Jupiter transit: 12 ఏళ్ల తర్వాత ఆ నక్షత్రంలోకి గురు గ్రహం.. ఈ మూడు రాశుల వారికి ఊహించని ధనలాభం-guru biggest transit after 12 years the fortunes of these 3 zodiac signs will change money will come in abundance ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jupiter Transit: 12 ఏళ్ల తర్వాత ఆ నక్షత్రంలోకి గురు గ్రహం.. ఈ మూడు రాశుల వారికి ఊహించని ధనలాభం

Jupiter transit: 12 ఏళ్ల తర్వాత ఆ నక్షత్రంలోకి గురు గ్రహం.. ఈ మూడు రాశుల వారికి ఊహించని ధనలాభం

Gunti Soundarya HT Telugu

Jupiter transit: సంపదకు కారకుడైన బృహస్పతి అతిపెద్ద సంచారము కొన్ని రాశుల వారికి చాలా సంపద, కీర్తిని తెస్తుంది. మరికొద్ది రోజుల్లో గురు నక్షత్ర మార్పు వల్ల అనేక ప్రయోజనాలు లభించబోతున్నాయి.

గురు నక్షత్ర మార్పు

Jupiter transit: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు, నక్షత్రరాశులు తమ రాశిని నిర్ణీత సమయ వ్యవధిలో మార్చుకుంటాయి. గ్రహం రాశిచక్రంలోని మార్పు వలె, నక్షత్రరాశిలో మార్పు ప్రభావం మొత్తం 12 రాశుల మీద కూడా కనిపిస్తుంది. 

దేవగురు బృహస్పతి ప్రస్తుతం రోహిణి నక్షత్రంలో ఉన్నాడు. సుమారు 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి మే 2024లో వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఈ ఏడాది మొత్తం ఇదే రాశి సంచరిస్తాడు. జూన్ 13, 2024 న బృహస్పతి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఆగస్టు 20, 2024 వరకు ఈ రాశిలో సంచరిస్తాడు. సుమారు పన్నెండు సంవత్సరాల తర్వాత గురు గ్రహం ఈ నక్షత్రంలో సంచరిస్తోంది. 

వృషభ రాశి, రోహిణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. అటువంటి పరిస్థితిలో బృహస్పతి శుక్రుడికి చెందిన రాశి, నక్షత్రంలో సంచిస్తున్నాడు. బృహస్పతి నక్షత్ర సంచారం వల్ల ఈ సమయంలో మూడు రాశుల వారికి భారీ ప్రయోజనాలను తెస్తుంది. ఈ కాలంలో ఈ రాశుల వారి అదృష్టం మారుతుంది. ఆగస్ట్ వరకు వీరికి అనేక లాభాలు కలగబోతున్నాయి. వారు భౌతిక సుఖాలను పొందుతారు. బృహస్పతి నక్షత్ర మార్పు ఏ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకోండి. 

వృషభ రాశి 

బృహస్పతి రోహిణి నక్షత్రంలోకి వెళ్లడం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి ఈ రాశిలో ఉన్నాడు. మీరు సంపద, ఆస్తి, శ్రేయస్సు మొదలైనవాటిని పొందడానికి ఇది ఉత్తమ సమయం. మీరు కార్యాలయంలో సానుకూల మార్పులను చూస్తారు. ఆస్తులు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి.

సింహ రాశి 

సింహ రాశి కర్మ గృహంలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అందువల్ల ఈ మార్పు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారవేత్తలు గొప్ప విజయాన్ని పొందవచ్చు. నూతన ఒప్పందాలు భారీ లాభాలను తీసుకొస్తాయి. ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. దీంతో పాటు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. బృహస్పతి ప్రభావం వల్ల మీకు చాలా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి.

ధనుస్సు రాశి 

బృహస్పతి మీ ఆరవ ఇంట్లో ఉన్నాడు. రోహిణి నక్షత్రంలో గురు సంచారం వల్ల ఈ  సమయంలో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. ధనుస్సు రాశిని పాలించే గ్రహం బృహస్పతి. అందువల్ల వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి లేదా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇది ఉత్తమ సమయం. ఈ కాలంలో ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే అది పూర్తి లాభాలు తీసుకొస్తుంది. అనేక సర్ ప్రైజ్ లు ఎదురవుతాయి. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.