ఈ 5 వెండి వస్తువులను బహుమతిగా ఇస్తే సమస్యలన్నీ తీరిపోతాయి.. ధనం, అదృష్టం, విజయంతో పాటు ఎన్నో!-giving these 5 silver things as gifts will change your life and give wealth luck and more ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ 5 వెండి వస్తువులను బహుమతిగా ఇస్తే సమస్యలన్నీ తీరిపోతాయి.. ధనం, అదృష్టం, విజయంతో పాటు ఎన్నో!

ఈ 5 వెండి వస్తువులను బహుమతిగా ఇస్తే సమస్యలన్నీ తీరిపోతాయి.. ధనం, అదృష్టం, విజయంతో పాటు ఎన్నో!

Peddinti Sravya HT Telugu

వెండి చంద్రుడు, శుక్ర గ్రహాలకు సంబంధించినది. వెండిని ధరిస్తే మనసును ప్రశాంతంగా మార్చుకోవచ్చు. సంపద, శ్రేయస్సు కలుగుతాయి. విజయం, మనశ్శాంతి, ఆనందం కలుగుతాయి. వెండితో చేసిన వస్తువులను దానం చేయడం లేదంటే బహుమతిగా ఇవ్వడం వలన అదృష్టం కలిసి వస్తుంది. మరి ఇక ఎలాంటి వెండి వస్తువులను దానం చేయాలో తెలుసుకోండి.

వెండిని దానం చేసినా బహుమతిగా ఇచ్చినా ఏమవుతుంది? (pinterest)

ప్రతీ ఒక్కరూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని అనుకుంటున్నారు. జ్యోతిష్యం ప్రకారం కొన్నిటిని బహుమతిగా ఇవ్వడం వలన అదృష్టం కలిసి వస్తుంది. వీటిని బహుమతిగా ఇవ్వడం వలన ఎన్నో మార్పులు వస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో వెండిని శుభలోహంగా భావిస్తారు. వెండి నేరుగా గ్రహాలు, రాశులకు సంబంధించినది. వెండిని మనం ఎవరికైనా బహుమతిగా ఇస్తే, అనేక శుభ ఫలితాలను పొందవచ్చు.

వెండిని దానం చేసినా బహుమతిగా ఇచ్చినా ఏమవుతుంది?

వెండి చంద్రుడు, శుక్ర గ్రహాలకు సంబంధించినది. వెండిని ధరిస్తే మనసును ప్రశాంతంగా మార్చుకోవచ్చు. సంపద, శ్రేయస్సు కలుగుతాయి. విజయం, మనశ్శాంతి, ఆనందం కలుగుతాయి. వెండితో చేసిన వస్తువులను దానం చేయడం లేదంటే బహుమతిగా ఇవ్వడం వలన అదృష్టం కలిసి వస్తుంది. వెండిని బహుమతిగా ఇస్తే మానసిక స్థితిని కలిగి ఉంటారు.

ఎటువంటి వెండి వస్తువులని బహుమతిగా ఇవ్వవచ్చు?

ఎటువంటి వెండి వస్తువులని బహుమతిగా ఇవ్వచ్చు, వేటి వలన ఎలాంటి ఫలితం ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడే తెలుసుకుందాం. మరి ఇక ఆ వివరాలను తెలుసుకోండి.

1.వెండి నాణెం

ఎవరికైనా వెండి నాణెం బహుమతిగా ఇచ్చినట్లయితే, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సిరిసంపదలకు లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శ్రేయస్సు కలుగుతుంది. ఎవరైనా వెండి నాణేన్ని బహుమతిగా ఇచ్చినట్లయితే, దానిని పూజించడం మంచిది.

2.వెండి వినాయకుడు

వెండి వినాయకుడిని బహుమతిగా ఇస్తే కూడా మంచి జరుగుతుంది. దీనిని బహుమతిగా ఇస్తే జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. వినాయకుడు విఘ్నాలను తొలగించి, జీవితంలో సంతోషాన్ని అందిస్తాడు. విజయాలను కూడా అందుకోవచ్చు.

3.వెండి పెన్ను

వెండి పెన్నును ఎవరికైనా బహుమతిగా ఇచ్చినట్లయితే, జ్ఞానం పెరుగుతుంది. ఏకాగ్రతని కూడా పెంపొందించుకోవచ్చు. పని ప్రదేశంలో సక్సెస్ ని అందుకోవచ్చు.

4.వెండి ఆవు, దూడ

వెండి ఆవు, దూడను ఎవరికైనా బహుమతిగా ఇవ్వడం వలన జీవితంలో సంతోషం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.

5.వెండి కుందులు

వెండి కుందులను బహుమతిగా ఇవ్వడం వలన జీవితంలో సానుకూల శక్తి, సంతోషం ఉంటాయి. ధనం కూడా కలుగుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.