Jupiter transit: ఆగస్ట్ 20న బృహస్పతి నక్షత్ర మార్పు.. ఈ రాశుల అదృష్టం మారుతుంది, ఆకస్మిక ధనలాభం
Jupiter transit: దేవగురు బృహస్పతి ఆగష్టు నెలలో నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. మేషం నుండి మీనం వరకు 12 రాశులపై దీని శుభ, అశుభ ప్రభావం ఉంటుంది. అయితే బృహస్పతి సంచారము కొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
Jupiter transit: జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి గ్రహం అనుకూలమైన ఫలితాలు అందించేదిగా భావిస్తారు. అటువంటి బృహస్పతి గ్రహం కదలిక, దశ, రాశి, నక్షత్ర మార్పు శుభ సంఘటనగా పరిగణిస్తారు. ప్రస్తుతం గురు గ్రహం వృషభ రాశిలో ఉంది. త్వరలో నక్షత్రాన్ని మార్చబోతుంది.
దృక్ పంచాంగ్ ప్రకారం వచ్చే నెల దేవగురు బృహస్పతి మృగశిర నక్షత్రంలో ప్రవేశిస్తాడు. ఆగష్టు 20, 2024 మంగళవారం సాయంత్రం 05:22 గంటలకు ఈ నక్షత్రంలో తన ప్రయాణం ప్రారంభిస్తాడు. నవంబర్ 28 వరకు గురు గ్రహం ఇదే నక్షత్రంలో ఉంటుంది. మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతి. ప్రస్తుతం రోహిణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. బృహస్పతి గ్రహం తెలివితేటలు, వివేకం, సంతోషకరమైన కుటుంబం, అదృష్టం, జ్ఞానం, అదృష్టం మరియు సంపదకు కారకంగా కూడా పరిగణిస్తారు.
మృగశిర నక్షత్రంలో బృహస్పతి సంచారం కొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది. గురువు శుభ ప్రభావం జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలిగిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంపద పెరిగే అవకాశం ఉంటుంది. బృహస్పతి నక్షత్ర మార్పు వల్ల ఏయే రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుందో తెలుసుకుందాం.
మేష రాశి
బృహస్పతి సంచారం వల్ల మేష రాశి వారికి చాలా శుభప్రదమైనది. జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక లాభం కోసం కొత్త బంగారు అవకాశాలు ఉంటాయి. ప్రతి పనికి ఆశించిన ఫలితాలు వస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. అడుగడుగునా అదృష్టం వెన్నంటే ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనే వారి కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగస్తులు తమ అద్భుతమైన ప్రయత్నాలతో కార్యాలయంలో మంచి ప్రశంసలు పొందుతారు.
కన్యా రాశి
మీరు బృహస్పతి సంచారం వల్ల చాలా శుభ ఫలితాలను పొందుతారు. ఊహించని ఆదాయ వనరుల నుండి ఆర్థిక లాభాలు ఉంటాయి. కెరీర్‌లో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. ప్రోత్సాహకాలు పొందుతారు. ఒంటరి వ్యక్తుల వివాహాలు స్థిరపడతాయి.
మకర రాశి
బృహస్పతి నక్షత్ర మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కర్కాటక రాశి
మృగశిర నక్షత్రంలో బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి పదకొండో ఇంట్లో సంచరిస్తాడు. ఇది ఆదాయం, లాభాలను సూచిస్తుంది. భారీ ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఏ పని చేసిన అందులో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. జీవితం ఆనందం, కీర్తితో నిండిపోతుంది. గతంలో చేసిన పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి. జీతాలలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. భవిష్యత్ కోసం పొదుపు చేసుకుంటారు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.