ప్రతీ ఒక్కరూ ఇంటిని అందంగా ఉంచుకోవాలని, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఇంటి అలంకరణలో గాజు వస్తువులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. గాజు వస్తువులు అందంగా కనపడతాయి. ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి కూడా రకరకాల గాజు వస్తువులను చాలామంది ఉపయోగిస్తారు. పైగా గాజు పాత్రలు ఇంట్లోకి సానుకూల శక్తిని కూడా తీసుకువస్తాయి. కానీ, వాటిని సరైన,దశలో ఉంచితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం గాజు వస్తువులు సంతోషాన్ని, ప్రశాంతతని, ధనాన్ని తీసుకువస్తాయి. అదే వాటిని సరైన దిశలో ఉంచకపోయినట్లయితే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గాజు పాత్రలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రంలో గాజు పాత్రలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో గాజు వస్తువులను ఉపయోగించడం వలన సానుకూల శక్తి కలిగి ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం పై కూడా సానుకూల ప్రభావం పడుతుంది.
గాజు పాత్రలని తూర్పు వైపు ఉంచితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఇది సూర్యుడు దిశ. గాజు వస్తువులను తూర్పు వైపు ఉంచడం వలన సానుకూల శక్తి వ్యాపించి, సంతోషంగా ఉండొచ్చు. ఇలా ఉంచడం వలన తాజాదనాన్ని పొందవచ్చు. ఇంట్లో కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
గాజు వస్తువులను ఉత్తరం వైపు పెట్టొచ్చు. ఇవి సానుకూల శక్తిని తీసుకువస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేస్తాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చు.
దక్షిణం వైపు గాజు పాత్రలని పెట్టకూడదు. అలా చేసినట్లయితే మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒత్తిడి కూడా విపరీతంగా పెరిగిపోతుంది.
పడమర వైపు గాజు పాత్రలు పెట్టడం వలన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావడం వంటివి జరుగుతాయి. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
గాజుతో చేసిన ఫర్నీచర్, డెకరేటివ్ సామాన్లు వంటివి లివింగ్ రూమ్ లేదా డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వలన పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.
పడకగదిలో అద్దం ఉండడం మంచిది కాదు. ముఖ్యంగా మంచానికి ఎదురుగా ఉండకూడదు. ఇది సానుకూల శక్తిని తొలగించి, ప్రతికూల శక్తిని తీసుకొస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి మంచానికి ఎదురుగా అద్దం లేకుండా చూసుకోవాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం