హనుమాన్ జయంతి: ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ- హనుమాన్ పూజా విధానం!-hanuman jayanthi anjaneya swamy ashtottara puja hanuman vrata vidhanam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  హనుమాన్ జయంతి: ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ- హనుమాన్ పూజా విధానం!

హనుమాన్ జయంతి: ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ- హనుమాన్ పూజా విధానం!

HT Telugu Desk HT Telugu

హనుమాన్ జయంతి ఆంజనేయ స్వామి ప్రత్యేక అశీసులు కలిగి సంతోషంగా ఉండాలంటే ఈ విధంగా హనుమంతుడిని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తే మంచిది. మరి ఇక బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపిన ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ/ హనుమాన్ వ్రత విధానం గురించి తెలుసుకోండి.

హనుమాన్ జయంతి: ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ- హనుమాన్ వ్రత విధానం (pinterest)

'శ్రీహనుమజ్జయంతి' సందర్బంగా శ్రీ ఆంజనేయ పూజా విధానం పాఠకుల కోసం- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.

అత్యంత శక్తివంతమైన హనుమద్ర్వతం ఆచరించడం వలన కార్యసిద్ధి, శత్రుజయం కలుగుతుంది. కోరుకున్న పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఆటంకాలు తొలగిపోతాయి. దీర్ఘకాలవ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అనితర సాధ్యమైన పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా వెంటనే పూర్తవుతాయి.

ప్రాతఃకాలాన నిద్రలేచి, స్నానాది నిత్యకృత్యాలను ఆచరించి, శుద్ధుడై, తులసీ, పుష్పఫలాది. పూజాద్రవ్యాలను ఏర్పరచుకుని- శ్రీ ఆంజనేయుని పటానికిగానీ, విగ్రహానికిగానీ యధావిధి పూజించాలి.

శ్రీకేశవాది నామాలతో ఆచమనీయం చేసి తరువాత, ప్రాణాయామం ఆచరించి- సంకల్పించుకోవాలి.

ఘంటానాదం చేశాక ప్రాణాయామం చేసి, “శుభతిథౌ

గోత్రస్య.. నామధేయస్య.. ధర్మపత్నీ సమేతస్య |

సహకుటుంబస్య సపుత్రకస్య సపౌత్రకస్య సభ్రాతృకస్య సబాంధవస్య | సపరివారస్య క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ, కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ | సిద్ధ్యర్థం, శ్రీ ఆంజనేయ స్వామి దేవతాముద్దిశ్య శ్రీ ఆంజనేయస్వామి |

దేవతాప్రీత్యర్థే షోడశోపచారపూజాం కరిష్యే" అని సంకల్పించుకుని కలశారాధన చేసి కలశంపై చేతినుంచి-

కలశ పూజ

తదంగ కలశారాధనం కరిష్యే, కలశం గంధ పుష్పాక్షతై రభ్యర్చ్యణ కలశస్యముఖే విష్ణుః, కంఠే రుద్రః సమాశ్రితః॥ మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతా కుక్షౌతు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో...థ యజుర్వేద స్సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబుసమాశ్రితాః|| గంగేచ యమునేచైవ గోదావరి! సరస్వతి! నర్మదే సిన్ధుకావేర్యౌ జలే.. స్మిన్ సన్నిధిం కురు॥

కావేరీ తుంగభద్రా చా కృష్ణవేణీ చ గౌతమీ|| భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః॥ ఆయాంతు దేవ పూజార్ధం దురితక్షయకారకాః॥

(కలశజలాన్ని పుష్పంతోగాని, తులసితోగానీ తీసుకుని దైవప్రతిమపై "ప్రోక్షించి, తనపై కూడా చల్లుకుని, పూజాద్రవ్యాలపై చల్లి) ఆదౌ సంకల్పిత పూజా నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహా గణపతి పూజాం కరిష్యే (గణపతిని | పూజించాక) పూర్వ సంకల్పిత శ్రీ ఆంజనేయపూజాం కరిష్యే అని పూజారంభం | చేయాలి, సంకల్ప... పూర్వోక్త... శుభతిథౌ శ్రీ ఆంజనేయదేవతాప్రీత్యర్థం.. షోడశోపచారపూజాం కరిష్యే

ధ్యానం

| మర్కటేశ మహోత్సాహ సర్వశోకవినాశన శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభో స్ఫటికాభం స్వర్ణకాంతిం ద్విభుజం చ కృతాంజలిం కుండలద్వయ సంశోభి ముఖాంభోజం ముహుర్ముహుః ॥

శ్రీహనుమతే నమః, ధ్యాయామి,

ఆవాహనం

రామ చంద్ర పదాంభోజ యుగళస్థిరమానసం ఆవాహయామి వరదం హనూమంత మభీష్టదం శ్రీహనుమతే నమః ఆవాహయామి.

సింహాసనం

నవరత్న నిబద్ధాశ్రం చతురశ్రం సుశోభనం సౌవర్ణమాసనం తుభ్యం దాస్యామి కపినాయక శ్రీహనుమతే నమః సువర్ణరత్న సింహాసనం సమర్పయామి,

పాద్యం

సువర్ణకలశానీతం గంగాదిసలిలైర్యుతం పాదయోః పాద్యమనఘం ప్రతిగృహ్య ప్రసీద మే శ్రీహనుమతే నమః పాదయో: పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం

కుసుమాక్షత సమ్మిశ్రం ప్రసన్నాంబు పరిస్తుతం | అనర్హ్య మధ్య మధునా గృహ్యతాం కపిపుంగవ శ్రీహనుమతే నమః, ముఖే ఆచమనీయం సమర్పయామి.

మధుపర్కం

మధ్వాజ్యక్షీరమిళితం శర్కరాదధిసంయుతం అర్పయే మధుపర్మం తే స్వీకురు త్వం దయామయ శ్రీహనుమతే నమః, మధుపర్కం సమర్పయామి.

పంచామృత స్నానం

మధ్వాజ్యక్షీరదధిభిః సగుడైర్మంత్రపాలితైః పంచామృతైః పృథగ్గాతై స్సించామి త్వాం కపీశ్వర శ్రీహనుమతే నమః, పంచామృతస్నానం సమర్పయామి.

శ్రీహనుమతే నమః, శుద్దోదకస్నానం సమర్పయామి.

స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి.

వస్త్రం

గ్రథితాం నవరత్నైశ్చ మేఖలాం త్రిగుణీకృతాం అర్పయామి కపీశ త్వం గృహాణ మహతాం వర శ్రీహనుమతే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రధారణానంతరం ఆచమనీయం సమర్పయామి.

(అని చెప్పి, పెద్దవస్తం కట్టి, రెండు భుజాలపై నుంచి వ్రేలాడేటట్టుగా పైపంచ ధరింపజేయాలి)

యజ్ఞోపవీతం

శ్రాత స్మార్తాది కృత్యానాం సాంగోపాంగ ఫలప్రదం యజ్ఞోపవీత మనఘం ధారయా॥ నిలనందన శ్రీహనుమతే నమః, యజ్ఞోపవీతం సమర్పయామి.

అనంతరం ఆచమనీయం సమర్పయామి.

గంధం, సిందూరం

దివ్యసిందూర కర్పూర మృగనాభి సమన్వితం సకుంకుమం పీతగంధం లలాటే ధారయానఘ

శ్రీహనుమతే నమః, గంధ సిందూరాణి సమర్పయామి.

(అని చెప్పి మంచి వాసనగల గంధద్రవ్యాన్ని, సిందూరాన్ని విగ్రహముఖం నొసట, పాదాలకు పెట్టాలి. గంధం ముందుగానే సిద్దంచేసి ఉంచుకోవాలి)

పుష్పాక్షతాః

నీలోత్పలై: కోకనదై: కల్హార కమలైరపి

కుముదైః పుండరీకైస్త్వాం పూజయామి కపీశ్వర శ్రీహనుమతే నమః, పరిమళ పుష్పాక్షతాన్ సమర్పయామి.

(అని చెప్పి, విగ్రహాన్ని పూలతో చక్కగా అలంకరించాలి)

శ్రీ అక్షఘ్నాయ

అంగ పూజ

శ్రీ హనుమతే నమః - పాదౌ పూజయామి

శ్రీ సుగ్రీవసఖాయ నమః - గుల్పౌ పూజయామి

శ్రీ అంగదమిత్రాయ నమః - జంఘే పూజయామి

శ్రీ రామదాసాయ నమః - ఊరూ పూజయామి

శ్రీ అక్షఘ్నాయ నమః - కటిం పూజయామి

శ్రీ లంకాదహనాయ నమః - వాలం పూజయామి

శ్రీ రామమణిదాయ నమః - నాభిం పూజయామి

శ్రీ సాగరోల్లంఘనాయ నమః - మధ్యం పూజయామి

శ్రీ లంకామర్దనాయ నమః - కేశావలీం పూజయామి

శ్రీ సంజీవాహర్తే నమః - స్తనౌ పూజయామి

శ్రీ సౌమిత్రిప్రాణదాయ నమః - వక్షః పూజయామి

శ్రీ కుంఠిత దశకంఠాయ నమః - కంఠం పూజయామి

శ్రీ రామాభిషేకకారిణే నమః - హస్తా పూజయామి

శ్రీ మంత్రరచిత రామాయణాయ నమః - వక్త్రం పూజయామి

శ్రీ ప్రసన్నవదనాయ నమః - వదనం పూజయామి

శ్రీ పింగళనేత్రాయ నమః - నేత్రే పూజయామి

శ్రీ శ్రుతిపారగాయ నమః - పూజయామి

శ్రీ ఊర్ద్వపుండ్రధారిణే నమః - కపోలే పూజయామి

శ్రీ మణికంఠమాలినే నమః - శిరః పూజయామి

శ్రీ సర్వాభీష్టప్రదాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి

శ్రీమదాంజనేయ అష్టోత్తరశతనామావళి

ఓం శ్రీఆంజనేయాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం హనుమతే నమః

ఓం భీమసేనసహాయకృతే నమః

ఓం కుమారబ్రహ్మచారిణే నమః

ఓం సర్వదుఃఖహరాయ నమః

ఓం సర్వలోకచారిణే నమః

ఓం మారుతాత్మజాయ నమః

ఓం మనోజవాయ నమః

ఓం రత్నకుండలదీప్తిమతే నమః

ఓం సంచలద్వాలసన్నద్ధలంబమానశిభోజ్ఞులాయ నమః

ఓం గంధర్వవిద్యాతత్త్వజ్ఞాయ నమః

ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః

ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః 20

ఓం మహాబలపరాక్రమాయ నమః

ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః

ఓం కారాగృహవిమోక్రే నమః

ఓం సర్వమంత్రస్వరూపాయ నమః

ఓం అశోకవనికాచ్చేత్రే నమః

ఓం శృంఖలాబంధమోచకాయ నమః

ఓం సర్వతంత్రస్వరూపిణే నమః

ఓం సర్వమాయావిభంజనాయ నమః

ఓం సాగరోత్తారకాయ నమః

ఓం కపీశ్వరాయ నమః

ఓం సర్వబంధవిమోజ్ఞే నమః

ఓం ప్రాజ్ఞాయ నమః

ఓం మహాకాయాయ నమః

ఓం రామదూతాయ నమః 40

ఓం రక్షోవిధ్వంసకారకాయ 10

ఓం సర్వరోగహరాయ నమః

ఓం పరవిద్యాపరిహారాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం ప్రతాపతే నమః

ఓం వానరాయ నమః

ఓం పరశౌర్యవినాశనాయ నమః

ఓం బలసిద్ధికరాయ నమః

ఓం కేసరీసుతాయ నమః

ఓం పరమంత్రనిరాకర్తే నమః

ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః

ఓం సీతాశోకనివారకాయ నమః

ఓం పరయంత్రప్రభేదకాయ నమః

ఓం కపి సేనానాయకాయ నమః

ఓం సర్వగ్రహవినాశినే నమః

ఓం భవిష్యచ్ఛతురాననాయ

ఓం అంజనాగర్భసంభూతాయ నమః

నైవేద్యం

మణిపాత్రసహస్రాధ్యం దివ్యాన్నం ఘృతపాయసం

అపూప లద్దుకోపేతం మధురామ్ర ఫలైర్యుతం హింగూజీరకసంయుక్తం షడ్రసోపేత ముత్తమం నైవేద్యమర్పయామ్యద్య గృహాణేదం కపీశ్వర

యథావిధి నివేదనం కుర్యాత్, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, ఉత్తరాపోశనం సమర్పయామి, హస్తప్రక్షాళనం సమర్పయామి. ముఖప్రక్షాళనం సమర్పయామి, పాదప్రక్షాళనం సమర్పయామి, గండూషం సమర్పయామి, శుద్దాచమనీయం సమర్పయామి.

(అని చెప్తూ ఐదుమార్లు ఉద్ధరిణితో నీళ్లు అర్ఘ్యపాత్రలోకి వదలాలి)

(తాంబూలంలో మూడు బిళ్లవక్కలు, రెండు తమలపాకులు కానీ, రెండుబిళ్లనక్కలు, మూడు తమలపాకులు కానీ ఉంచాలి.

ఇది తాంబూలం ఇచ్చే విధానం)

తాంబూలం

నాగవల్లీదళోపేతం క్రముకైర్మధురైర్యుతమ్ తాంబూల మర్పయామ్యద్య కర్పూరాదిసువాసితం

శ్రీహనుమతే నమః, సదక్షిణ తాంబూలం సమర్పయామి, తాంబూల చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి.

(అని చెప్పి, దేవునికి తాంబూలం సమర్పించాలి)

(గంట వాయించాలి).

కర్పూర నీరాజనం

ఆరార్తికం తమోహారి శతసూర్య సమప్రభం అర్పయామి తవ ప్రీత్యై అంధకారనిషూదనం

శ్రీహనుమతే నమః కర్పూరనీరాజనం సమర్పయామి,

(అని చెప్పి, దేవునికి మూడుసార్లు పాదాది శిరః పర్యంతం

అందరూ కర్పూరకాంతిలో దేవుణ్ణి దర్శించి, ఆనందించేటట్టుగా విగ్రహానికి కుడిపక్కన హారతి ఇవ్వాలి. హారతి తట్ట నిదానంగా భక్తిప్రపత్తులతో త్రిప్పాలి. వేగంగా త్రిప్పరాదు.)

నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి.

మంత్రపుష్పం

ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ప్రచోదయాత్

శ్రీహనుమతే నమః, సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి.

(అని భక్తితో దోసిటిలోనికి పూలు తీసుకుని, హనుమంతుణ్ణి | స్మరిస్తూ, స్వామివారి పాదపద్మాలపై సమర్పించాలి. మన హృదయమనే పుష్పాన్నే సమర్పిస్తున్నట్లు భావించాలి. పూజలో పాల్గొన్న అందరికీ పూలు ఇచ్చి, నలుపకుండా భక్తితో తట్టలో వేయమని, తర్వాత వాటిపై కలశజలం పువ్వుతో చల్లి, అందరూ సమర్పించిన పూలను భగవంతుని | పాదాలపై సమర్పించాలి. పిదప అందరూ భక్తితో నమస్కరించాలి.)

ప్రదక్షిణ నమస్కారం

ప్రదక్షిణ నమస్కారాన్ సాష్టాంగాన్ పంచసంఖ్యయా దాస్యామి కపినాథాయ గృహాణ సుప్రసీద మే

శ్రీహనుమతే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

(ఎడమనుండి కుడికి నమస్కార ముద్రతో ఐదుసార్లు ప్రదక్షిణం)

ఛత్రం ధారయామి, చానురై ర్వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, దర్పణం దర్శయామి, ఉష్ణానావాహయామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజోపచార, భక్త్యుపచార, శక్త్యుపచార పూజాం సమర్పయామి.

(అని చెప్పి, పూలు, అక్షతలు స్వామి పాదాలపై ఉంచి నమస్కరించాలి)

| ఆనయా.. పూజయా శ్రీ హనుమద్దేవతా సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు.

సర్వేజనాః స్సుఖినో భవంతు

పుష్పాంజలిః

వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీహనూమతే

కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ మాణిక్యహారభూషాయ మంగళం శ్రీహనుమతే

సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ ఉస్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనుమతే

దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీ హనూమతే

భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే జ్వలత్పావకనేత్రాయ మంగళం శ్రీహనుమతే పంపాతీరవిహారాయ సౌమిత్రిప్రాణదాయినే

సృష్టే: కారణభూతాయ మంగళం శ్రీహనూమతే

రంభావనవిహారాయ గంధమాదనవాసినే సర్వలోకైకనాథాయ మంగళం శ్రీహనుమతే

పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ కౌండిన్య గోత్రజాతాయ మంగళం శ్రీహనుమతే శ్రీహనుమతే నమః, పుష్పాంజలిం సమర్పయామి

శ్లో॥ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ! హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ.

తాత్పర్యం: వానరోత్తముడైన హనుమంతుడా! ఈ కార్యం నీ వల్ల జరగాల్సి ఉంది. నీవు ప్రయత్నం చేసి ఎట్లయినా నా ఈ దుఃఖాన్ని నశింపచేయి స్వామి.

ఓం బాలార్కసదృశాననాయ నమః

ఓం సురార్చితాయ నమః

ఓం విభీషణప్రియకరాయ నమః

ఓం మహాతేజసే నమః

ఓం దశగ్రీవకులాంతకాయ నమః

ఓం రామచూడామణిప్రదాయ నమః 70

ఓం ప్రసన్నాత్మనే నమః

ఓం దాంతాయ నమః

ఓం శాంతాయ నమః

ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః

ఓం కామరూపిణే నమః

ఓం శతకంఠమదాపహృతే నమః

ఓం వజ్రకాయాయ నమః 50

ఓం పింగళాక్షాయ నమః

ఓం యోగినే నమః

ఓం మహాద్యుతయే నమః

ఓం వార్ధమైనాకపూజితాయ నమః

ఓం రామకథాలోలాయ నమః

ఓం చిరంజీవినే నమః

ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః

ఓం సీతాన్వేషణపండితాయ నమః

ఓం విజితేంద్రియాయ నమః

ఓం రామభక్తాయ నమః

ఓం వజ్రదంష్ట్రాయ నమః

ఓం రామసుగ్రీవసంధాత్రే నమః

ఓం వజ్రనఖాయ నమః

ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః

ఓం అక్షహంత్రే నమః

ఓం మహిరావణమర్దనాయ నమః

ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః 100

ఓం స్ఫటికాభాయ నమః

ఓం కాంచనాభాయ నమః

ఓం వాగధీశాయ నమః

ఓం ఇంద్రజిత్ప్రహితామోఘ-బ్రహ్మాస్త్రవినివారకాయ నమః

ఓం పంచవక్త్రయ నమః

ఓం మహాతపసే నమః

ఓం నవవ్యాకృతిపండితాయ నమః 80

ఓం పార్ధధ్వజాగ్రసంవాసినే నమః

ఓం లంకిణీభంజనాయ నమః

ఓం చతుర్భాహవే నమః

ఓం శరపంజరభేదకాయ నమః

ఓం దీనబంధవే నమః

ఓం శ్రీమతే నమః 60

ఓం దీర్ఘబాహవే నమః

ఓం మహాత్మనే నమః

ఓం సింహికాప్రాణభంజనాయ నమః

ఓం లోకపూజ్యాయ నమః

ఓం భక్తవత్సలాయ నమః

ఓం గంధమాదనశైలస్థాయ నమః

ఓం జాంబవత్ప్రతివర్ధనాయ నమః

ఓం సంజీవననగాహర్షే నమః

ఓం లంకాపురవిదాహకాయ నమః

ఓం సీతాసమేతశ్రీరామపాదసేవా ధురంధరాయ నమః

ఓం శుచయే నమః

ఓం సుగ్రీవసచివాయ నమః

ఓం వాగ్మినే నమః

ఓం ధీరాయ నమః

ఓం దృఢవ్రతాయ నమః

ఓం శ్రీమదాంజనేయస్వామినే నమః 108

ఓం శూరాయ నమః

ఓం కాలనేమిప్రమథనాయ నమః

ఓం దైత్యకులాంతకాయ నమః

ఓం హరిమర్కట మర్కటాయ నమః 90

అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి. (గంట మ్రోగిస్తూ దీపం ఇవ్వాలి)

ధూపం

దివ్యం సగుగ్గులుం రమ్యం దశాంగేన సమన్వితం గృహాణ మారుతే ధూపం సుప్రియం ఘ్రాణతర్పణం

శ్రీహనుమతే నమః, దివ్య పరిమళ ధూప మాఘపయామి

(అని చెప్పి విగ్రహానికి చక్కగా ధూపవాసన వ్యాపించేటట్టుగా ధూపం ఇవ్వాలి)

(నేతి వత్తులు మూడింటిని ఒకటిగా చేసి, వెలిగించి, దేవుని విగ్రహాన్ని అందరూ చూచేటట్టుగా త్రిప్పాలి)

దీపం

ఘృతవర్తి సముజ్జ్వాలా శతసూర్య సమప్రభం అతులం తవ దాస్యామి వ్రతపూర్త్యై సుదీపకం

శ్రీ హనుమతే నమః దీపం దర్శయామి.

(అని చెప్పి, దేవునికి దీపం చూపించి, తర్వాత)

ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి

(అని చెప్పి, ఉద్ధరణి నీళ్లు దేవుని ముఖానికి చూపించి, అర్ఘ్య పాత్రలో వేయాలి)

గమనిక: ఉపచారాలతో ఇచ్చే ఈ దీపాన్ని, హారతివలే కన్నులకు అడ్డుకోవాల్సిన అవసరం లేదు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ- 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ- 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ- 9494981000
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.