Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి?!-horoscope today in telugu check your astro prediction for may 13 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి?!

Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి?!

HT Telugu Desk HT Telugu
May 13, 2023 01:00 AM IST

Horoscope Today in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే, తేదీ మే 13, 2023కు సంబంధించి అందించిన రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Telugu :
Horoscope Telugu : (freepik)

Horoscope Today in Telugu: తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 13.05.2023

సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: వైశాఖము వారం: శనివారం, తిథి: కృ. అష్టమి నక్షత్రం : ధనిష్ఠ

మేష రాశి :

మేషరాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మేషరాశికి జన్మస్థానమునందు రవి, బుధ, రాహువుల ప్రభావంచేత ఈ రోజు శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉ ద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. మేషరాశివారికి శుక్రుడు, శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందెదరు. పనులు యందు ఆటంకములు, చికాకులు పెరుగును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. శారీరక సౌఖ్యం కోసం ధనాన్ని ఖర్చు చేసేదరు. మేషరాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం మరియు దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

వృషభ రాశి :

వృషభరాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఖర్చులు అధికమగును. శారీరక శ్రమ, ఒత్తిడి అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితములుండును. వృషభరాశివారికి దశమము నందు శని ప్రభావం చేత ఆర్ధికపరంగా లాభము చేకూరును. వ్యాపారస్థులకు కష్టకాలము. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్త వహించాలి. వాక్ స్థానము నందు కుజుడు, వ్యయస్థానమునందు రవి, బుధ, రాహువుల ప్రభావంచేత వాగ్వివివాదాలు అధికమగును. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. వృషభరాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

మిథున రాశి :

మిథునరాశి : మిథునరాశివారికి ఈ రోజు మధ్యస్తముగా ఉంది. ఖర్చులు అధికమగును. ధనాన్ని కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేసెదరు. రవి, బుధ, రాహువులు లాభములో ఉండటంచేత మిథునరాశివారికి కలసివచ్చును. మిథున రాశి వారికి జన్మరాశి యందు కుజుని ప్రభావంచేత శారీరక శ్రమ, మానసిక ఘర్షణలు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు కష్టసమయము. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము. మిథునరాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలముగా లేదు. దశమ స్థానమునందు రవి, బుధ, రాహువుల సంచారం వలన ఉ ద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వ్యయస్థానమునందు కుజుని ప్రభావంచేత అష్టమశని ప్రభావం వలన ఖర్చులు పెరుగును. ఆరోగ్య విషయములయందు కుటుంబ వ్యవహారములయందు జాగ్రత్తలు వహించాలి. అష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయము. కర్కాటక రాశివారు మరిన్ని శుభఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

సింహ రాశి :

సింహరాశి వారికి ఈ రోజు మధ్యస్థము నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించండి. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. విద్యార్థులకు అనుకూలమైన సమయము. స్త్రీలు కుటుంబవిషయాలయందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. లాభ స్థానములో కుజుడు, దశమస్థానములో శుక్రుని ప్రభావంచేత వృత్తి ఉద్యోగ వ్యాపాస్తులకు కలసివచ్చును. అష్టమ గురుని ప్రభావం వలన ఆరోగ్య పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. సింహరాశి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

కన్య రాశి :

కన్యారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కన్యారాశి దశమంలో కుజుడు, భాగ్యములో శుక్రుని ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలించును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము. శని ఆరో ఇంట అనుకూల ప్రభావంచేత అనుకున్న ప్రతీ పనియందు విజయాన్ని చూచెదరు. కన్యారాశి వారికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. అష్టమస్థానమునందు రవి బుధ రాహువుల ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు కుటుంబ వ్యవహారాలయందు జాగ్రత్తలు వహించాలి. ప్రయాణములు లాభించును. ధనలాభము, కీర్తి కలుగును. కన్యా రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

తులా రాశి :

తులారాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలున్నాయి. జన్మరాశియందు కేతువు, కళత్ర స్థానము రవి, బుధ, రాహువుల ప్రభావంచేత తులారాశివారికి ఈ రోజు కుటుంబ కలహాలు, శారీరక శ్రమ అధికముగా ఉండును. చేసే పనులలో చికాకులు అధికమగును. వ్యాపారస్థులకు అనుకూలముగా ఉన్నది. ఆరోగ్య విషయాల యందు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులకు అనుకూలమైన సమయము. కుటుంబ విషయాల్లో వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

వృశ్చిక రాశి :

వృశ్చికరాశికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. ప్రయాణములు అనుకూలించును. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. అష్టమ కుజుని ప్రభావంచేత వృశ్చికరాశి వారికి శారీరక శ్రమ, పని ఒత్తిళ్ళు మానసిక వేదన అధికమగును. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. రవి, బుధ, రాహువులు ఏడో స్థానమునందు పంచమంలో శని ప్రభావంచేత ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకు వ్యాపారము నందు అనుకూల ఫలితములు కలుగును. కళత్ర స్థానమందు శుక్రుని అనుకూల ప్రభావంచేత కుటుంబ సభ్యులతో ఆనందముగా గడిపెదరు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము. శారీరక శ్రమ అధికముగా ఉండును. వివాదములకు దూరంగా ఉండాలని సూచన. వృశ్చిక రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

ధనుస్సు రాశి :

ధనూ రాశి వారికి ఈ రోజు మధ్యస్థముగా ఉన్నది. ప్రయాణములు అనుకూలించును. పంచమమునందు రవి, బుధ, రాహువుల ప్రభావంచేత అనుకూలమైన ఫలితాలను పొందెదరు. ఆర్థిక సమస్యల నుండి బయటకు వచ్చెదరు. ఆరో స్థానమునందు శుక్రుని ప్రభావంచేత లాభము పొందెదరు. కుటుంబవిషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ధనూరాశి వారికి శని అనుకూల స్థితి వలన చేసే పనులయందు విజయము పొందెదరు. కళత్ర స్థానమునందు కుజుని ప్రభావంచేత కుటుంబ విషయాలయందు వివాదాలు అధికమగును. వాదనలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి వారం. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము. ధనూరాశి వారు వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

మకర రాశి :

మకర రాశి వారికి ఈ రోజు మధ్యస్థమునుండి అనుకూల ఫలితాలున్నాయి. మకరరాశివారికి ఏలినాటి శని ప్రభావము చేత మానసిక వేదన, శారీరక శ్రమ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు కష్టకాలము. విద్యార్థులకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మకరరాశివారికి ఏలినాటి శని ప్రభావంచేత ధన విషయమునందు జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. మాతృ స్థానమునందు రవి, బుధ, రాహువుల ప్రభావం చేత కుటుంబములో సమస్యలు వేధించును. పంచమస్థానమునందు శుక్రుడు, ఆరో స్థానమునందు కుజుని ప్రభావంచేత అనుకూల ఫలితాలను పొందెదరు. మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

కుంభ రాశి :

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలముగా లేదు. కుంభరాశివారికి జన్మరాశియందు ఏలినాటి శని ప్రభావంచేత చేసే పనులయందు శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. తృతీయస్థానమునందు రవి, బుధ, రాహువుల ప్రభావంచేత చికాకులు అధికమగును. చతుర్థ స్థానమునందు శుక్రుడు, పంచమము నందు కుజుని అనుకూలత వలన ఆర్థిక సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళెదరు. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడియున్నటువంటి సమయము. విద్యార్థులకు మధ్యస్థ ఫలితములు కలుగును. ఒత్తిళ్ళు అధికముగా ఉండును. కుటుంబ వ్యవహారాలయందు చికాకులు కలుగును. కుంభరాశివారికి జన్మ శని ప్రభావంచేత గొడవలకు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. కుంభ రాశివారు వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

మీన రాశి :

మీన రాశి వారికి ఈ రోజు మధ్యస్థమునుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నవి. వాస్థానమునందు రవి, బుధ, రాహువుల ప్రభావంచేత వివాదాలు అధికమగును. కుటుంబ విషయాల్లో, వివాదాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీనరాశివారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు చెడు సమయము. వ్యాపారస్తులకు ఆర్ధిక సమస్యలు అధికముగా ఉండును. విద్యార్థులకు కష్ట సమయము. కోర్టు విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఏలినాటి శని ప్రభావంచేత మీనరాశి వారికి శారీక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు అధికమగును. మీనరాశి వారు వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

 బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner

సంబంధిత కథనం