గ్రహాలు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాయి. ఆ సమయంలో శుభ, అశుభ ఫలితాలను అందిస్తాయి. ఇవి 12 రాశుల వారిపై కూడా ప్రభావం చూపిస్తాయి. గురువు, వరుణ గ్రహం కలయికతో కేంద్ర యోగం ఏర్పడింది. గురువు, వరుణుడు 90 డిగ్రీల వద్ద ఉన్నప్పుడు కేంద్ర యోగం ఏర్పడుతుంది. ఈ యోగం రాశుల వారికి సక్సెస్‌ని అందిస్తుంది. ఈ కలయికతో వారి జీవితం కూడా మారిపోవచ్చు.
గురువు ప్రతి ఏడాది తన రాశిని మారుస్తూ ఉంటాడు. ఏడాది తర్వాత మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. 12 రాశులను పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం గురువు మిథున రాశిలో ఉన్నాడు. గురువు ఇప్పుడు వేగంగా కదులుతున్నాడు. తొమ్మిది గ్రహాల్లో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. గురువు మతం, విద్య, జ్ఞానం, ఆనందం, శ్రేయస్సు, వివాహం, పిల్లలు, ఆధ్యాత్మికత మొదలైన వాటికి కారకుడు.
గురువు మిథున రాశిలో ఉండడం వలన కాలానుగుణంగా ఇతర గ్రహాలతో కలిసి ప్రత్యేక యోగాలను ఏర్పరుస్తాడు. గురువు, వరుణగ్రహం ప్రత్యేక కలయిక కారణంగా కేంద్ర యోగం ఏర్పడుతుంది. రెండూ కూడా 90 డిగ్రీల వద్ద ఉండడంతో కేంద్ర యోగం ఏర్పడింది. ఇది కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలను తీసుకువస్తుంది.
మేష రాశి వారికి ఇది బాగా కలిసి వస్తుంది. మేషరాశి వారు ఈ సమయంలో విపరీతమైన అదృష్టాన్ని పొందుతారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగస్తులకు రానున్న రోజుల్లో మంచి ఫలితాలు ఎదురవుతాయి. కష్టానికి తగ్గ ఫలితం అందుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఈ సమయంలో మీకు కలిసి వస్తుంది.
కర్కాటక రాశి వారికి గురువు, వరుణ కేంద్ర యుగం అనేక లాభాలను తీసుకువస్తుంది. కెరీర్‌లో కొత్త అవకాశాలు వస్తాయి. పని ప్రదేశంలో మీ పనికి తగ్గ గుర్తింపు ఉంటుంది. ఎప్పటి నుంచో పూర్తికాని పనులు కూడా ఈ సమయంలో పూర్తయిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
వృశ్చిక రాశి వారికి కేంద్ర యోగం అనేక లాభాలను అందిస్తుంది. ఈ రాశి వారు ఈ సమయంలో సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో మార్పు ఉండొచ్చు. ఎప్పటి నుంచో రాని ధనం ఈ సమయంలో మీకు అందుతుంది. కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగా లేని వారికి ఈ సమయంలో మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.