Guru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 6 రాశులకు సంతాన యోగం, సంతోషకరమైన జీవితం-guru transit in mithuna rasi these 6 rasis will lead happy life with kids and many things will happen ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Guru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 6 రాశులకు సంతాన యోగం, సంతోషకరమైన జీవితం

Guru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 6 రాశులకు సంతాన యోగం, సంతోషకరమైన జీవితం

Peddinti Sravya HT Telugu

Guru Transit: గురువు రాశి మార్పు సంతానంలేని వారికి శుభవార్తను తీసుకువస్తుంది. సంతాన సమస్యలతో బాధపడే భార్య భర్తలకు గురువు మిధున రాశి సంచారం సంతాన ప్రాప్తిని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా విద్య, వృద్ధి, ఉద్యోగంలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది.

గురు సంచారంలో మార్పు

గురువు మే 25న మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. గురువు రాశి మార్పు కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో ఈ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా గురువు రాశి మార్పు సంతానంలేని వారికి శుభవార్తను తీసుకువస్తుంది. సంతాన సమస్యలతో బాధపడే భార్య భర్తలకు గురువు మిధున రాశి సంచారం సంతాన ప్రాప్తిని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా విద్య, వృద్ధి, ఉద్యోగంలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గురువు మిధున రాశి ప్రవేశంతో సంతాన అంశాలకు గురువు సంచారం యొక్క బలం కలగడంతో కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

మే 25 నుంచి ఏడాది పాటు ఈ ఆరు రాశులకు సంతానానికి సంబంధించి శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. మరి ఆ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

1.తులా రాశి

తులా రాశి వారికి గురువు సంచారం కారణంగా సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది. గురువుకి ప్రదక్షిణలు చేయడం, గణపతిని ఆరాధించడం వలన సంతానాన్ని పొందవచ్చు. సంతానం ఉన్నవారికి పిల్లలు విజయాలు సాధించడం, మంచి పేరు తెచ్చుకోవడం లాంటివి జరుగుతాయి. పిల్లలు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.

2.మిధున రాశి

మిధున రాశి వారికి గురువు సంచారం వలన ఈ ఏడాది సంతానయోగం కలిగే అవకాశం ఉంది. కొంతమందికి కవల పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంది. మిధున రాశి వారి పిల్లలు చదువులో, వృత్తి, ఉద్యోగాల్లో వృద్ధిలోకి రావచ్చు. గురు బృహస్పతికి ప్రదక్షిణలు చేయడం వలన లాభం ఉంటుంది.

3.వృషభ రాశి

వృషభ రాశి వారికి గురువు సంచారం కొన్ని ప్రత్యేక మార్పుల్ని తీసుకువస్తుంది. సంతానలేమి సమస్యతో బాధపడే వారికి సంతాన ప్రాప్తి కలగవచ్చు. పిల్లలు ఉన్నవారు శుభవార్తలు వినడం, పిల్లల వృద్ధిలోకి రావడం లాంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గణపతి స్తోత్రం పఠిస్తే మంచిది.

4.సింహ రాశి

సింహ రాశి వారికి గురువు సంచారం వలన సంతానం కలిగే అవకాశం ఉంది. పిల్లలు ఉన్నట్లయితే పురోగతి సాధించడం, పిల్లలు విజయాలు అందుకోవడం లాంటివి చూస్తారు. సింహ రాశి వారు గణపతి స్తోత్రాన్ని పఠిస్తే మంచిది.

5.కుంభ రాశి

కుంభ రాశి వారికి గురువు సంచారం వలన సంతానం కలగవచ్చు. సంతానం ఉన్నవారికి కూడా కలిసి వస్తుంది. పిల్లలు విజయాలు అందుకోవడం, ఉద్యోగంలో కూడా పురోగతి చూడడం లాంటివి జరుగుతాయి. గురువారం గురు గ్రహానికి ప్రదక్షిణలు చేయడం వలన మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

6.ధనస్సు రాశి

గురువు సంచారం వలన ధనస్సు రాశి వారికి సంతానం కలపవచ్చు. సంతానం లేని వారు విష్ణు సహస్రనామం పఠిస్తే మంచిది. పిల్లలకి ఉద్యోగాలు వచ్చి స్థిరపడే అవకాశం కూడా ఉంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం