Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఈరోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి!-horoscope today in telugu astrological prediction for friday may 26 2023
Telugu News  /  Rasi Phalalu  /  Horoscope Today In Telugu, Astrological Prediction For Friday May 26, 2023
daily Horoscope
daily Horoscope (Unsplash)

Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఈరోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి!

26 May 2023, 1:00 ISTHT Telugu Desk
26 May 2023, 1:00 IST

Horoscope Today in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే, తేదీ మే 26, 2023కు సంబంధించి అందించిన రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today in Telugu: తెలుగు రాశి ఫలితములు (దిన ఫలితము) 26.05.2023

సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: జ్యేష్టము

వారం: శుక్రవారం, తిథి: శు. సప్తమి నక్షత్రం: ఆశ్లేష

మేష రాశి :

మేషరాశివారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. ఉత్సాహంగా గడిపెదరు. ప్రయాణములు అనుకూలించును. ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. మేషరాశికి జన్మస్థానమునందు బుధ, గురు, రాహువుల మరియు వాక్ స్థానం నందు రవి ప్రభావంచేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి :

వృషభరాశివారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఆహ్లాదకరమైన వార్తలు వినెదరు. జన్మరాశి యందు రవి ప్రభావం చేత అనారోగ్య సూచనలు అధికము. వ్యయ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత ఖర్చులు అధికముగా ఉండును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

మిథున రాశి :

ఈరోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలంగా ఉన్నది. ఖర్చులు అధికమగును. ప్రయాణములు కలసివచ్చును. ఆహ్లాదముగా గడిపెదరు. జన్మరాశి యందు శుక్రుడు, వాక్ స్థానమునందు కుజుని ప్రభావంచేత వివాదాలు ఏర్పడు సూచన. ధనాన్ని కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేసెదరు. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుటచేత మిథునరాశివారికి కలసివచ్చును. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి :

ఈరోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ప్రయాణములు చేయవలసి వచ్చును. ఖర్చులు పెరుగును. ఒత్తిళ్ళు ఏర్పడును. జన్మరాశియందు కుజుని ప్రభావంచేత శారీరక శ్రమ అధికముగా ఉండును. అయినప్పటికి లాభస్థానమునందు రవి, దశమ స్థానమునందు బుధ గురు, రాహువుల ప్రభావంచేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి :

ఈరోజు మీకు మధ్యస్థము నుండి అనుకూలముగా ఉన్నది. ఆహ్లాదముగా గడిపెదరు. ప్రయాణములలో ఇబ్బందులు పడు సూచన. లాభ స్థానములో శుక్రుడు దశమస్థానములో రవిప్రభావంచేత భాగ్య స్థానములో బుధ, గురు, రాహువుల ప్రభావం చేత సింహరాశివారికి చేసే ప్రతి పని అనుకూలించును. మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్య రాశి :

ఈరోజు మీకు అనుకూలముగా ఉన్నది. సౌఖ్యమును పొందెదరు. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. కన్యారాశి వారికి లాభస్థానములో కుజుడు, రాజ్యస్థానములో శుక్రుడు, భాగ్య స్థానములో రవి అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తు లాభము, కీర్తి కలుగును. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శు భఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

తులా రాశి :

ఈరోజు మీకు అనుకూలముగా ఉన్నది. ఆహ్లాదముగా గడిపెదరు. పనుల యందు చికాకులు కలిగినప్పటికి పూర్తి చేసెదరు. కళత్ర స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత కుటుంబము నందు సమస్యలు, వాదనలు అధికమగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి :

ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ఆహ్లాదముగా గడిపెదరు. స్త్రీలకు సౌఖ్యము విద్యార్థులకు అనుకూలంగా ఉండును. అష్టమ స్థానము నందు శుక్రుడు, కళత్ర స్థానమందు రవి ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి :

ఈరోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ఖర్చులు అధికము. శారీరక శ్రమ. చర్చలకు దూరంగా ఉండాలని సూచన. భోజనప్రాప్తి. ఏడో స్థానమునందు శుక్రుడు, ఐదో స్థానమందు నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత అనుకున్న పనులు పూర్తి చేసెదరు. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించును. ధన లాభము కలుగును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి :

ఈరోజు మీకు మధ్యస్థమునుండి చెడు ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు చికాకులు అధికము. స్త్రీలకు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. చతుర్ధ స్థానమునందు బుధ, గురు, రాహువుల అనుకూలత వలన పంచమస్థానమునందు రవి అనుకూలత వలన అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. కళత్ర స్థానమునందు కుజుని ప్రభావంచేత కుటుంబములో సమస్యలు, ఘర్షణలు అధికమగును. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

కుంభ రాశి :

ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రయాణములలో శ్రమ అధికము. ఖర్చులు పెరుగును. అధిక శ్రమ పడాల్సినటువంటి రోజు. ఆరో స్థానమునందు కుజుడు ఐదో స్థానమునందు శుక్రుడు తృతీయ స్థానమునందు రాహువు అనుకూల స్థితివలన అనుకున్న ప్రతీ పని అనుకున్న విధంగా పూర్తి చేసెదరు. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి :

ఈరోజు మీకు మధ్యస్థమునుండి చెడు ఫలితాలున్నాయి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. పనులు యందు ఒత్తిళ్ళు అధికమగును. ఏలినాటి శని ప్రభావం మరియు వాక్ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత వాదనలకు దూరంగా ఉండాలి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

సంబంధిత కథనం