మిథున రాశి వారికి ఈ వారం (ఏప్రిల్ 27 నుంచి మే 3వ తేదీ) ఎక్కువ సానుకూలతలు ఉంటాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో పరిస్థితులు కలిసి వస్తాయి. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో సమతుల్యత పాటించాలి. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి.
ఈవారం మిథున రాశి వారు తమ ప్రేమ భాగస్వామిని అర్థం చేసుకునే విషయాన్ని మెరుగుపరుచుకోవాలి. మీ ప్రేమ బంధంలోని కొన్ని చిక్కులు త్వరలోనే పరిష్కారమవుతాయి. కానీ, ఆలోగా కొన్ని తీవ్రమైన సమస్యలు ఎదురుకావొచ్చు. అందుకే వీటిని పరిష్కరించుకునేందుకు మీరు మీ ప్రేమ భాగస్వామితో వివరంగా మాట్లాడి అర్థం చేసుకోవాలి. మంచి ఫ్రెండ్‍గా మెలగాలి. మీ లవర్‌కు వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకరినొకరు ప్రశంసించుకుంటూ.. బహుమతుల ఇచ్చుకుంటూ ఉండాలి. మీ రిలేషన్‍షిప్‍ను, అండర్‌స్టాండింగ్‍ను ఇది పెంచుతుంది. వివాహమైన మహిళలు కూడా తమ కుటుంబ విషయాల్లో మరింత శ్రద్ధ వహించాలి.
ఈవారం మిథున రాశి వారు ఉద్యోగాల్లో రాణిస్తారు. కార్యాలయాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తారు. కొన్ని పనులు పూర్తి చేసేందుకు అదనపు గంటలు పని చేయాల్సి రావొచ్చు. క్లైంట్ ఇంటికి వెళ్లి కూడా పని చేయాల్సిన పరిస్థితులు ఎదురవ్చొచ్చు. మీకు మీ టీమ్ నుంచి మద్దతు దక్కుతుంది. మీ సంస్థకు మీరు ఎంత ముఖ్యమైన వారో నిరూపణ అవుతుంది. ఈ వారం ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారు ఆత్మవిశ్వాసంతో వెళ్లవచ్చు. విద్యార్థులకు కూడా కాలం బాగుంటుంది. విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు ఉంటాయి.
ఈవారం మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వివిధ మార్గాల ద్వారా ధనం సిద్ధిస్తుంది. తోబుట్టువులతో ఏవైనా ఆర్థిక వివాదాలు ఉంటే పరిష్కరించుకోండి. సేవా కార్యక్రమాలు చేయండి. వ్యాపారంలో అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. నిపుణుల సలహాలు తీసుకోవాలి. కొత్త వాహనం కొనేందుకు కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. తోబుట్టువులకు ఆర్థిక అవసరాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. మీరు సాయం చేయవచ్చు. ఆస్తులు, డబ్బు పంపకాల గురించి వృద్ధులు ఆలోచించొచ్చు.
వృద్ధులు సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఈరాశి వారిలో కొందరికి ఈవారం కాళ్ల నొప్పులు ఉండొచ్చు. పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. స్వల్ప అలర్జీలు, ఇన్ఫెక్షన్లకు వారు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఏవైనా స్వల్ప అనారోగ్యాలు కలిగితే వారం చివర్లో తగ్గొచ్చు. ఉదయం, సాయంత్రం వేళల్లో నడవడం వల్ల ఆరోగ్య మెరుగ్గా ఉండేందుకు తోడ్పడుతుంది.
అన్ని రాశుల వారఫలాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
- డాక్టర్ జె.ఎన్.పాండే,
వేద జ్యోతిషం & వాస్తు నిపుణుడు,
ఇ-మెయిల్: djnpandey@gmail.com
ఫోన్: 91-9811107060 (వాట్సాప్ మాత్రమే)
సంబంధిత కథనం