Business women: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు బిజినెస్ చేయడంలో దిట్ట, వీరికి ఎవరూ సాటిలేరు
Business women: మూల సంఖ్యతో సంబంధం ఉన్న అమ్మాయిలకు వ్యాపారం చేయడంలో ఎక్కువ అవగాహన ఉంటుందని న్యూమరాలజీ ప్రకారం చెప్పవచ్చు. ఈ మూడు తేదీల్లో పుట్టిన అమ్మాయిలు తమ భర్తలతో చేయి చేయి కలిపి నడుస్తారని చెబుతారు. వ్యాపారం చేయడంలో నిష్టాణుతులు.
Business women: జ్యోతిష్య శాస్త్రంలో పుట్టిన తేదీ ఆధారంగా ఎలా అయితే జాతకం చెప్తారో అదే విధంగా న్యూమరాలజీలో కూడా చూస్తారు. న్యూమరాలజీలో పుట్టిన తేదీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పుట్టిన తేదీ ఆధారంగా ఒక వ్యక్తి గతం, భవిష్యత్తు, వర్తమానం గురించి అంచనా వేస్తారు.
పుట్టిన తేదీ ఒక వ్యక్తి ఆర్థిక స్థితి, వృత్తి, వైవాహిక జీవితం మొదలైన వాటి గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఈ రోజు మనం బిజినెస్ మైండెడ్‌గా భావించే అలాంటి తేదీలలో పుట్టిన అమ్మాయిల తెలుసుకుందాం. వారు భర్త, అత్తమామలకు కూడా అదృష్టవంతులుగా నిలుస్తారు. ఏదైనా నెలలో 5, 14 లేదా 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు 5 రాడిక్స్ సంఖ్యను కలిగి ఉంటారు. రాడిక్స్ సంఖ్య 5 అధిపతి బుధుడు. ఈ మూడు తేదీల్లో పుట్టిన వారి మీద బుధుడి ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది.
వాక్కు, తెలివితేటలు, వ్యాపారం వంటి వాటికి బుధుడు కారకుడిగా భావిస్తారు. జాతకంలో బుధుడి శుభ స్థానం ఉంటే వాళ్ళు కెరీర్, వ్యాపారంలో దూసుకుపోతారు. అదే విధంగా బుధుడికి చెందిన రాడిక్స్ నంబర్ 5తో అనుబంధించబడిన అమ్మాయిలు ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. తల్లిదండ్రుల నుండి, అత్తమామల నుండి వారు ప్రేమను పొందుతారని అంటారు. రాడిక్స్ నంబర్ 5 కింద పుట్టిన అమ్మాయిల గురించి ఇక్కడ తెలుసుకోండి.
భర్తకు అండగా
న్యూమరాలజీ ప్రకారం రూట్ నంబర్ 5 ఉన్న అమ్మాయిలు తమ భర్తలతో చేతులు కలిపి నడుస్తారు. ఆమె తన భర్తకు ప్రతి పరిస్థితిలో మద్దతు ఇస్తుంది. కష్ట సమయాల్లో ధైర్యాన్ని ఇస్తుంది. సమస్యలు, కష్టాల్లో అండగా నిలుస్తుంది. ఈ అమ్మాయిలు ఉల్లాసంగా ఉంటారు. వాక్చాతుర్యం వీరి ప్రత్యేక ఆకర్షణ. ఆమె తన మాటలతో ప్రజలను త్వరగా ప్రభావితం చేస్తుంది. వారు తమ తల్లిదండ్రుల వద్దం అత్తమామల వద్ద చాలా ప్రేమను పొందుతారు.
బిజినెస్ మైండెడ్
రాడిక్స్ నంబర్ 5తో సంబంధం ఉన్న అమ్మాయిలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉంటారు. తొందరిపడి నిర్ణయాలు తీసుకోరు. ప్రతి పని ఆలోచించి చేస్తారు. వారికి వ్యాపారంపై మంచి అవగాహన ఉంది. బిజినెస్ మైండెడ్ వీరిది. వ్యాపారం చేయాలనే ప్రణాళికలు ఎక్కువగా ఉంటాయి. అందులో అద్భుతంగా రాణిస్తారు. వ్యాపారంలో వీరికి మరెవరూ సాటిలేరని నిరూపించుకుంటారు. ఆమె తన భర్తకు అతని పనిలో మంచి మద్దతు ఇస్తుంది. వారు ఏదైనా కొత్త పని నేర్చుకోవడానికి ఇష్టపడతారు.
లక్కీ కలర్
రాడిక్స్ సంఖ్య 5తో అనుబంధించబడిన వ్యక్తుల శుభ రంగు తెలుపు, ఖాకీ, లేత రంగులు. ఈ వ్యక్తులకు శుక్రవారం, బుధవారాలు శుభ దినాలుగా పరిగణిస్తారు. వీళ్ళు ఏదైనా పని మొదలు పెట్టాలని అనుకుంటే ఈ వారాల్లో ప్రారంభిస్తే శుభ ఫలితాలు, లాభాలు కలుగుతాయి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.