Gruha Pravesham: 2025లో ఏ నెలలో ఎప్పుడెప్పుడు గృహప్రవేశం చేసుకోవచ్చు? గృహప్రవేశం శుభముహూర్తాలు లిస్ట్ చూసేయండి..
Gruha Pravesham: మంచి ముహూర్తంలో గృహప్రవేశాన్ని చేస్తారు. కుటుంబ సభ్యులు, తెలిసిన వాళ్ళ సమక్షంలో కొత్త ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటారు. మీరు కూడా కొత్త ఇల్లు లేదా ఫ్లాట్ కొన్నారా? అయితే గృహప్రవేశం చేయడానికి శుభ ముహూర్తాల గురించి తెలుసుకోండి. 2025లో గృహప్రవేశం చేయడానికి శుభముహూర్తాలు ఇక్కడ ఉన్నాయి.
చాలా మంది సొంత ఇంటి గురించి కలలు కంటూ ఉంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. సొంత ఇంటి కల నెరవేరాలంటే అది ఎంతో కష్టంతో కూడుకున్నది. ఎన్నో ఇబ్బందులు పడి, సొంత ఇంటి కలని నెరవేర్చుకున్న వారు కూడా ఉంటారు. అయితే ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశం చేస్తాము. గృహ ప్రవేశం చేయడానికి ముహూర్తం చూస్తారు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
మంచి ముహూర్తంలో గృహప్రవేశాన్ని చేస్తారు. కుటుంబ సభ్యులు, తెలిసిన వాళ్ళ సమక్షంలో కొత్త ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటారు. మీరు కూడా కొత్త ఇల్లు లేదా ఫ్లాట్ కొన్నారా? అయితే గృహప్రవేశం చేయడానికి శుభ ముహూర్తాల గురించి తెలుసుకోండి. 2025లో గృహప్రవేశం చేయడానికి శుభముహూర్తాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ముహూర్తంలో గృహప్రవేశం చేసుకోవచ్చు.
2025లో ఎప్పుడు గృహప్రవేశం చేసుకోవచ్చు? గృహప్రవేశం ముహుర్తాలు:
జనవరి 2025
మీరు 2025 జనవరిలో 15, 20, 24, 27 మరియు 31వ తేదీల్లో గృహ ప్రవేశం చేయవచ్చు. ఈ తేదీల్లో శుభ ముహూర్తం అందుబాటులో ఉంటుంది, ఇది మీకు ప్రయోజనం అందిస్తుంది.
ఫిబ్రవరి 2025
ఫిబ్రవరి 2025లో, శుభప్రదమైన తేదీలు 3, 7, 8, 10, 15, 17, 19, 26. మీరు ఈ రోజుల్లో ప్లాన్ చేసుకోవచ్చు.
మార్చి 2025
మార్చిలో, 6 మరియు 10 తేదీలు శుభప్రదమైనవి. మార్చిలో ఈ తేదీల్లో గృహ ప్రవేశం కూడా చేయవచ్చు.
మే 2025
మే 2025లో, గృహ ప్రవేశానికి మే 14 మాత్రమే అనుకూలమైన తేదీ. వేసవిలో, మీరు ఈ రోజున గృహ ప్రవేశం చేయవచ్చు..
జూన్ 2025
జూన్ 2025లో కూడా ముహూర్తం ఉంది. జూన్ 25న కొత్త ఇంట్లోకి ప్రవేశించవచ్చు.
అక్టోబర్ 2025
అక్టోబర్ 2025లో, మీరు అక్టోబర్ 1న గృహ ప్రవేశం చేయవచ్చు. ఇది ఆ మాసంలో లభించే శుభప్రదమైన తిథి.
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం పైన చెప్పిన తేదీలు కాకుండా, నెలలో కొన్ని రోజులు గృహప్రవేశాలకు అనుకూలమైనవిగా పరిగణించబడతాయి. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి నాడు కూడా కొత్త ఇంట్లోకి ప్రవేశించవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.