Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ అలవాట్లకి రోజూ దూరంగా ఉండాలి.. లేదంటే ఇంట్లో గొడవలు, ఆర్థిక సమస్యలు తప్పవు!
Garuda Puranam: గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. వ్యాస మహర్షి గరుడ పురాణాన్ని రచించారు. 18 మహాపురాణాల్లో ఇది కూడా ఒకటి. గరుడ పురాణం ప్రకారం ఈ అలవాట్లకి రోజూ దూరంగా ఉండాలి. లేదంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మరి గరుడ పురాణం ప్రకారం ఎటువంటి పొరపాట్లు చేయకూడదో చూసుకోండి.
హిందూమతంలో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. వ్యాస మహర్షి గరుడ పురాణాన్ని రచించారు. 18 మహాపురాణాల్లో ఇది కూడా ఒకటి. మహా పురాణం అని కూడా దీనిని పిలుస్తారు. చెడు కర్మల గురించి దాని వలన కలిగే ఫలితాల గురించి ఇది చెప్తుంది. గరుడ పురాణం ప్రకారం, తప్పకుండా వీటికి దూరంగా ఉండాలి. లేదంటే గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. మరి గరుడ పురాణం ఏం చెప్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.
గరుడ పురాణం ప్రకారం ఈ అలవాట్లకి రోజూ దూరంగా ఉండాలి
గరుడ పురాణం ప్రకారం కొన్ని అలవాట్లు ఇంట్లో గొడవలను తీసుకువస్తాయి. ఆనందం, శ్రేయస్సు కలగాలంటే ఈ తప్పులు చేయకుండా చూసుకోవడం మంచిది.
1.వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి
వంటగది ఎప్పుడూ కూడా దేవాలయం మాదిరి ఉండాలి. అక్కడ అన్నపూర్ణ కొలువై ఉంటుంది. వంటగది శుభ్రంగా లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. రాత్రి భోజనం తిన్నాక ఖాళీ గిన్నెలను వంట గదిలో అలా వదిలేయకూడదు. అలా వదిలేసినట్లయితే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయి.
2.చెత్తాచెదారం
చాలామంది ఇంట్లో పాత సామాన్లు, పనికిరాని సామాన్లు, చెత్తాచెదారాన్ని ఉంచుతారు. అలా చేయడం వలన ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. ఇంట్లో అనవసరమైన వస్తువులు ఉన్నట్లయితే వాటిని తొలగించడం మంచిది.
3.ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి
ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే ప్రతికూల శక్తి కలుగుతుంది. సానుకూల శక్తి తొలగిపోతుంది. గరుడ పురాణం ప్రకారం, ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.
ఆర్థిక ఇబ్బందులు కూడా రావు. కాబట్టి ఇక్కడ చెప్పినట్లు పాటించినట్లయితే ఇంటి సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకోకుండా నివారించవచ్చు. లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా పొందవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం