Holi and Lunar Eclipse: హోలీ రోజు ఈ సమయం నుంచి చంద్రగ్రహణం ప్రారంభం.. ఈ 5 తప్పులు చేయకండి, భారీ నష్టం కలగవచ్చు-holi and lunar eclipse on the same day do not do these mistakes or else problems may arrive ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Holi And Lunar Eclipse: హోలీ రోజు ఈ సమయం నుంచి చంద్రగ్రహణం ప్రారంభం.. ఈ 5 తప్పులు చేయకండి, భారీ నష్టం కలగవచ్చు

Holi and Lunar Eclipse: హోలీ రోజు ఈ సమయం నుంచి చంద్రగ్రహణం ప్రారంభం.. ఈ 5 తప్పులు చేయకండి, భారీ నష్టం కలగవచ్చు

Peddinti Sravya HT Telugu
Published Mar 14, 2025 09:20 AM IST

Holi and Lunar Eclipse: చాలా ఏళ్ల తర్వాత చంద్ర గ్రహణం హోలీ నాడు వచ్చింది. చంద్రగ్రహణాన్ని శుభ గడియాలుగా భావించరు. మరి హోలీ నాడు చంద్రగ్రహణం రావడంతో ఎటువంటి పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హొలీ నాడు చంద్రగ్రహణం రావడంతో ఈ తప్పులు చేయకండి
హొలీ నాడు చంద్రగ్రహణం రావడంతో ఈ తప్పులు చేయకండి (pinterest)

ఈసారి హోలీ పండుగ నాడే చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సమయంలో హోలీ నాడు కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి. మరి హోలీ నాడు చంద్రగ్రహణం రావడంతో ఎటువంటి పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా ఏళ్ల తర్వాత చంద్ర గ్రహణం హోలీ నాడు వచ్చింది. చంద్రగ్రహణాన్ని శుభ గడియాలుగా భావించరు. అయితే, ఈ సంవత్సరంలో వస్తున్న మొదటి చంద్రగ్రహణం భారత దేశంలో కనిపించదు. కాబట్టి సూతక కాలం భారతదేశంలో వర్తించదు. అయినప్పటికీ చంద్రగ్రహణం సమయంలో కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి.

చంద్రగ్రహణం సమయం

చంద్రగ్రహణం సమయం విషయానికి వస్తే, ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ సమయంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు.

చంద్రగ్రహణం సమయంలో చేయకూడని పొరపాట్లు

  1. చంద్రగ్రహణం ఉదయం 9:30 కి మొదలవుతుంది. అప్పటినుంచి దేవుడు విగ్రహాలని ముట్టుకోకూడదు. కాబట్టి 9:30 కి ముందే హోలీ పూజని జరుపుకోవాలి. ఒకవేళ కనుక ఇంట్లో ఉన్న దేవుడు విగ్రహాలని ముట్టుకున్నట్లయితే సమస్యలు వస్తాయి.
  2. చంద్ర గ్రహణం సమయంలో తులసి మొక్కని ముట్టుకోకూడదు. తులసి మొక్క నుంచి తులసి దళాలని తెంపకూడదు. అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
  3. గర్భిణీలు పదునైన వస్తువులని గ్రహణం సమయంలో ముట్టుకోవడం మంచిది కాదు. వాటిని ముట్టుకోవడం, వాటిని ఉపయోగించడం వలన కడపలో ఉన్న బిడ్డకు ఇబ్బందులు కలగవచ్చు.
  4. గ్రహణం సమయంలో వంట చేయడం, భోజనం తినడం వంటివి చేయకూడదు. ఇవి ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. మానసిక, శారీరక ఇబ్బందులు కూడా ఎదురవచ్చు. గ్రహణం రాకుండా వంట చేసుకుని దర్బ పుల్ల దానిపై పడేసి గ్రహణం తర్వాత తినొచ్చు.
  5. చంద్రగ్రహణం హోలీ ఒకే రోజు వచ్చాయి. ఈ సమయంలో స్మశానాలకు వెళ్లడం వంటివి చేయకూడదు. ఇవి ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail
Whats_app_banner

సంబంధిత కథనం