్రువుల నుండి సమస్యలు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలతో బాధపడతారు. ఆర్ధిక సమస్యలు బాధపెట్టును. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీస్తోత్రం పఠించండి.
కుంభ రాశి
కుంభరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. కీర్తి ప్రతిష్టలు కలుగును. మానసిక ఒత్తిడి. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికరమైన ఆదాయం. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. ఆదాయం లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వృద్ధి. అధిక ధనాన్ని నిల్వచేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాల్లో అనుకూలించవు. అధికారిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటారు. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000