Horoscope Today।నేటి రాశి ఫలాలు..ఈరోజు ఆ రాశి వారు ఏది అనుకుంటే అది జరిగిపోతుంది!-horoscope today astrological prediction for september 19 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Horoscope Today, Astrological Prediction For September 19, 2022

Horoscope Today।నేటి రాశి ఫలాలు..ఈరోజు ఆ రాశి వారు ఏది అనుకుంటే అది జరిగిపోతుంది!

HT Telugu Desk HT Telugu
Sep 19, 2022 05:13 AM IST

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తేదీ సెప్టెంబర్ 19, 2022. సోమవారంకు సంబంధించి అందించిన రాశి ఫలాలను ఇక్కడ తెలుసుకోండి.

Today Horoscope
Today Horoscope (Unsplash)

Horoscope Today: తెలుగు రాశి ఫలితములు (దిన ఫలితము) 19.9.2022

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం: శుభకృత్ నామ,

అయనం: దక్షిణాయనం, మాసం: భాద్రపదం,

వారం: సోమవారం, తిథి: కృ. నవమి నక్షత్రం: ఆరుద్ర

మేష రాశి :

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ఖర్చు అధికముగా ఉండును. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. మానసిక ఇబ్బందులు కొంత కలిగేటటువంటి సూచనలున్నాయి. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. మేషరాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడం మంచిది.

వృషభ రాశి :

ఈ రోజు మీకు అనుకూలముగా ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. శుభవార్తను వింటారు. సుఖ భోజన ప్రాప్తి కలుగును. శారీరక శ్రమ కొంత అధికముగా ఉండును. మానసిక అలసట ఏర్పడును. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగును. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వృషభరాశివారు లింగాష్టకాన్ని పఠించడం మంచిది.

మిథున రాశి :

ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిళ్ళు, శారీరక శ్రమ ఏర్పడును. పిల్లల వలన చికాకులు ఏర్పడును. మీయొక్క కృషి చేత ధనపరమైన విషయాలలో లాభము పొందెదరు. కుటుంబములో కొంత ఇబ్బందులు ఏర్పడును. ప్రయాణమునందు ఖర్చులు అధికమగు సూచన. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మిధునరాశివారు రుద్రాభిషేకము, శివారాధన చేయటం వలన ఈ రోజు మంచిది.

కర్కాటక రాశి :

ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. శారీరక సౌఖ్యమును పొందెదరు. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్థిక విషయాలు అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగును. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది. కర్కాటక రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బిల్వాష్టకము, శివాభిషేకం చేసుకోవడం వలన శుభ ఫలితము కలుగును.

సింహ రాశి :

ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. శత్రువర్గంతో జాగ్రత్తలు వహించాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడులు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉన్నది. సింహరాశి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు శివాలయంలో శివునికి అభిషేకము చేసుకోవడం మంచిది.

కన్య రాశి :

ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నవి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. కీర్తి కలుగును. ప్రయాణములు అధికమగును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. కన్యా రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం చంద్రశేఖరాష్టకము, లింగాష్టకం పఠించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగును.

తులా రాశి :

ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించడం మంచిది. శరీర సౌఖ్యం కోసం ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. మానసిక ఆనందము కలుగును. ధనలాభము కలుగును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. కుటుంబ సౌఖ్యము కలుగును. సంతానము వలన సంతోషము కలుగును. అప్పుల వత్తిడి వుండును. మిత్రుల ద్వారా సహాయము పొందెదరు. తులారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో శివునికి అభిషేకం చేసుకోవడం వలన మరింత శుభఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి :

ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నవి.శారీరక శ్రమ అధికముగా ఉండును. ఉద్యోగములో ఒత్తిళ్ళు వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు. ధనలాభము మరియు కుటుంబ సౌఖ్యము కలుగును. సోదరులు మరియు పిల్లల వలన చికాకులు కలుగును. ఉద్యోగంలో వత్తిళ్ళు అధికముగా ఉండును. శత్రువులు మిత్రులుగా వ్యవహరించెదరు. వృశ్చిక రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లింగాష్టకము, బిల్వాష్టకము చదువుకోవడం వలన మరింత శుభఫలితాలు పొందెదరు.

ధనూ రాశి :

ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితముగా ఉన్నది. మీరు చేసే ప్రతీ పని యందు ఆచితూచి వ్యవహరించండి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బంధు వియోగం ఏర్పడు సూచన. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఏర్పడును. ధనూరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో శివునికి అభిషేకం చేసుకోవడం వలన మరింత శుభఫలితాలు పొందుతారు.

మకర రాశి :

ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. చికాకులు అధికముగా ఉండును. కీర్తి ప్రతిష్టలు పెరుగును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు శివాలయంలో శివుని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం శివాష్టకము మరియు లింగాష్టకము పఠించడం వలన ఆరోగ్య స్థితి కలుగును.

కుంభ రాశి :

ఈ రోజు మీకు మధ్యస్థము నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నవి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించండి. ఏలినాటి శని ప్రభావము కుంభరాశివారికి తీవ్రముగా ఉన్నది. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించవలసిన సమయము. శత్రువుల బాధలు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు సమస్యలు అధికముగా ఉన్నవి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో విభూతితో శివునికి అభిషేకం చేసుకోవడం, అలాగే శివపంచాక్షరీ మంత్రంలో జపం చేయడం వలన వలన శుభ ఫలితములు కలుగును.

మీన రాశి :

ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. శారీరక శ్రమ అధికముగా ఉండును. ఆందోళన కలుగును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. ప్రతీ పనిలో విజయాన్ని పొందెదరు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్ 9494981000.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్