Gold Ornaments Mistakes: పాదాలకు బంగారు ఆభరణాలను ఎందుకు పెట్టుకోకూడదు? చాలా మందికి తెలియక చేసే పొరపాట్లు ఇవే
Gold Ornaments Mistakes: లోహంతో తయారు చేసే ఆభరణాలని అలంకరణ కింద ఉపయోగించడం వలన శారీరక, మానసిక ప్రయోజనాలు కలుగుతాయి. కానీ ఎప్పుడూ కూడా బంగారు ఆభరణాలను కాళ్లకు లేదా పాదాలకు పెట్టుకోకూడదు. ఈ పొరపాట్లు చేస్తే ఎలాంటి నష్టాలు కలుగుతాయో చూద్దాం.

ఆభరణాలని ధరించడం వలన అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కొన్ని లోహపు ఆభరణాలు కానీ రాళ్ల ఆభరణాలు కానీ ఎన్నో ప్రయోజనాలని అందిస్తాయి. ఆభరణాల తయారీకి బంగారం, వెండి, రాగి లాంటి వాటిని ఉపయోగిస్తారు. అయితే, వీటితో చాలా లాభాలని పొందడానికి అవుతుంది. లోహంతో తయారు చేసే ఆభరణాలని అలంకరణ కింద ఉపయోగించడం వలన శారీరక, మానసిక ప్రయోజనాలు కలుగుతాయి.
శరీరంలో వేడి తగ్గుతుంది. అందం పెరుగుతుంది. రాగి ఆభరణాలను ధరించడం వలన శరీర వేడిని తగ్గిస్తుంది. బంగారు ఆభరణాలను పెట్టుకుంటే అందం పెరుగుతుంది. పురాతన కాలం నుంచి ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కోసం దేవతల అనుగ్రహాన్ని పొందడానికి ఆభరణాలు ఉపయోగ పడుతున్నాయి. ఆభరణాల తయారీకి ఉపయోగించే ప్రతీ లోహం కూడా స్వంత, ప్రత్యేక లక్షణాలని కలిగి ఉంటుంది.
బంగారు ఆభరణాలు
బంగారం కొనుగోలు చేయడం మాటలు కాదు. రోజు రోజుకీ బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. బంగారంతో తయారు చేసిన ఆభరణాలని స్త్రీలు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. బంగారు ఆభరణాలను అలంకరణ కింద ఉపయోగించుకోవడం వలన స్త్రీ అందం ఇంకా ఎక్కువగా కనపడుతుంది. వివాహది శుభకార్యాలకు వెళ్ళినప్పుడు స్త్రీలు కచ్చితంగా బంగారు ఆభరణాలను ధరిస్తారు.
హారం, గాజులు, వడ్డానం, కమ్మలు, ముక్కుపుడక, పాపిడి బొట్టు, వంకీలు ఇలా చెప్పకపోతే చాలానే ఉన్నాయి. ఎవరికి నచ్చిన ఆభరణాలని వారు కొనుగోలు చేసి అందంగా తయారవుతూ ఉంటారు. అయితే, బంగారు ఆభరణాలని నడుము కింది భాగాల్లో అంటే పాదాలు లేదా కాళ్లకు ధరించరు. కేవలం చెవులకు, చేతులకు, నడుముకు ఇలా పై శరీర భాగాలకు మాత్రమే అలంకరించుకుంటూ ఉంటారు.
ఎందుకు బంగారు ఆభరణాలని కాళ్ళకు ధరించరు?
జ్యోతిష్యం ప్రకారం, బంగారు ఆభరణాలని కాళ్లకు పెట్టుకుంటే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది. బంగారాన్ని ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిగా భావిస్తారు. ఒకవేళ కాళ్లకు బంగారం ధరిస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది. అందుకనే చాలామంది బంగారంతో మెట్టెలు లేదా పట్టీలు వంటివి చేయించుకోరు. ఎంత డబ్బులు ఉన్నా వెండి పట్టీలు లేదా వెండి మెట్టెలు వంటివి వేసుకుంటారు.
బంగారం లక్ష్మీదేవిని సూచిస్తుంది. విష్ణువు ప్రియమైన భార్య లక్ష్మిని పాదాలకు కానీ దిగువ శరీరానికి కానీ బంగారాన్ని ధరిస్తే విష్ణువును, దేవతలను అగౌరవపరిచినట్లు అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.
కేతువు ప్రతికూల ప్రభావం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాదాలు, కాళ్లకు కేతువుతో సంబంధం కలిగి ఉంటుంది. కేతువు శక్తికి భంగం కలిగితే ప్రతికూల ఆలోచనలు వస్తాయి. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇటువంటి సమస్యలు కలగకుండా ఉండాలంటే వెండి ఆభరణాలని ధరించడం మంచిది. కేతువు ప్రభావాన్ని శాంతించడానికి వెండి ఆభరణాలు ఉపయోగపడతాయి. కనుక వెండి పట్టీలు లేదా వెండి మెట్టెలు వంటివి ధరించడం మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం