ఈరోజే హనుమాన్ జయంతి.. ఈరోజు ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోండి!-hanuman jayanthi on may 22nd check what to do and remedies to be followed ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈరోజే హనుమాన్ జయంతి.. ఈరోజు ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోండి!

ఈరోజే హనుమాన్ జయంతి.. ఈరోజు ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోండి!

Peddinti Sravya HT Telugu

హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమి నాడు జరపడంతో పాటగా వైశాఖ దశమి రోజు కూడా జరుపుకుంటారు. ఈరోజు వైశాఖ దశమి సందర్భంగా హనుమాన్ జయంతిని జరుపుకునేటప్పుడు, ఎటువంటి పరిహారాలని పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజే హనుమాన్ జయంతి

హిందువులు హనుమంతుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కష్ట సమయంలో హనుమంతుడు ఆదుకుంటాడని.. ఆపద్బాంధవుడని అంటారు. పైగా కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని నమ్ముతారు. హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమి నాడు జరపడంతో పాటగా వైశాఖ దశమి రోజు కూడా జరుపుకుంటారు. ఈరోజు వైశాఖ దశమి సందర్భంగా హనుమాన్ జయంతిని జరుపుకునేటప్పుడు, ఎటువంటి పరిహారాలని పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

హనుమాన్ జయంతి నాడు ఏం చేయాలి?

  1. హనుమాన్ జయంతి నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి.
  2. పసుపు కానీ ఎరుపు రంగు దుస్తులు కానీ ధరించి, హనుమంతుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.
  3. ముందుగా హనుమంతుని విగ్రహానికి సింధూరం రాయాలి. ఆ తర్వాత హనుమంతుడికి తమలపాకులు సమర్పిస్తే మంచిది.
  4. గులాబీ పూల దండను హనుమంతుడి విగ్రహానికి లేదా చిత్రపటానికి వేస్తే మంచిది.
  5. బెల్లం, వడపప్పుని నైవేద్యంగా పెట్టాలి.
  6. హనుమాన్ చాలీసాని ఈరోజు ఏడు సార్లు చదువుకుంటే మంచిది.
  7. రామాయణ పారాయణం చేస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు.
  8. హనుమాన్ జయంతి నాడు పేదలకు దుస్తులు, ఆహారం, డబ్బు దానం చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది.

హనుమాన్ జయంతి నాడు పాటించాల్సిన పరిహారాలు

  • హనుమాన్ జయంతి నాడు శని దోషం నుంచి బయటపడడానికి హనుమంతుడి విగ్రహం ముందు ఆవనూనెతో దీపారాధన చేయాలి. ఆ తర్వాత అందులో నల్ల నువ్వులు వెయ్యాలి. ఇలా చేయడం వలన శని ప్రభావం నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే, హనుమాన్ జయంతి రోజు నెయ్యిలో కొంచెం వాము వేసి ఆంజనేయ స్వామికి సమర్పిస్తే మంచిది. ఇలా చేయడం వలన మీకు ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
  • ఆర్థిక శ్రేయస్సు కలగాలంటే, ఒక తెల్లటి పేపర్ పైన కాషాయ రంగుతో స్వస్తిక్ గుర్తు వేయాలి. దానిని హనుమంతుడికు సమర్పించాలి. ఇంట్లో దీనిని భద్రంగా ఉంచుకోండి. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి సులువుగా బయటపడవచ్చు.
  • ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోవాలంటే, ఈ శుభదినాన గులాబీ పూల దండని హనుమంతుడికి వేయండి. దీంతో శుభ ఫలితాలను పొందవచ్చు.
  • హనుమంతుడికి తమలపాకులు అంటే ఎంతో ఇష్టం. తమలపాకుల పైన జైశ్రీరామ్ అని రాసి, దానిని దండ గుచ్చి, ఆ దండను హనుమంతుడికి సమర్పించాలి. ఇలా చేయడం వలన కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.