అన్ని గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల రాశి మార్పు 12 రాశులను ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు గ్రహాల సంచారం కారణంగా శుభయోగాలు ఏర్పడతాయి. శుభయోగాలలో గజకేసరి యోగం కూడా ఒకటి. ఇది గురు, చంద్రుల కలయికతో ఏర్పడుతుంది. చంద్రుడు మనసుకి కారకుడు కాబట్టి, వృత్తిలో విజయం, ఒత్తిడినుంచి ఉపశమనం లాంటివి కొన్ని రాశులవారు పొందవచ్చు. జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న దాని ప్రకారం, ఈ యోగం మరోసారి ఏర్పడనుంది.
చంద్రుడు జూన్ 24న రాత్రి 11:45 గంటలకు మిధున రాశిలో సంచరిస్తాడు. గురువు ఇప్పటికే అదే రాశిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మిధున రాశిలో గురు, చంద్రుల కలయిక ఏర్పడుతుంది. దీంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా మారుతుంది.
వృషభ రాశి వారికి గజకేసరి రాజయోగం అనేక మార్పులను తీసుకువస్తుంది. పూర్వికుల ఆస్తిని పొందవచ్చు. కుటుంబంలో ఏమైనా గొడవలు ఉంటే పరిష్కరించుకోవచ్చు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వివాహం కానివారికి వివాహ అవకాశాలు వస్తాయి.
గజకేసరి రాజయోగం వలన మానసిక సంతృప్తి కలుగుతుంది. దానధర్మాలు చేస్తారు. కెరీర్‌కు సంబంధించిన కొత్త పాలసీలు పూర్తి చేస్తారు. భాగస్వామితో బంధం మధురంగా మారుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మిధున రాశి వారికి గజకేసరి రాజయోగం అదృష్టాన్ని తీసుకురాగలదు. ఈ సమయంలో మీ టాలెంట్ ఇంకా మెరుగుపడుతుంది. ఎప్పటి నుంచో పూర్తికాని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. పాత వ్యాధినుంచి బయటపడతారు. ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో మీరు ప్రయాణాలు కూడా చేస్తారు. కెరీర్‌లో ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్నవారు పదవులు పొందవచ్చు.
తులా రాశి వారికి గజకేసరి రాజయోగంతో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. ఎప్పటినుంచి పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు ఇప్పుడు సర్దుకుంటాయి. ఈ సమయంలో తులా రాశి వారు కంపెనీ నుంచి ఆఫర్లను పొందుతారు. మీ తల్లికి సంబంధించిన విషయాల వల్ల ఆందోళన ఉంటే, ఇప్పుడు ఉపశమనం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా ఈ సమయంలో పెరుగుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.