Ganga dasara 2024: గంగా దసరా రోజు తులసి ఆకులతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి-ganga dasara 2024 here are the some tulasi remedies to overcome financial problems ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ganga Dasara 2024: గంగా దసరా రోజు తులసి ఆకులతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి

Ganga dasara 2024: గంగా దసరా రోజు తులసి ఆకులతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి

Gunti Soundarya HT Telugu
Jun 15, 2024 06:22 PM IST

Ganga dasara 2024: గంగా దసరా రోజు తులసి ఆకులతో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లో శ్రేయస్సు నెలకొంటుంది. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుంచి బయట పడతారు.

గంగా దసరా రోజు పాటించాల్సిన తులసి పరిహారాలు
గంగా దసరా రోజు పాటించాల్సిన తులసి పరిహారాలు

Ganga dasara 2024: సనాతన ధర్మం లో గంగా దసరా పండుగకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం గంగా దసరాను ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం శుక్లపక్షం పదో రోజున జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం గంగాదేవి భూమిపైకి ఈరోజే వచ్చిందని నమ్ముతారు. అందుకే గంగా దేవిని పూజిస్తారు. పవిత్ర నదులలో స్నానం చేస్తారు. ఇదే రోజు దశపాపహర దశమి కూడా వచ్చింది. మనిషి చేసే పది రకాల పాపాల నుంచి విముక్తి కలిగేందుకు గంగా నదిలో స్నానం ఆచరించడం ఈరోజు ప్రత్యేకత.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గంగా దసరా రోజు తులసికి సంబంధించి కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఈ ఏడాది గంగా దసరా జూన్ 16వ తేదీ వచ్చింది.

తులసి పరిహారాలు

గంగా దసరా రోజున తులసి ఆకులను గంగా జలంతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని దరిద్రం తొలగిపోతుంది. లక్ష్మీదేవి ఇంటికి వచ్చి ఎక్కువ కాలం ఉంటుంది. ఇంట్లో వారికి శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు.

గంగా దసరా రోజున తులసికి నీటిని సమర్పించి శ్రీ తులసి స్తోత్రాన్ని పఠించాలి. తులసిని పూజించిన ఇల్లు సమృద్ధిగా ఉంటుందని చెబుతారు. ఇలా చేయడం వల్ల తులసి తల్లితో పాటు గంగా మాత కూడా ప్రసన్నురాలు అవుతుంది .పెద్ద ఎత్తున ఆశీర్వాదాలు పొందుతారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి దీర్ఘకాలంగా అప్పులతో బాధపడుతున్నట్లయితే ఈ పరిహారం పాటించడం ఉత్తమం .గంగా దసరా రోజున మీ పొడవుకు సమానమైన నల్లదారం, కొబ్బరికాయని తీసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరికాయ చుట్టూ నల్ల దారం చుట్టి శివలింగం ముందు ఉంచాలి. జీవితంలోని అడ్డంకుల నుంచి మిమ్మల్ని శివుడిని ప్రార్థించి పారే నీటిలో ఈ కొబ్బరికాయను విడిచి పెట్టాలి.

ఉద్యోగం సంపాదించడంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నా, వ్యాపారంలో నష్టాలు సంభావిస్తున్నా, పదేపదే వైఫల్యాలు ఎదురవుతున్న ఈ ప్రత్యేక పరిహారం పాటించి చూడండి. గంగా దసరా రోజు మట్టికుండను తీసుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా గంగాజలం చుక్కలు కొద్దిగా పంచదార వేయాలి. తర్వాత ఆ కుండ నిండా నీటిని నింపి అవసరమైన వ్యక్తికి దానం చేయాలి. కావాలనుకుంటే ఈ కుండను ఆలయానికి కూడా దానం చేయవచ్చు

శివుని తల మీద గంగా మాతకు ప్రత్యేక స్థానం ఉంది. అందువల్ల గంగా దసరా రోజున శివుడిని పూజించడం వల్ల ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. శివాలయానికి వెళ్లి గంగా జలంతో శివలింగానికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన జలాన్ని కొద్దిగా ఇంటికి తీసుకురావాలి. ఆ నీటిని ఇల్లు అంతా చల్లుకోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూలత అనేది ప్రవేశించలేదు.

చివరిగా గంగా దసరా రోజున గంగాజలాన్ని ఇత్తడి పాత్రలో వేసి అందులో కొన్ని తులసి ఆకులు వేయాలి. ఈ నీటిని ఇంటి ప్రవేశ ద్వారం వద్ద చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ నశించి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

Whats_app_banner