తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని హనుమాన్ ఆలయాల్లో విశేషంగా పూజలు జరుపుతారు. కొన్ని హనుమాన్ ఆలయాల్లో ఉత్సవాలను కూడా జరుపుతారు. హనుమాన్ జయంతి నాడు సుందరకాండను పఠిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. ఈసారి హనుమాన్ జయంతి ఏప్రిల్ 12న వచ్చింది. ఈరోజు హనుమంతుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు.
హనుమాన్ జయంతి నాడు ఎరుపు రంగు దుస్తులను ధరించి, హనుమంతుడుని ఆరాధించడం మంచిది. ఈరోజు హనుమంతుడిని ఆరాధించేవారు చరణామృతాన్ని వాడకూడదు. బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటించాలి. హనుమంతుడు పూజలో బూందీ, లడ్డులు, అప్పాలు, వడలు సమర్పించాలి. ఈరోజు హనుమాన్ వ్రతం చేసేవారు ఫలహారాన్ని తినాలి.
హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని ఇలా ఆరాధించడం మంచిది. ప్రమోషన్ రావాలన్నా, ఉద్యోగం కోసం వెతుకుతున్నా హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా భక్తితో హనుమంతుడిని ఆరాధిస్తే ఎటువంటి అవాంతరాలు అయినా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది.
హనుమాన్ బీజ మంత్రం 'రామ రామ రామ' మంత్రాన్ని పఠిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవుతుంది. వ్యాపారంలో విజయం లభిస్తుంది అప్పుల నుంచి కూడా బయటపడవచ్చు.
ప్రేమ, పెళ్లికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోవడానికి కూడా ఈ రోజు హనుమంతుడిని ఆరాధించడం మంచిది. ఈరోజు హనుమంతటిని ఆరాధిస్తే వైవాహిక జీవితం కూడా సంతోషకరంగా మారుతుంది. పెళ్లి కుదరని వారు సుందరకాండను పఠిస్తే మంచిది. వివాహం ఆలస్యం అవుతున్నట్లయితే సుందరకాండని పఠించండి.
సంతానం లేని వారు హనుమంతుడిని ఆరాధించి, అరటి పండ్లను సమర్పించండి. సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం