Guru pushya nakshtra yogam: గురు పుష్య నక్షత్ర యోగం.. ఈరోజు ఏ పని తలపెట్టినా అందులో విజయం మీదే
Guru pushya nakshtra yogam: ఫిబ్రవరి 22న గురు పుష్య నక్షత్ర యోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రంలో ఇది మహా శుభ ముహూర్తంగా పరిగణిస్తారు. ఈరోజు ఏ పని తలపెట్టినా అందులో విజయం మీదే అవుతుంది.
Guru pushya nakshtra yogam: 27 నక్షత్రాలలో పుష్య నక్షత్రం వాటికి రాజుగా పరిగణిస్తారు. గురువారం పుష్య నక్షత్రం వస్తే దాన్ని గురుపుష్య నక్షత్ర యోగంగా చెప్తారు. ఇది చాలా పవిత్రమైనది. గురువారం బృహస్పతికి అంకితం చేసే రోజు. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు పుష్య యోగం శుభప్రదమైనది, అదృష్టకరమైనది. ఫిబ్రవరి నెలలో రెండో సారి గురు పుష్య యోగం వచ్చింది.
గురు పుష్య నక్షత్రం తిథి
ప్రారంభ సమయం: ఫిబ్రవరి 22, ఉదయం 5 గంటల నుంచి మొదలవుతుంది
ముగింపు సమయం: ఫిబ్రవరి 22, సాయంత్రం 4.44 గంటల వరకు ఉంటుంది
గురు పుష్య నక్షత్రం ప్రాముఖ్యత
గురు పుష్య నక్షత్రం చాలా మంగళకరమైనది. అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నక్షత్రం గురువారం రావడం వల్ల ఏ పని తలపెట్టినా కూడా బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది అత్యుత్తమ సమయం. పూజా కార్యక్రమాలు, శుభ కార్యాలు, గృహ ప్రవేశాలు ఏవైనా చేపట్టవచ్చు. కానీ వివాహ శుభ కార్యాలకు మాత్రం ఇది వర్తించదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏ పని తలపెట్టినా అందులో సంపూర్ణ విజయం లభిస్తుంది. ఈరోజు సర్వార్థ సిద్ధి యోగం, అమృత యోగం కూడా ఏర్పడుతున్నాయి.
గురు పుష్య నక్షత్ర యోగం రోజు చేయాల్సిన పనులు ఏంటి?
ఈరోజు విరాళాలు, దాన ధర్మాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఆకలితో ఉన్న వారికి ఆహారం, వస్త్రాలు దానం చేయాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. గురువు పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకోవాలి.
విష్ణువు ఆలయాన్ని సందర్శించాలి. భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధించాలి. జ్యోతిష్య శాస్త్రంలో గురు పుష్య నక్షత్రాన్ని మహా ముహూర్తంగా పేర్కొంటారు.
బంగారం, వెండి, భూమి, భవనాలు, వాహనాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఏవైనా కొనుగోలు చేస్తే చాలా మంచిది.
అరటి మొక్కకు శనగపప్పు, బెల్లం, అరటి పండ్లు సమర్పించి పూజ చేయాలి.
పసుపు రంగు నీలమణి ధరించాలని అనుకుంటే ఈరోజు అత్యంత పవిత్రమైనది. ఈ రత్నానికి ఆచారం ప్రకారం పూజ చేసి తర్వాత గురు పుష్య నక్షత్ర కాలంలో ధరించాలి.
“ఓం నమో భగవతే వాసుదేవాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
గురుభగవానుడి ఆశీస్సులు పొందటం కోసం “ఓం బూం బృహస్పతియే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు పుష్య నక్షత్రం ఆధ్యాత్మిక ఔన్నత్యం, శ్రేయస్సు, వ్యక్తిగత అభివృద్ధికి అవకాశాలు అందించే చాలా పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఏ కారం తలపెట్టినా అందులో విజయం మీదే. ఎటువంటి పని మొదలు పెట్టినా గురు భగవానుడితో పాటు శని అనుగ్రహం కూడా పొందుతారు.
రెండోసారి గురు పుష్య నక్షత్రం
ఫిబ్రవరి నెలలో రెండో సారి గురు పుష్య నక్షత్రం వచ్చింది. ఫిబ్రవరి 10వ తేదీన గుప్త నవరాత్రుల ప్రారంభమయ్యే రోజు గురు పుష్య యోగం ఏర్పడింది. మళ్ళీ ఫిబ్రవరి 22న రోజంతా గురు పుష్య నక్షత్ర యోగం ఉంటుంది.