Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఆ రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి!-horoscope today in telugu check astrological prediction for saurday 27 may 2023 ,రాశి ఫలాలు న్యూస్
Telugu News  /  Rasi Phalalu  /  Horoscope Today In Telugu, Check Astrological Prediction For Saurday 27 May 2023

Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఆ రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి!

Horoscope Today in Telugu
Horoscope Today in Telugu (Stock Photo)

Horoscope Today in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే, తేదీ మే 26, 2023కు సంబంధించి అందించిన రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today in Telugu: తెలుగు రాశి ఫలితములు (దిన ఫలితము) 27.05.2023

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: జ్యేష్టము, వారం: శనివారం, తిథి: శు. అష్టమి నక్షత్రం : మఖ

మేష రాశి :

మేషరాశివారికి ఈరోజు మధ్యస్థమునుండి అనుకూల ఫలితాలున్నాయి. మేషరాశికి జన్మస్థానమునందు బుధ, గురు, రాహువుల మరియు వాక్ స్థానం నందు రవి ప్రభావంచేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన. విశ్రాంతి కలుగును. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ముఖ్యమైన వాటికోసం ధనాన్ని ఖర్చు చేసేదరు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి :

వృషభరాశివారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. అలసట పెరుగును. భోజన సౌఖ్యము కలుగును. రాజకీయాలకు వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. జన్మరాశి యందు రవి ప్రభావం చేత అనారోగ్య సూచనలు అధికము. వ్యయ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత ఖర్చులు అధికముగా ఉండును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. నవగ్రహ ఆలయాలను దర్శించండి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మిథున రాశి :

ఈరోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. విశ్రాంతి పొందెదరు. ఆహ్లాదముగా గడిపెదరు. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. శివాలయాన్ని దర్శించండి. రాశి వారికి జన్మరాశి యందు శుక్రుడు, వాక్ స్థానమునందు కుజుని ప్రభావంచేత వివాదాలు ఏర్పడు సూచన. ధనాన్ని కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేసెదరు. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుటచేత మిథున రాశివారికి కలసివచ్చును. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

కర్కాటక రాశి :

ఈరోజు మీకు అనుకూలముగా లేదు. వివాదాలకు, చర్చలకు దూరంగా ఉండాలని సూచన. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. పనులయందు, ప్రయాణములయందు జాగ్రత్తలు వహించాలి. జన్మరాశియందు కుజుని ప్రభావంచేత శారీరక శ్రమ అధికముగా ఉండును. అయినప్పటికి లాభస్థానమునందు రవి, దశమ స్థానమునందు బుధ గురు, రాహువుల ప్రభావంచేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి :

ఈరోజు మీకు అనుకూలముగా ఉన్నది. ఆహ్లాదముగా గడిపెదరు. అవసరార్థం ధనాన్ని ఖర్చు చేసెదరు. సౌఖ్యమును పొందెదరు. లాభ స్థానములో శుక్రుడు దశమస్థానములో రవిప్రభావంచేత భాగ్య స్థానములో బుధ, గురు, రాహువుల ప్రభావం చేత సింహరాశివారికి చేసే ప్రతి పని అనుకూలించును. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

కన్య రాశి :

ఈరోజు మీకు అనుకూలముగా ఉన్నది. అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. సౌఖ్యము పొందెదరు. ముఖ్యమైన పనులు కోసం ధనమును ఖర్చు చేసెదరు. కన్యారాశి వారికి లాభస్థానములో కుజుడు, రాజ్యస్థానములో శుక్రుడు, భాగ్య స్థానములో రవి అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తు లాభము, కీర్తి కలుగును. నవగ్రహ ఆలయాలను దర్శించండి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

తులా రాశి :

ఈరోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ఖర్చులు పెరుగును. చర్చలకు దూరంగా ఉండాలని సూచన. ప్రయాణములు అనుకూలించును.కళత్ర స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత కుటుంబము నందు సమస్యలు, వాదనలు అధికమగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. శివాలయాన్ని దర్శించండి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి :

ఈరోజు మీకు అనుకూలంగా లేదు. శారీరక శ్రమ అధికము. ఆందోళనలు తగ్గించుకోవాలని సూచన. ఉద్యోగస్తులకు ఒత్తిళు అధికము. ప్రయాణములు లాభించును. అష్టమ స్థానము నందు శుక్రుడు, కళత్ర స్థానమందు రవి ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి :

ఈరోజు మీకు అనుకూలముగా ఉన్నది. లాభము కలుగును. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ఖర్చులు లాభించును. ఏడో స్థానమునందు శుక్రుడు, ఐదో స్థానమందు నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత అనుకున్న పనులు పూర్తి చేసెదరు. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించును. ధన లాభము కలుగును. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి :

ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయాలయందు కుటుంబ వ్యవహారాలయందు జాగ్రత్త వహించాలి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. చతుర్ధ స్థానమునందు బుధ, గురు, రాహువుల అనుకూలత వలన పంచమస్థానమునందు రవి అనుకూలత వలన అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. కళత్ర స్థానమునందు కుజుని ప్రభావంచేత కుటుంబములో సమస్యలు, ఘర్షణలు అధికమగును. నవగ్రహ ఆలయాలను దర్శించండి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కుంభ రాశి :

ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ప్రయాణములో చికాకులు కలుగును. శారీరక శ్రమ ఒత్తిళ్ళు ఏర్పడును. కుటుంబ విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ఆరో స్థానమునందు కుజుడు ఐదో స్థానమునందు శుక్రుడు తృతీయ స్థానమునందు రాహువు అనుకూల స్థితివలన అనుకున్న ప్రతీ పని అనుకున్న విధంగా పూర్తి చేసెదరు. శివాలయాన్ని దర్శించండి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

మీన రాశి :

ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వాదనలకు దూరంగా ఉండాలని సూచన. కుటుంబ వ్యవహారాలయందు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు నియత్రించుకోవల్సిన సమయము. ఏలినాటి శని ప్రభావం మరియు వాక్ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత వాదనలకు దూరంగా ఉండాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

సంబంధిత కథనం