Gajalakshmi raja yogam: 12 ఏళ్ల తర్వాత గజలక్ష్మీ యోగం.. దీని ప్రభావం పొందే లక్కీ రాశులు ఏవో చూడండి
Gajalakshmi raja yogam: బృహస్పతి, శుక్రుడి కలయిక వల్ల పన్నెండు సంవత్సరాల తర్వాత గజలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. దీని ప్రభావం పొందే లక్కీ రాశులు ఏవో చూడండి.
Gajalakshmi raja yogam: వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహ సంచారం చాలా ముఖ్యమైనవి. ప్రస్తుతం అనేక గ్రహాలు వృషభ రాశిలో సంచరిస్తున్నాయి. శుభప్రదమైన గురు, శుక్ర గ్రహాలు ఈ రాశిలోనే సంయోగం చెందాయి. 12 ఏళ్ల తర్వాత ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడింది
మే 1 నుంచి గురు గ్రహం మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. అలాగే మే 19న శుక్రుడు తన సొంత రాశిలో అయిన వృషభ రాశిలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా రెండు గ్రహాలు కలయిక అత్యంత అనుకూలమైన యోగాన్ని నిర్మించింది .ఈ రెండు గ్రహాల వల్ల పన్నెండు సంవత్సరాల తర్వాత గజలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. దీని ప్రభావం అనేక రాశుల వారికి ఉత్తమ ఫలితాలు ఇస్తుంది.
ఇవి మాత్రమే కాకుండా ఇదే రాశిలోకి మే 31న బుధుడు ప్రవేశిస్తాడు. సూర్యుడు ఇప్పటికే ఈ రాశిలో ఉన్నాడు. ఫలితంగా గజలక్ష్మీ, బుధాదిత్య, మాలవ్య రాజయోగం అనే మూడు శుభయోగాలు ఏర్పడనున్నాయి. వృషభ రాశిలో నాలుగు గ్రహాల కలయిక వల్ల అనుకూలమైన యోగం ఏర్పడటంతో కొందరు ప్రయోజనాలు పొందుతారు.
మేష రాశి
శుభ యోగాల ప్రభావం మేష రాశి వారికి అద్భుతమైన సమయాన్ని ఇస్తుంది. పనిలో పురోగతి సాధిస్తారు. మీ ప్రయత్నాలకు గుర్తింపు అందుకుంటారు. హోదా గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే వేతనాల పెంపు, ప్రమోషన్ కు కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. దీని కారణంగా ఇంటికి వాతావరణం సారుకూలంగా ఉంటుంది. కెరీర్ లో కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. యజమానులు మీ పని పట్ల సంతోషంగా ఉంటారు. ఫలితంగా ఉత్సాహం ఆత్మవిశ్వాసం రెండు పెరుగుతాయి.
కర్కాటక రాశి
ఈ గ్రహాల కలయిక కర్కాటక రాశి వారికి సానుకుల ప్రయోజనాలు ఇస్తుంది .మంచి రాబడి, అధిక స్థాయి లాభాలు రెండూ సాధ్యమవుతాయి. ఉన్నతాధికారుల గౌరవం నమ్మకాన్ని పొందుతారు. అద్భుతమైన పనితీరుతో కార్యాలయంలో ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఇష్టపడేలా చేసుకుంటారు. మీ బాస్ నమ్మకాన్ని పొందడంలో కూడా విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు ఈ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. శృంగార జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. బకాయి పడిన డబ్బు అందుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.
కన్యా రాశి
కన్యా రాశిలో జన్మించిన వారికి ఈ యోగం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తే ఈ కాలంలో కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకుంటారు. ఇవి మీకు ఆర్థికంగా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కెరీర్ కి సంబంధించి అనేక అవకాశాలు కలుగుతాయి. డబ్బు పరంగా పొదుపు చేయడానికి సమయం ఉంటుంది. లవ్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ప్రేమికులు ఈ సమయంలో వివాహం చేసుకోవాలని అనుకుంటే ఆ విషయం ఇంట్లో చెప్పేందుకు ఈ కాలం సరైనది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వారికి గజలక్ష్మీ రాజయోగం వల్ల చాలా లాభం పొందుతారు. ఈ కాలంలో మీ వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యం తెలివైన ఎంపికలు చేయగల సామర్థ్యాన్ని పొందుతారు. ఇది మీకు ప్రయోజనాలు చేకూరుస్తాయి. వ్యాపారం వెంచర్లలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులు అండగా ఉంటారు. ఈ శుభయోగంతో మీరు అనుకూలమైన కెరీర్ పొందుతారు.
మీన రాశి
గజలక్ష్మీ రాజయోగం మీన రాశి వారికి చాలా విజయవంతమైన ఫలితాలను ఇస్తుంది. కెరీర్ పరంగా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. పనిలో మీకు మంచి స్థానం ఉంటుంది. ఉన్నతాధికారులు మీ పట్ల సంతృప్తిగా ఉంటారు. మీకు ఇతర ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఎలాంటి కొరత ఉండదు. పూర్వీకుల ఆస్తులు, ఊహించిన మూలాల నుండి డబ్బు, బహుమతులు అందుకుంటారు. మీ సామర్థ్యం, తెలివితేటలు కారణంగా వ్యాపార ప్రపంచంలో మంచి డబ్బు సంపాదిస్తారు. మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. జీవిత భాగస్వామితో సానుకూల సంబంధం కొనసాగిస్తారు.