Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు పట్టుదలతో అనుకున్నవి సాధించగలరు!-horoscope today in telugu check astrological prediction for saturday march 11 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Horoscope Today In Telugu, Check Astrological Prediction For Saturday, March 11, 2023

Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు పట్టుదలతో అనుకున్నవి సాధించగలరు!

HT Telugu Desk HT Telugu
Mar 11, 2023 01:00 AM IST

Horoscope Today in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే, తేదీ మార్చి 11, 2023కు సంబంధించి అందించిన రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today in Telugu
Horoscope Today in Telugu (Unsplash)

Horoscope Today in Telugu: తెలుగు రాశి ఫలాలు (దిన ఫలాలు) 11.03.2023

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: ఫాల్గుణము వారం: శనివారం, తిథి: కృ. చవితి నక్షత్రం : స్వాతి

మేష రాశి :

మేష రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. మేషరాశి వారికి లాభస్థానములో రవి, బుధ, శనుల సంచారంచేత పనులయందు అనుకూలత, ఆర్థిక లాభము, శుభ ఫలితములు కలుగుచున్నవి. జన్మ స్థానము రాహువు ద్వితీయ స్థానమునందు కుజుని ప్రభావంచేత మేషరాశివారు గొడవలకు దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. నూతనంగా వస్తువులు కొనడానికి ధనాన్ని ఖర్చు చేసెదరు. వాహనాలు, గృహాలు వంటి వాటికి ధనము ఖర్చు చేయు సూచన. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలున్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. మేషరాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

వృషభ రాశి :

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. జన్మరాశి యందు కుజుని ప్రభావంచేత వృషభరాశి వారు ఒత్తిళ్ళు అధికమగును. దశమంలో రవి, బుధ, శని ప్రభావం చేత వృషభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలించును. లాభములో గురు, శుక్రుల అనుకూల స్థితి వలన ధనలాభము, కుటుంబ సౌఖ్యము కీర్తి కలుగును. గృహమునందు శుభ కార్యములు జరుగును. ఆవేశపూరిత నిర్ణయాలకు పౌరుషపు పట్టుదలకు దూరంగా ఉండాలని సూచన. వృషభరాశివారికి లాభమునందు గురుడు, దశమము నందు శని ప్రభావం చేత ఆర్ధికపరంగా లాభము చేకూరును. ఉద్యోగులకు లాభదాయకముగా ఉండును. వృషభరాశి వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలించును స్త్రీలకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వృషభరాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

మిథున రాశి :

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలముగా ఉంది. మిధున రాశి వారికి భాగ్య స్థానమునందు రవి,బుధ, శనుల ప్రభావంచేత ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. దశమంలో గురు, శుక్రుల ప్రభావంచేత ఉద్యోగములో ఒత్తిళ్ళు తగ్గును. లాభములో రాహువు ప్రభావంచేత పనుల యందు లాభము చేకూరును. దశమంలో గురుడు, లాభములో రాహువు అనుకూల ప్రభావంచేత సమస్యలను, ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమించెదరు. మిథునరాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు అధికముగా ఉన్నాయి. అష్టమ స్థానములో రవి, బుధ, శనుల ప్రభావంచేత కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాలయందు, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అనారోగ్య సూచనలు కనబడుచున్నవి. భాగ్యస్థానమునందు గురు, శుక్రుల అనుకూల స్థితివలన మీ తెలివితేటలతో సమస్యలను అధిగమించెదరు. దశమంలో రాహువు ప్రభావంచేత ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూలించును. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులు కష్టపడాల్సిన సమయము. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు ఏర్పడుచున్నవి. కర్కాటక రాశివారు మరిన్ని శుభఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

సింహ రాశి :

సింహరాశి వారికి ఈ రోజు మధ్యస్థమునుండి అనుకూల ఫలితాలున్నాయి. కళత్ర స్థానమునందు రవి, బుధ, శనుల ప్రభావంచేత కుటుంబము నందు చికాకులు, సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అష్టమ గురు, శుక్రుల ప్రభావం చేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. సింహరాశి వారికి భాగ్యములో రాహువు సంచారం వలన కుటుంబ విషయాల యందు, ఆర్థిక వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. దశమంలో కుజుని ప్రభావం చేత సింహరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడుచున్నవి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము. స్త్రీలకు ఈ రోజు మధ్యస్థముగా ఉన్నది. సింహరాశి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

కన్య రాశి :

కన్యారాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. కన్యారాశి వారికి ఆరో స్థానమునందు రవి, బుధ, శనుల ప్రభావంచేత సమాజంలో కీర్తి, శత్రువులపై విజయము కలుగును. అనుకున్న ప్రతీ పనియందు విజయాన్ని చూచెదరు. కళత్ర స్థానమునందు గురు, శుక్రుల సంచారంవలన కుటుంబ సౌఖ్యము, శారీరక సౌఖ్యము, మానసిక సౌఖ్యము పొందెదరు. అష్టమ స్థానమునందు రాహువు, భాగ్యస్థానము నందు కుజుని సంచారము వలన శారీరక శ్రమ, ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అయినప్పటికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ప్రయాణములు లాభించును. ధనలాభము, కీర్తి కలుగును. ఉద్యోగస్తులకు అనుకూల సమయము, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలున్నవి. కన్యా రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

తులా రాశి :

తులారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. పంచమంలో శని, బుధ, రవిల అనుకూల ప్రభావంచేత తులారాశివారు చేసే పనుల యందు అనుకూలమైన ఫలితాలు పొందెదరు. శత్రు స్థానములో గురు, శుక్రుల ప్రభావంచేత, ఆయు స్థానములో కుజుని ప్రభావంచేత తులారాశి వారికి శత్రు వర్గము వలన ఇబ్బందులు, కుటుంబము నందు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన తులారాశివారు అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. జన్మరాశి యందు కేతువు, సప్తమ స్థానము నందు రాహువు ప్రభావంచేత చికాకులు, ఒత్తిళ్ళు ఏర్పడును. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు కలుగును. విద్యార్థులకు మధ్యస్థ ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సౌఖ్యము. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

వృశ్చిక రాశి :

వృశ్చికరాశికి ఈ రోజు అనుకూలముగా ఉన్నది. అర్ధాష్టమ శని ప్రభావంచేత, కళత్ర స్థానములో కుజుని ప్రభావం చేత కుటుంబ సమస్యలు, పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. పంచమంలో గురు, శుక్రుల అనుకూలత వలన మీ తెలివితేటలతో సమస్యలను అధిగమించెదరు. కుటుంబ సౌఖ్యము కలుగును. ప్రయాణములు అనుకూలించును. శారీరక శ్రమ అధికముగా ఉండును. వృశ్చికరాశివారు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. వివాదములకు దూరంగా ఉండాలని సూచన. పంచమ స్థానమునందు గురు, శుక్రుల ప్రభావంచేత ముఖ్యమైన పనులు విజయవంతముగా పూర్తి చేసెదరు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

ధనుస్సు రాశి :

ధనూ రాశి వారికి ఈ రోజు అనుకూలముగా ఉన్నది. తృతీయ స్థానమునందు రవి, బుధ, శుక్రుల ప్రభావం చేత సోదరీసోదరులతో సఖ్యత కలుగును. ఆర్థిక సమస్యల నుండి బయటకు వచ్చెదరు. చతుర్ధ స్థానమునందు గురు, శుక్రుల ప్రభావంచేత కుటుంబ సౌఖ్యము, లాభము పొందెదరు. ప్రయాణములు అనుకూలించును. ధనూరాశి వారికి కుజ , గురు గ్రహాల అనుకూల స్థితి వలన చేసే పనులయందు విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి వారం. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము. ధనూరాశి వారికి రోజు ధనలాభము సౌఖ్యము కలుగు సూచన. ధనూరాశి వారు వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

మకర రాశి :

మకర రాశి వారికి ఈ రోజు మధ్యస్థముగా ఉన్నది. ధనస్థానమునందు రవి, బుధ, శుక్రుల ప్రభావంచేత శారీరక శ్రమ, ఖర్చులు అధికమగును. మానసిక ఒత్తిళ్ళు పెరుగును. గొడవలకు, వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. తృతీయ స్థానమునందు గురు, శుక్రుల సంచారంచేత బంధుమిత్రులతో, సోదరులతో భేదాభిప్రాయములు కలుగు సూచన. చతుర్థ స్థానము నందురాహువు, పంచమ స్థానము నందు కుజుని సంచారంచేత మీ మొండితనముతో పట్టుదలతో అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ఏలినాటి శని ప్రభావం చేత ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ధనపరమైన విషయాల్లో చికాకులు ఏర్పడును. ఆర్ధిక సమస్యలు అధికముగా ఉండును. మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

కుంభ రాశి :

కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశివారికి జన్మరాశియందు రవి, బుధ, శనులు ప్రభావంచేత (ఏలినాటి శని ప్రభావంచేత) మానసిక ఒత్తిళ్ళు, వేదనలు, సమస్యలు అధికముగా ఉండును. పనుల యందు ఆలస్యము. కుటుంబ వ్యవహారాలయందు చికాకులు కలుగును. ద్వితీయ స్థానమునందు గురు, శుక్రుల అనుకూల స్థితివలన, తృతీయస్థానమునందు రాహు అనుకూల ప్రభావం చేత కుంభరాశివారు వారి తెలివి తేటలతో ఆర్ధిక సమస్యల నుండి ఒత్తిళ్ళనుండి బయటపడెదరు. చేసే పనులు అనుకూలించి సత్ఫలితాలు ఇచ్చును. గత కొంతకాలముతో పోల్చుకుంటే కుంభరాశి వారికి రాహు, కేతు, గురు, శుక్రుల అనుకూల గ్రహస్థితి వలన కుంభరాశివారికి గత కొంతకాలము వేధిస్తున్న అనేక సమస్యల నుండి బయట పడేటటువంటి ప్రయత్నములో విజయాన్ని పొందెదరు. కుంభ రాశివారు వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

మీన రాశి :

మీన రాశి వారికి ఈ రోజు మీకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నవి. జన్మరాశియందు రవి, బుధ, శనులు ప్రభావంచేత మీనరాశి వారికి అనారోగ్య సమస్యలు మానసిక ఒత్తిళ్ళు, శారీరక శ్రమ అధికముగా ఉండును. వ్యయస్థానములో రవి, బుధ, శనులు (ఏలినాటి) శని ప్రభావం చేత ఆర్ధిక సమస్యలు అధికమగును. ఖర్చులు నియంత్రించుకోవాలని పూచన. కోర్టు విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగములో సమస్యలు, రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు కఠినమైన సమయం. మీనరాశి విద్యార్థులకు కష్టపడాల్సిన సమయము. మీనరాశి వారు వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

 బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
WhatsApp channel

సంబంధిత కథనం