Today Horoscope : ఆ రాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలు.. జాగ్రత్తగా ఉండాలి-horoscope today in telugu check astrological prediction for sunday march 19 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Horoscope Today In Telugu Check Astrological Prediction For Sunday March 19 2023

Today Horoscope : ఆ రాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలు.. జాగ్రత్తగా ఉండాలి

HT Telugu Desk HT Telugu
Mar 19, 2023 01:10 AM IST

Today Horoscope in Telugu : ఈరోజు రాశి ఫలాలు.. నేడు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే, తేదీ మార్చి 19, 2023కు సంబంధించి అందించిన రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశిఫలితాలు
నేటి రాశిఫలితాలు

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 19.03.2023, సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: ఫాల్గుణము వారం: ఆదివారం, తిథి: కృ. త్రయోదశి నక్షత్రం : ధనిష్ఠ

ట్రెండింగ్ వార్తలు

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్థమునుండి చెడు ఫలితాలున్నాయి. మేషరాశికి జన్మరాశియందు శుక్ర, రాహువులు మరియు వ్యయస్థానమునందు రవి, బుధ, గురులు సంచారంచేత పనులు యందు ఆలస్యము మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉ ండును. ఖర్చులు అధికమగును. ధన నష్టము సూచనలు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వాహనాలు, గృహాలు వంటి వాటికి ధనము ఖర్చు చేయు సూచన. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. మేషరాశివారు మరిన్ని శుభఫలితాలు పొందడం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం మరియు సూర్యాష్టకం పఠించండి.

వృషభరాశి

వృషభరాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. వృషభరాశివారికి లాభస్థానములో రవి, బుధ, గురులు ప్రభావంచేత చేసే పనులు అనుకూలించును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు అనుకూలము, వ్యాపారస్తులకు వ్యాపారమునందు లాభములు కలుగును. వృషభరాశి వారికి వాక్ స్థానమునందు కుజుని సంచారం వలన గొడవలు, వాగ్వివివాదములకు దూరంగా ఉండాలి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. ఆవేశపూరిత నిర్ణయాలకు పౌరుషపు పట్టుదలకు దూరంగా ఉండాలని సూచన. వృషభరాశివారికి లాభమునందు గురుడు, దశమము నందు శని ప్రభావం చేత ఆర్ధికపరంగా లాభము చేకూరును. వృషభ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని మరియు దుర్గాదేవిని పూజించడం మంచిది. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

మిథునరాశి

మిథునరాశివారికి ఈ రోజు మథ్యస్తముగా ఉంది. మిథున రాశి వారికి జన్మరాశి యందు కుజుని ప్రభావంచేత శారీరక శ్రమ, మానసిక ఘర్షణలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయమునందు జాగ్రత్తలు వహించాలి. రవి, బుధ, గురులు దశమంలో ఉండటంచేత ఉద్యోగస్తులకు అనుకూల ఫలితములు. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. కుజుని ప్రభావం చేత ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మరిన్ని శుభఫలితాల కోసం మిధునరాశి వారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. ఆదిత్య హృదయాన్ని పఠించండి.

కర్కాటకరాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మధ్యస్థమునుండి ఫలితాలు ఉన్నాయి. భాగ్యమునందు రవి, బుధ, గురులు సంచారము వలన కర్కాటక రాశివారికి వృత్తి ఉద్యోగ వ్యాపారములయందు మధ్యస్థ ఫలితములు ఏర్పడుతున్నవి. దశమ స్థానమునందు శుక్ర, రాహువుల సంచారం వలన ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయము. కర్కాటక రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివాలయంలో అభిషేకం చేసుకోవడం మంచిది. శివాష్టకము మరియు లింగాష్టకాన్ని పఠించాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించాలి.

సింహరాశి

సింహరాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలున్నాయి. సింహరాశికి అష్టమ స్థానము నందు రవి, బుధ, గురుల ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. పనులయందు శ్రమ మరియు చికాకులు అధికమగును. ఆర్థిక విషయాలు ఇబ్బంది పెట్టు సూచన. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. లాభములో కుజుని ప్రభావం చేత సింహరాశి ఉద్యోగస్తులకు అనుకూలము. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడుచున్నవి. విద్యార్థులకు జాగ్రత్త వహించవలసినటువంటి సమయము. స్త్రీలు కుటుంబవిషయాలయందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం సూర్యాష్టకము పఠించాలి మరియు గురువారం దక్షిణామూర్తిని పూజించాలి. ఈ రోజు ఆదిత్య హృదయాన్ని పఠించాలి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కళత్ర స్థానమునందు రవి, బుధ, గురుల సంచారం వలన కుటుంబమునందు కొంత చికాకులు అధికముగా ఉండును. దశమంలో కుజుని అనుకూలత వలన ఉద్యోగస్తులకు లాభదాయకముగా ఉండును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము. శని ఆరో ఇంట అనుకూల ప్రభావంచేత అనుకున్న ప్రతీ పనియందు విజయాన్ని చూచెదరు. అష్టమ స్థానమునందు శుక్ర, రాహువుల సంచారము వలన శారీరక శ్రమ, ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అయినప్పటికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ప్రయాణములు లాభించును. ధనలాభము, కీర్తి కలుగును. కన్యా రాశి వారు ఈ రోజు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకాన్ని పఠించాలి.

తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. పంచమంలో శని మరియు ఆరో ఇంట రవి, బుధ, గురుల ప్రభావంచేత తులారాశివారు చేసే పనులు అనుకూలించును. కళత్ర స్థానమునందు శుక్ర, రాహువులు భాగ్యస్థానమునందు కుజుని ప్రభావంచేత ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు శుభఫలితములు, వ్యాపారస్థులకు లాభము కలుగును. ఆరోగ్య విషయాల యందు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులకు అనుకూలమైన సమయము. తులారాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది. శనివారం శనికి తైలాభిషేకం చేసుకుని దుర్గాదేవిని ఆరాధించాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చికరాశికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. అష్టమ కుజుని ప్రభావంచేత వృశ్చికరాశి వారికి శారీరక శ్రమ, పని ఒత్తిళ్ళు మానసిక వేదన అధికమగును. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. జన్మరాశి యందు కేతువు, కళత్ర స్థానము శుక్ర రాహువుల ప్రభావంచేత కుటుంబములో సమస్యలు వేధించును. రవి, బుధ, గురులు ఆరో స్థానమునందు పంచమంలో శని ప్రభావంచేత ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకు వ్యాపారము నందు అనుకూల ఫలితములు కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము. ప్రయాణములు అనుకూలించును. శారీరక శ్రమ అధికముగా ఉండును. వివాదములకు దూరంగా ఉండాలని సూచన. వృశ్చిక రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు దుర్గాదేవిని మంగళవారం రోజు పూజించడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు అనుకూలముగా ఉన్నది. చతుర్థ స్థానమునందు రవి, బుధ, గురుల ప్రభావం చేత కుటుంబ సౌఖ్యము కలుగును. ఆర్థిక సమస్యల నుండి బయటకు వచ్చెదరు. పంచమ స్థానమునందు శుక్ర, రాహువుల ప్రభావంచేత కుటుంబ సౌఖ్యము, లాభము పొందెదరు. ప్రయాణములు అనుకూలించును. ధనూరాశి వారికి శని అనుకూల స్థితి వలన చేసే పనులయందు విజయము పొందెదరు. కళత్ర స్థానమునందు కుజుని ప్రభావం వలన కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము. ధనూరాశి వారికి ఈరోజు ధనలాభము, సౌఖ్యము కలుగు సూచన. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ధనూరాశి వారు గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం, శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించాలి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలముగా ఉన్నది. చతుర్థ స్థానమునందు రవి, బుధ, గురుల ప్రభావం చేత కుటుంబ సౌఖ్యము కలుగును. ఆర్థిక సమస్యల నుండి బయటకు వచ్చెదరు. పంచమ స్థానమునందు శుక్ర, రాహువుల ప్రభావంచేత కుటుంబ సౌఖ్యము, లాభము పొందెదరు. ప్రయాణములు అనుకూలించును. శని అనుకూల స్థితి వలన చేసే పనులయందు విజయము పొందెదరు. కళత్ర స్థానమునందు కుజుని ప్రభావం వలన కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము. ఈరోజు ధనలాభము, సౌఖ్యము కలుగు సూచన. మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయలి. దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించాలి. మరియు శివారాధన చేయడం వలన శుభ ఫలితము కలుగును.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశివారికి జన్మరాశియందు శని సంచారం వలన శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ధన స్థానము కుటుంబ స్థానము వాక్ స్థానము అయినటువంటి 2వ ఇంట రవి, బుధ, గురుల ప్రభావం చేత ఆర్ధిక విషయాలు, ఖర్చులలో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకొను సూచనలు. కుటుంబ సమస్యలతో వాగ్వివిదాలకు దూరంగా ఉండాలని సూచన. తృతీయ స్థానము నందు శుక్ర, రాహువులు, పంచమ స్థానముల కుజుని అనుకూలత వలన ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడియున్నటువంటి సమయము. విద్యార్థులకు మధ్యస్థ ఫలితములు కలుగును. పనుల యందు ఆలస్యము. కుటుంబ వ్యవహారాలయందు చికాకులు కలుగును. కుంభరాశివారికి జన్మ శని ప్రభావంచేత గొడవలకు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. కుంభ రాశివారు ఈ రోజు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించుకోవడం మరియు దుర్గాదేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్గాష్టకం వంటివి చదువుకుని ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగును.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలు అధికముగా ఉన్నవి. జన్మరాశియందు రవి, బుధ, గురులు ప్రభావంచేత మీనరాశి వారికిశారీక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు అధికమగును. మీనరాశివారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. వ్యయస్థానము నందు శని (ఏలినాటి శని) ప్రభావంచేత మీనరాశి వారికి ఖర్చులు అధికముగా అగును. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు చెడు సమయము. వ్యాపారస్తులకు ఆర్ధిక సమస్యలు అధికముగా ఉండును. విద్యార్థులకు కష్ట సమయము. కోర్టు విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. మీనరాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయలి. దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించాలి. మరియు శివారాధన చేయడం వలన శుభ ఫలితము కలుగును.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్ 9494981000

WhatsApp channel

టాపిక్