Ganesh Chaturthi 2023 Horoscope : వినాయక చవితి నుండి ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది-ganesh chaturthi 2023 horoscope these zodiac signs will get wealth and luck from vinayaka chavithi ,రాశి ఫలాలు న్యూస్
Telugu News  /  Rasi Phalalu  /  Ganesh Chaturthi 2023 Horoscope These Zodiac Signs Will Get Wealth And Luck From Vinayaka Chavithi

Ganesh Chaturthi 2023 Horoscope : వినాయక చవితి నుండి ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది

వినాయక చవితి 2023
వినాయక చవితి 2023 (unsplash)

Vinaya Chavithi 2023 Horoscope : వినాయక చవితి నుంచి కొన్ని రాశులవారికి అద్భుతంగా ఉందని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఆ జాబితాలో ఏ రాశులు ఉన్నాయో చూద్దాం..

వినాయకచవితికి సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించుటచేత రవి, కుజులు కన్యారాశిలో సంచరించుటవలన అలాగే బుధుడు సింహరాశి, శుక్రుడు కర్మాటకరాశిలో ఉండటంచేత కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలు కలుగుతున్నాయని అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

పైన చెప్పిన గ్రహస్థితి ప్రభావంచేత వృశ్చిక, ధనూరాశులకు, వృషభ, మిథునరాశులకు గోచారపరంగా అద్భుతమైన ఫలితాలుంటాయని చిలకమర్తి తెలిపారు. ఈ నాలుగు రాశులకు వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అన్ని విధాలుగా కలసివస్తుంది.

మేషరాశివారికి జన్మరాశియందు గురు, రాహువులు కళత్రములో కేతువు, కన్యారాశివారికి జన్మరాశిలో రవి, కుజులు, అష్టమంలో గురు, రాహువులు సంచారంచేత ఈ రెండు రాశుల వారికి పనులయందు ఒత్తిళ్ళు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించును. కుంభ, మీన రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం, అష్టమస్థానములో ఉన్న గ్రహస్థితుల ప్రభావంతచేత సమస్యలు వేధించును.

మిగిలిన రాశులయినటువంటి కర్మాటక, సింహ, తుల మరియు మకర రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. చెడు ఫలితాలు కలిగించే రాశులవారు ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం, నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించి విఘ్నేశ్వరుని ఆరాధన చేసినట్లయితే దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలియచేశారు.

WhatsApp channel