Home Vastu Tips: వాస్తు ప్రకారం ఈ 7 తప్పులు చేయకుండా చూసుకోండి.. ఆర్థిక ఇబ్బందులు, కష్టాల నుంచి బయటపడచ్చు-home vastu tips never do these 7 mistakes or else you may have to suffer with problems ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Home Vastu Tips: వాస్తు ప్రకారం ఈ 7 తప్పులు చేయకుండా చూసుకోండి.. ఆర్థిక ఇబ్బందులు, కష్టాల నుంచి బయటపడచ్చు

Home Vastu Tips: వాస్తు ప్రకారం ఈ 7 తప్పులు చేయకుండా చూసుకోండి.. ఆర్థిక ఇబ్బందులు, కష్టాల నుంచి బయటపడచ్చు

Peddinti Sravya HT Telugu

Home Vastu Tips: కొన్నిసార్లు ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ఈ 7 తప్పులు చేయకుండా చూసుకోండి. ప్రతికూల శక్తి ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది.

వాస్తు ప్రకారం ఈ 7 తప్పులు చేయకుండా చూసుకోండి

కొన్నిసార్లు ఇంట్లో ఉపయోగించని వస్తువులను ఉంచడం వల్ల వాస్తు దోషాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, అనవసరమైన వస్తువులను ఇంట్లో ఉంచకూడదు. అలా చేయడం వల్ల ప్రతికూల శక్తి ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది.

అంతే కాదు, కొన్ని వస్తువులను తప్పు మార్గంలో లేదా ఏదో ఒక దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, వాస్తు దోషాలను నివారించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి కలుగుతుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

వాస్తు ప్రకారం పాటిస్తే ఇబ్బందులు నుంచి బయటపడచ్చు. చాలా మంది తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోవడం మంచిది.

వాస్తు ప్రకారం ఈ 7 తప్పులు చేయకుండా చూసుకోండి

  • కొంతమందికి పాత వార్తాపత్రికలు సేకరించే అలవాటు ఉంటుంది.అదే సమయంలో పాత వార్తా పత్రికలు, డైరీలను ఇంట్లో భద్రపరచడం వల్ల పనిలో ఆటంకాలు ఏర్పడతాయి.
  • మీ ఇంటి పూజ గదిలో ఉన్న దేవుళ్ల విగ్రహాలు లేదా ఫోటోలు చిరిగిపోయినా, పగిలిపోయినా ముందుగా వాటిని మార్చాలి. ఇవి ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.
  • పాత పెన్నులు, టీవీలు, పాడైపోయిన గడియారాలు, ఇనుప పెట్టెలు మొదలైన వాటిని ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూలత వ్యాప్తి చెందుతుంది.
  • ఇంటి పైకప్పుపై చెత్తాచెదారం ఉంటే టెన్షన్, అడ్డంకులను సృష్టిస్తుంది. కాబట్టి వాస్తు దోషాలను నివారించడానికి ఈ వస్తువులను వెంటనే తొలగించండి.
  • ఉపయోగించని తాళాలు, పని చేయనివి ఉంటే వాటిని తొలగించాలి.ఇవి జీవితంలో ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది.
  • కొంతమంది పనికిరాని వస్తువులను స్టోర్ రూమ్ లో ఉంచుతారు. అలాంటి వాటిని కూడా ఉంచకూడదు. దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది.ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
  • అదే సమయంలో నిద్ర పోయేటప్పడు తల దగ్గర వాటర్ బాటిల్ ఉంచకూడదు.ఇది మానసిక అనారోగ్యానికి దారితీస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం