Horoscope Today। నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు!-horoscope today check predictions today for your zodiac sign ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Horoscope Today, Check Predictions Today For Your Zodiac Sign

Horoscope Today। నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు!

HT Telugu Desk HT Telugu
Sep 18, 2022 07:32 AM IST

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తేదీ సెప్టెంబర్ 18, 2022. ఆదివారంకు సంబంధించి అందించిన రాశి ఫలాలను ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today
Horoscope Today (Pixabay)

Horoscope Today: నేటి రాశి ఫలితములు (దిన ఫలితము) 18.9.2022

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: దక్షిణాయనం, మాసం: భాద్రపదం,

వారం: ఆదివారం, తిథి: కృ. అష్టమి నక్షత్రం: మృగశిర

మేషరాశి :

మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్తంగా ఉంది. కొంత చికాకులు కలుగును. పనులయందు అలసత్వం వహించెదరు. ఖర్చు అధికముగా ఉండును. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. మానసిక ఇబ్బందులు కొంత కలిగేటటువంటి సూచనలున్నాయి. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. మేషరాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు సూర్యాష్టకం పఠించండి.

వృషభరాశి :

ఈ రోజు మధ్యస్తంగా ఉంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్య విషయములపై చర్చించెదరు. శుభవార్తను వింటారు. సుఖ భోజన ప్రాప్తి కలుగును. మానసిక అలసట ఏర్పడును. భేదాభిప్రాయ సూచనలు అధికముగా ఉన్నవి. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

మిథునరాశి :

ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. మానసిక ఒత్తిళ్ళు, శారీరక శ్రమ ఏర్పడును. పనులలో చికాకులు కలుగును. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించెదరు. ధన సంబంధిత విషయాలలో ఖర్చులు తగ్గించుకుని ఆచితూచి వ్యవహరించండి. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. ప్రయాణమునందు ఖర్చులు అధికమగు సూచన. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మిథునరాశివారు ఆదిత్య హృదయాన్ని పఠించండి.

కర్కాటక రాశి :

ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. విశ్రాంతి కలుగును. సుఖభోజన ప్రాప్తి. ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. శారీరక సౌఖ్యమును పొందెదరు. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్థిక విషయాలు అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగును. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది. కర్కాటక రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

సింహ రాశి :

ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. మానసికంగా ప్రశాంతంగా ఉండెదరు. సుఖ భోజన ప్రాప్తి. శత్రువర్గంతో జాగ్రత్తలు వహించాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడులు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉన్నది. సింహరాశి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి.

కన్యారాశి :

ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నవి. మృష్టాన్న భోజనం మరియు శారీరక సౌఖ్యం కలుగును. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. కీర్తి కలుగును. ప్రయాణములు అధికమగును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును ఆరోగ్య విషయాల్లో మరియు కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. కన్యా రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకాన్ని పఠించడం వలన శుభ ఫలితం కలుగును.

తులా రాశి :

ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. అనుకున్న పని పూర్తి చేసెదరు. విశ్రాంతి పొందెదరు. మరియు సుఖ భోజన ప్రాప్తి. శరీర సౌఖ్యం కోసం ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. మానసిక ఆనందము కలుగును. ధనలాభము కలుగును. కుటుంబముతో చర్చలకు దూరంగా ఉండండి. సంతానము వలన సంతోషము కలుగును. తులారాశి వారు ఈ రోజుమరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి :

ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించెదరు. ఇష్టమైన వస్తువుల కోసం ధనమును ఖర్చు చేసెదరు కుటుంబ సభ్యులతో గడిపెదరు.పిల్లల వలన చికాకులు పెరుగును. మీ పనులతో ఎదుటి వారి మన్నన పొందుటకు ప్రయత్నం చేసెదరు. వృశ్చిక రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి.

ధనూ రాశి :

ఈ రోజు మీకు చెడు ఫలితాలున్నవి. మీరు చేసే ప్రతీ పని యందు ఆచితూచి వ్యవహరించండి. కుటుంబములో చికాకులు ఏర్పడును. శారీరక శ్రమ కలుగును. ఖర్చులు పెరుగును. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఏర్పడును. ధనూరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది.

మకర రాశి :

ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. మృష్టాన్న భోజన ప్రాప్తి. శారీరక సౌఖ్యము మరియు ప్రశాంతత కలుగును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. చికాకులు అధికముగా ఉండును. కీర్తి ప్రతిష్టలు పెరుగును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత ఆరోగ్య విషయమునందు కుటుంబ వ్యవహారముల యందు వృత్తి వ్యాపారముల యందు జాగ్రత్తలు వహించాలి. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు ఆదిత్య హృదయము మరియు నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి.

కుంభ రాశి :

ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నవి. ఏలినాటి శని ప్రభావం చేత కుటుంబంలోని వారితోటి ఆచితూచి వ్యవహరించండి. ఏలినాటి శని ప్రభావము కుంభరాశివారికి తీవ్రముగా ఉన్నది. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించవలసిన సమయము. ఖర్చులు పెరుగును. రాబడి తగ్గును, శత్రువుల బాధలు అధికముగా ఉండును. ఉద్యోగము కోసము చేసే ప్రయత్నాలు సఫలమయ్యే సూచన. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు ఆదిత్య హృదయము మరియు నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి :

ఈ రోజు మీకు అనుకూలముగా ఉన్నది. శారీరకంగా ఉల్లాసంగా ఉండెదరు. ఆందోళనలు తగ్గును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. ప్రతీ పనిలో విజయాన్ని పొందెదరు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్ 9494981000.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్