Govardhan Puja: మూడు శుభ యోగాలతో గోవర్ధన్ పూజ- కృష్ణుడిని పూజిస్తే ఏడాది మొత్తం శుభఫలితాలే
Govardhan Puja: ఈ సంవత్సరం నవంబర్ 02న మూడు పవిత్రమైన యోగాలలో గోవర్ధన్ పూజ జరుపుకుంటారు. ఈ రోజున గోవర్ధన పర్వతాన్ని, ఆవును, శ్రీకృష్ణుడిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. కృష్ణుడిని పూజించడం వల్ల ఏడాది పొడవునా ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.
ఉత్తర భారతదేశంలో గోవర్ధన్ పూజ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను కార్తీక మాసం పాడ్యమి తిథి రోజు జరుపుకుంటారు. ఈ రోజున గోవర్ధన్ పర్వతం, ఆవు, శ్రీకృష్ణుడిని పూజిస్తారు.
తెలుగు రాష్ట్రాలలో గోవర్ధన్ పూజ నుంచి పవిత్రమైన కార్తీకమాసం ప్రారంభమవుతుంది. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున కృష్ణుడు బ్రజ్ ప్రజలను రక్షించడానికి గోవర్ధన్ పర్వతాన్ని తన వేళ్లపై ఎత్తాడు. ఈ పండుగను అన్నకూట్ పూజ అని కూడా అంటారు. దృక్ పంచాంగ్ ప్రకారం ఈ సంవత్సరం గోవర్ధన్ పూజ 02 నవంబర్ 2024 న జరుపుకుంటారు. గోవర్థన్ పూజ రోజున శ్రీకృష్ణుడికి ధాన్యాలు సమర్పిస్తారు. ఆవులను, ఎద్దులను పూజించి, ఆవు పేడతో గోవర్ధన్ పర్వతాన్ని తయారు చేసి పూజించి ప్రదక్షిణలు చేస్తారు. గోవర్ధన్ పూజ ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానాన్ని తెలుసుకుందాం.
గోవర్ధన్ పూజ ఖచ్చితమైన తేదీ
దృక్ పంచాంగ్ ప్రకారం కార్తీక మాసం పాడ్యమి తిథి 01 నవంబర్ 2024న 06:16 PMకి ప్రారంభమై మరుసటి రోజు 02 నవంబర్ 2024న రాత్రి 08:21 PMకి ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం నవంబర్ 02న గోవర్ధన పూజ జరుగుతుంది. ఈ సంవత్సరం సౌభాగ్య యోగం, ఆయుష్మాన్ యోగం, త్రిపుష్కర యోగాతో సహా 3 పవిత్ర యోగాలలో గోవర్ధన్ పూజ నిర్వహించబడుతుంది.
గోవర్ధన్ పూజ రోజున ఉదయం 11. 19 గంటల వరకు ఆయుష్మాన్ యోగం ఏర్పడుతోంది. శుభ యోగం రోజంతా ఉంటుంది. అదే సమయంలో త్రిపుష్కర యోగా 02 నవంబర్ 08:21 PM నుండి 03 నవంబర్ 05:58 AM వరకు ఏర్పడుతోంది.
గోవర్ధన పూజ శుభ సమయం
ఉదయం పూజకు అనుకూల సమయం: ఉదయం 06:21 నుండి 08:37 వరకు
సాయంత్రం పూజకు అనుకూల సమయం: మధ్యాహ్నం 03:12 నుండి 05:24 వరకు
పూజా విధానం
గోవర్ధన్ పూజ రోజున ప్రజలు ఒక చోట గుమిగూడి శ్రీకృష్ణుడు, గోవర్ధన్ పర్వతాన్ని పూజిస్తారు. తెల్లవారుజామున నిద్రలేచిన తరువాత గోవర్ధన పర్వతాన్ని చేతిలో పట్టుకున్న శ్రీకృష్ణుని చిత్రపటాన్ని పూజించండి. తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడతో గోవర్ధనుడి బొమ్మను తయారు చేసి శ్రీకృష్ణుని ఎదుట ఆవు, గోవుల వెంట్రుకలు, బియ్యం, పూలు, పెరుగు, నూనె, నీళ్లతో చేసిన దీపం వెలిగించి పూజలు చేసి పరిక్రమ చేస్తారు.
గోవర్ధన్ పూజ సందర్భంగా శ్రీకృష్ణుడికి 56 రకాల నైవేద్యాలు సమర్పించండి. గోవులను, వృషభాలను ధూపం, గంధం, పుష్పాలతో అలంకరించి పూజించండి. తల్లి ఆవుకు పండ్లు, స్వీట్లు తినిపించి హారతి చేయండి. ఈరోజు గోవర్ధన్ పూజ చేస్తే ఏడాది మొత్తం శ్రీకృష్ణుడి కరుణాకటాక్షాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. అందుకే ఉత్తర భారతీయులు ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. కృష్ణుడిని ఆరాధిస్తారు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.