Sita Navami 2023 । సీతమ్మ ఆశీర్వాదంతో.. వివాహ ఆటంకాలు తొలగుతాయి, బంధాలు బలపడతాయి!-happy sita navami 2023 puja rituals shubha muhurat details ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Happy Sita Navami 2023 Puja Rituals Shubha Muhurat Details

Sita Navami 2023 । సీతమ్మ ఆశీర్వాదంతో.. వివాహ ఆటంకాలు తొలగుతాయి, బంధాలు బలపడతాయి!

HT Telugu Desk HT Telugu
Apr 29, 2023 09:58 AM IST

Happy Sita Navami 2023: సీత నవమి రోజు పాటించాల్సిన ఆచారాలు. వివాహిత స్త్రీలు ఏం చేయాలి, శుభ ముహుర్త సమయాలు, మొదలైన విశేషాలను తెలుసుకోండి.

Happy Sita Navami 2023:
Happy Sita Navami 2023: (Stock Pic)

Happy Sita Navami 2023: సీతా నవమిని 'సీతా జయంతి' లేదా 'జానకి నవమి' అని కూడా పిలుస్తారు. ఇది శ్రీరాముని ధర్మపత్ని సీతా దేవి జన్మదినంను సూచించే పర్వదినం. హిందూ క్యాలెండర్ ప్రకారం, శ్రీరామ నవమికి నెలరోజుల తర్వాత వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్ష నవమి తిథినాడు సీతమ్మ జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. రాముడు కూడా ఇదే తిథిలో చైత్ర మాసంలో జన్మించాడు. రామాలయాల్లో సీతా నవమి వేడుకలు వైభంగా జరుగుతాయి. ప్రత్యేక పూజలతో సీతారాములను ఆరాధిస్తారు. ముఖ్యంగా వివాహమైన హిందూ స్త్రీలు ఈ రోజున సీతమ్మను భక్తితో పూజిస్తారు. ఇది వారి భర్తలకు దీర్ఘాయుష్షును, జీవితంలో గొప్ప విజయాలను అందిస్తుందని నమ్ముతారు.

ట్రెండింగ్ వార్తలు

అంతేకాదు అవివాహితులు, లేదా వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న యువతీయువకులు సీతానవమి పర్వదినం రోజున సీతారాములను పూజిస్తే వీరి ఆశీర్వాదంతో త్వరలోనే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. వైవాహిక జీవితంలో శాంతి, శ్రేయస్సు కోసం. వైవాహిక బంధం దృఢంగా ఉండటం కోసం కూడా సీతారాములను పూజించాలి.

సీత నవమి రోజు పాటించాల్సిన ఆచారాలు

  1. సీతా నవమి నాడు, శ్రీరాముడు లక్ష్మణుడు మారుతి సమేతంగా సీతాదేవిని పూజిస్తారు. చిన్న పూజా మండపాన్ని ఏర్పాటు చేసి, రంగురంగుల పూలతో అలంకరించి సీతారాములను, జనక మహారాజు, తల్లి సునయన విగ్రహాలను కొలువుదీర్చి పూజిస్తారు. భూమిని దున్నుతుండగా సీతాదేవి ఉద్భవించినందున, ఈ రోజున భూమాతను కూడా పూజిస్తారు.
  2. సీతను, రాముడిని కలిసి పూజించడం వల్ల దాంపత్య జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. భక్తులు నువ్వులు, పరమాన్నం, పండ్లను నైవేద్యాలుగా సమర్పించి పూజ చేస్తారు. హారతి పూర్తయిన తర్వాత ప్రసాదంగా పంపిణీ చేయాలి.
  3. సీతా నవమి వ్రతం చేసే స్త్రీలు ఈరోజున కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. సీతా చాలీసాను పఠిస్తారు. సీతా నవమి వ్రతాన్ని ఆచరించడం వల్ల సీతమ్మకు ఉన్న ప్రేమగుణం, త్యాగ గుణం, స్వచ్ఛత, పవిత్రత, అంకితభావం మొదలైన గుణాలు లభిస్తాయి. ఈ సద్గుణాలే రక్షణ కవచంగా నిలుస్తాయని నమ్ముతారు.
  4. రామాలయాల్లో దివ్య దర్శనం, మహా అభిషేకం, హారతి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రామాయణ పఠనాలు, భజన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. జైశ్రీరామ్.. జై శ్రీసీతారామ్ అంటూ భక్తి పారవశ్యంతో సీతారాముల స్మరణ చేస్తారు.

సీతా నవమి శుభ ముహూర్త సమయాలు

వైశాఖ నవమి తిథి ఏప్రిల్ 28న సాయంత్రం 4.01 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 29న సాయంత్రం 6.22 గంటలకు ముగుస్తుంది. ఏప్రిల్ 29వ తేదీ శనివారం ఉదయ తిథిలో సీతా నవమి పర్వదినాన్ని జరుపుకుంటారు. మధ్యాహన ముహూర్తం 10:59 AM నుండి 01:38 PM వరకు ఉంది.

అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12.10 గంటల నుండి మధ్యాహ్న1.01 గంటల వరకు ఉంది.

అమృతకాల ముహూర్తం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 12.47 గంటల వరకు ఉంది.

రవి యోగం ఏప్రిల్ 29న మధ్యాహ్నం 12.47 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 30 ఉదయం 6.11 గంటలకు ముగుస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్