న్యూమరాలజీ ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉందన్నది చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు కూడా చెప్పొచ్చు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. వీరికి ఎప్పుడూ దుర్గాదేవి అనుగ్రహం ఉంటుంది. మంచి, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. నవరాత్రులు ఇక పూర్తికాబోతున్నాయి.
రేపు విజయదశమితో నవరాత్రులు పూర్తవుతాయి. దుర్గాదేవి అనుగ్రహం ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు ఎప్పుడూ ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు దుర్గమ్మ అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు. డబ్బుకు లోటు ఉండదు. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ధైర్యంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. దుర్గాదేవి అనుగ్రహంతో ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు సంతోషంగా, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా ఉంటారు. గౌరవ, మర్యాదలు కూడా పెరుగుతాయి.
ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే రాడిక్స్ నెంబర్ 1 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఏ రంగాన్ని ఎంచుకున్నా, ఆ రంగంలో విజయవంతులవుతారు. దుర్గమ్మ అనుగ్రహం ఎప్పుడూ ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు.
ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 3 అవుతుంది. ఈ సంఖ్యకు గురువు అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అదృష్టాన్ని పొందుతారు. సంతోషంగా ఉంటారు. అడుగడుగునా అదృష్టం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహంతో ఎప్పుడూ ఏ బాధ లేకుండా ఉంటారు.
ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 6 అవుతుంది. కాబట్టి ఈ అమ్మవారి అనుగ్రహం ఈ తేదీల్లో పుట్టిన వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పుడు సానుకూల ఆలోచనలు కలిగి ఉంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. డబ్బుకు లోటు ఉండదు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
గమనిక: ఇవి జ్యోతిష శాస్త్ర అంచనాలు మాత్రమే. మరిన్ని వివరాలకు ఆస్ట్రాలజీ నిపుణులను సంప్రదించండి.