ఆదివారం నుండి శనివారం వరకు ఏ రోజు ఏం కొనుగోలు చేస్తే మంచిది? ఇలా చేస్తే సంపద పెరుగుతుంది, అదృష్టం వస్తుంది!-from sunday to saturday what to buy bring these on these days for positivity wealth and luck ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఆదివారం నుండి శనివారం వరకు ఏ రోజు ఏం కొనుగోలు చేస్తే మంచిది? ఇలా చేస్తే సంపద పెరుగుతుంది, అదృష్టం వస్తుంది!

ఆదివారం నుండి శనివారం వరకు ఏ రోజు ఏం కొనుగోలు చేస్తే మంచిది? ఇలా చేస్తే సంపద పెరుగుతుంది, అదృష్టం వస్తుంది!

Peddinti Sravya HT Telugu

కొన్ని కొన్ని రోజుల్లో కొన్నిటిని కొనడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. ఏ రోజు వేటిని ఇంటికి తీసుకువస్తే మంచి ఫలితాలు ఉంటాయి? వారంలో ఏ రోజు వేటిని కొనుగోలు చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదివారం నుండి శనివారం వరకు ఏ రోజు ఏం కొనుగోలు చేస్తే మంచిది? (pinterest)

వారం ఏంటో చూసుకోకుండా ఎవరికి నచ్చిన వాటిని వారు నచ్చిన రోజుల్లో కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ మనం ఉపయోగించే వస్తువులను లేకపోతే కావాల్సిన వాటిని మనం కొనుగోలు చేసే ముందు ఏ రోజు ఏం కొనుగోలు చేయాలో తెలుసుకోవాలో చూడాలి.

కొన్ని కొన్ని రోజుల్లో కొన్నిటిని కొనడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. ఏ రోజు వేటిని ఇంటికి తీసుకువస్తే మంచి ఫలితాలు ఉంటాయి? వారంలో ఏ రోజు వేటిని కొనుగోలు చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ రోజు ఏ వస్తువులన్నికొనుగోలు చేస్తే మంచి ఫలితం వస్తుంది?

1.ఆదివారం

ఆదివారం నాడు ఇనుముతో చేసిన వస్తువులని కొనుగోలు చేయడం మంచిది. వీటిని ఇంటికి తీసుకురావడం వలన పేదరికం, దురదృష్టం తొలగిపోతాయి. అలాగే ఆదివారం నాడు ఎరుపు రంగు వస్తువులను కొనుగోలు చేస్తే అదృష్టం కలుగుతుంది. గోధుమలు వంటి ధాన్యాలని కొనుగోలు చేస్తే కూడా శుభ ఫలితాన్ని పొందవచ్చు.

2.సోమవారం

సోమవారం నాడు స్టేషనరీ, ఎలక్ట్రానిక్ సామాన్లు వంటివి కొనుగోలు చేయడం మంచిది. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటివి కొనుగోలు చేయొచ్చు. ఇలా చేయడం వలన దురదృష్టం తొలగిపోతుంది. పాలు, పాల పదార్థాలు కొనుగోలు చేసినా శుభ ఫలితాన్ని పొందవచ్చు. బియ్యం వంటి ధాన్యాలను కూడా కూడా కొనుగోలు చేయవచ్చు.

3.మంగళవారం

మంగళవారం నాడు షూ, ఇనుముతో చేసిన వస్తువుని కొనుగోలు చేయడం మంచిది. మంగళవారం హనుమంతుడు రోజు. ఈ రోజు ఎర్రటి వస్తువులని కొనుగోలు చేస్తే కూడా శుభ ఫలితాన్ని పొందవచ్చు. ఎరుపు రంగు దుస్తులను కూడా ఈరోజు కొనుగులు చేయడం మంచిది.

4.బుధవారం

బుధవారం వినాయకుడు, సరస్వతి రోజు. ఈరోజు బియ్యం, చేపల తొట్టి వంటివి కొనుగోలు చేయడం మంచిది. స్టేషనరీ, ఆర్ట్స్ కి సంబంధించిన సామాన్లు కూడా కొనుగోలు చేయవచ్చు.

5.గురువారం

గురువారం బృహస్పతి రోజు. కళ్ళజోడు, ఐ లైనర్ ఇలాంటివి కొనుగోలు చేయొచ్చు. పదునైన వస్తువులను కొనుగోలు చేయడం కూడా శుభప్రదం. ప్రాపర్టీలని కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు అనుకూలమైనది.

6.శుక్రవారం

శుక్రవారం మహాలక్ష్మీ రోజు. శుక్రవారం నాడు వంట గదికి సంబంధించిన వస్తువులను, పూజకి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయకూడదు. కాస్మొటిక్స్, దుస్తులు, చెప్పులు, పర్సులు వంటివి కొనుగోలు చేస్తే మంచిది.

7.శనివారం

శనివారం ఉప్పు, ఆవాలు, ఆవాల నూనె, తోలుతో చేసినవి కొనుగోలు చేయకూడదు. ఈరోజు ఫర్నీచర్, కటింగ్ మిషన్లు వంటివి కొనుగోలు చేయడం వలన శుభ ఫలితం ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం