Pendants: దేవుడి బొమ్మ లాకెట్ మెడలో ధరించవచ్చా? అది శుభమా లేక అశుభమా?-god or goddess pendant wearing in neck is good or bad as per jyothishya shastram ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Pendants: దేవుడి బొమ్మ లాకెట్ మెడలో ధరించవచ్చా? అది శుభమా లేక అశుభమా?

Pendants: దేవుడి బొమ్మ లాకెట్ మెడలో ధరించవచ్చా? అది శుభమా లేక అశుభమా?

Gunti Soundarya HT Telugu
Aug 30, 2024 12:18 PM IST

Pendants: మనలో చాలా మంది ఇష్టదైవంతో కూడిన లాకెట్స్ మెడలో ధరిస్తారు. కొందరు చేతికి ఉంగరాలు పెట్టుకుంటారు. అయితే దేవుడి బొమ్మ ఉన్న లాకెట్ మెడలో ధరించవచ్చా? శుభమా లేక అశుభమా? అది ఎలాంటి ఫలితాలు ఇస్తుందో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

దేవుడి బొమ్మ లాకెట్ ధరించవచ్చా?
దేవుడి బొమ్మ లాకెట్ ధరించవచ్చా? (pinterest)

Pendants: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం ధరించే వస్తువులు మన జీవితంపై శుభ, అశుభ ప్రభావాలను చూపుతాయి. మెడలో గొలుసుకు అనేక రకాల లాకెట్లు ధరించడం మనం చూస్తూ ఉంటాం. కొందరు తమ పేరు ఉన్న లాకెట్ ధరిస్తే, మరికొందరు మతపరమైన చిహ్నాలను ధరిస్తారు. మరికొందరు దేవుని చిత్రాలు లేదా డిజైన్లతో కూడిన పెండెంట్స్ ధరిస్తారు. అయితే దేవుడి లాకెట్ ధరించడం మంచిదా కాదా అనేది తెలుసుకుందాం.

దేవుడి లాకెట్ ధరించవచ్చా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దేవుని చిత్రం లేదా దేవుడు ముఖంతో డిజైన్ చేసిన లాకెట్ ని ధరించడం శుభప్రదంగా పరిగణించబడదు. ఎందుకంటే తెలుసో తెలియకో రోజు వారి పనుల్లో భాగంగా శరీరంతో పాటు లాకెట్ పై కూడా మురికి చేరిపోతుంది. చేతులు అపరిశుభ్రంగా ఉంటాయి. భగవంతుని చిత్రం ఉన్న లాకెట్ పై దుమ్ము చేరడం వల్ల జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ కారణంగా వీటిని ధరించడం మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

కొందరు బంగారు గొలుసులతో ధరిస్తే మరికొందరు సాధారణ దారంలో దేవుడి బొమ్మ ఉన్న లాకెట్ వేసుకుంటారు. ఇలా దేవుడి లాకెట్ ధరించడం వల్ల దేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా అందుతుంది అనుకుంటారు. కానీ అలా చేయడం తప్పు.

గ్రంథాల ప్రకారం దేవుడిని ఉంచేందుకు సరైన స్థలం ఉంటుంది. అయితే అదే లాకెట్ మాత్రం కాదు. భగవంతుడికి సంబంధించిన ఈ విధమైన వస్తువులను ఒక వ్యక్తి తన శరీరంపై ధరించకూడదు. ఇలా చేయడం వల్ల పురోగతి, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుంది. అయితే వీటికి బదులు తులసి, రుద్రాక్షలను మాత్రం ధరించవచ్చు. దేవుడి లాకెట్ ధరించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసుకుందాం.

ప్రగతిలో అడ్డంకులు

హిందూ మత గ్రంథాలలో దేవుని లాకెట్ ధరించడం అశుభకరమైనదిగా పరిగణిస్తారు. రోజంతా మనం శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచుకోలేకపోవడమే అందుకు కారణం. ఉదయం నుంచి అనేక కార్యకలాపాల్లో పాల్గొంటారు. తినడం తాగడం వరకు మనం అనేక రకాల ప్రక్రియలు చేపడతాము. ఇటువంటి సమయంలో కొన్నిసార్లు మన చేతులకు మురికి పేరుకుపోతుంది. అలాగే లాకెట్ లోను మురికి ఉంటుంది. భగవంతుడిని మనం అపరిశుభ్రం చేసినట్లే అవుతుంది. అది వ్యక్తి పురోగతికి ఆటంకాన్ని కలిగిస్తుంది.

భార్యాభర్తల మధ్య విభేదాలు

దేవత బొమ్మ ఉన్న లాకెట్ లో మెడలో ధరించడం ధర్మశాస్త్రాల ప్రకారం నిషేధం. ముఖ్యంగా వివాహితులు దేవుడి లాకెట్ ధరించడం మంచిది కాదు. వాళ్ళు పడుకున్నప్పుడు లాకెట్ నోటి మీదకు రావడం వంటివి జరుగుతూ ఉంటుంది. ఇది మంచిది కాదు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగి వైవాహిక బంధంలో చిక్కులు ఎదురవుతాయి. అందుకే ఇటువంటి లాకెట్లు ధరించకూడదు.

గ్రహాలపై చెడు ప్రభావం

దేవుడి లాకెట్ చాలా పవిత్రమైనది. అనేక కారణాలవల్ల మన శరీరం అపరిశుభ్రంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో లాకెట్ అని తన పవిత్రతను కోల్పోతుంది. గ్రంథాల ప్రకారం అపరిశుభ్రమైన లాకెట్ ప్రతికూలతలను ఆకర్షిస్తుంది. అశుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహాలపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. ఇది మీకు తీవ్రమైన హామీ కలిగించవచ్చు.

రాహువు ప్రభావాలు

అనుకూలత కోసం ధరించే దేవుని లాకెట్ ప్రతికూల పరిస్థితులను సృష్టిస్తుంది. శరీర పవిత్రతకు కూడా భంగం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల మనలో ఒత్తిడి పెరుగుతుంది. రాహువు అతని జీవితంలో ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాడు. మెడలో దేవుడి లాకెట్ లేదా దేవుళ్ళకు సంబంధించిన ఏదైనా ధరించొద్దు అని చెప్పేందుకు ఇవి ప్రధాన కారణాలుగా జ్యోతిష్యులు చెబుతున్నారు.

అయినప్పటికీ ఎవరైనా వీటిని ధరించాలనుకుంటే జ్యోతిష్య శాస్త్ర సలహా ప్రకారం ఆధ్యాత్మిక చిహ్నాలుగా భావించే యంత్రాలను ధరించవచ్చు. సరైన పద్ధతిలో యంత్రాన్ని లాకెట్ గా ధరించడం వల్ల జీవితంలో సానుకూల శక్తి తీసుకురావడమే కాకుండా గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

టాపిక్