Fridge Vastu Tips: వాస్తు ప్రకారం ఫ్రిడ్జ్ ఏ దిశలో ఉంటే మంచిది? ఇటు ఉంటే బంధాలు బలపడతాయి.. సంతోషంగా, ప్రశాంతంగా ఉండొచ్చు
Fridge Vastu Tips: వాస్తు ప్రకారం మనం ఇంటిని నిర్మించుకున్నా, ఇంట్లో వస్తువులను ఉంచినా సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఎంతో సంతోషంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం ఫ్రిడ్జ్ ఏ దిశలో ఉంటే మంచిది?, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడే తెలుసుకుందాం.
చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. నిజానికి వాస్తు ప్రకారం మనం ఇంటిని నిర్మించుకున్నా, ఇంట్లో వస్తువులను పెట్టుకున్నా సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఎంతో సంతోషంగా ఉండొచ్చు.
వాస్తు ప్రకారం, వస్తువులను ఇంట్లో ఉంచడం వలన ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా సులువుగా బయటపడొచ్చు. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ ఏ వైపు ఉంటే మంచిది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రిడ్జ్ ఏ దిశలో ఉంటే మంచిది?
ఫ్రిడ్జ్ ని ఎప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంచకూడదు. అలాగే గోడలు నుంచి కొంచెం ఒక అడుగు దూరం ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్రిడ్జ్ ని ఉంచేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోలేదంటే కుటుంబ సభ్యులు వ్యాధులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. డబ్బు కొరతను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
1.సూర్యకిరణాలు నేరుగా పడకూడదు
ఫ్రిడ్జ్ పై ఎప్పుడూ కూడా నేరుగా సూర్యకిరణాలు పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వేసవి నెలల్లో ఫ్రిడ్జ్ ని ఎప్పుడు కూడా సూర్యకిరణాలు పడేటట్టు ఉంచకూడదు. ఒకవేళ వంట గదిలో మీరు ఫ్రిడ్జ్ ని ఉంచినట్లయితే మైక్రోవేవ్ కి దూరంగా ఉండాలి.
2.పడమర వైపు ఉంచచ్చు
పడమర వైపు ఫ్రిడ్జ్ ని పెట్టడం వలన చాలా లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. ప్రశాంతంగా, సంతోషంగా ఉండొచ్చు. కనుక పడమర వైపు ఫ్రిడ్జ్ ని ఉంచడం మంచిది.
3.ఈ తప్పును మాత్రం చేయకండి
వాస్తు శాస్త్రం ప్రకారం ఫ్రిడ్జ్ ని ఎప్పుడూ ఈశాన్యం వైపు ఉంచకూడదు. అలాగే ఫ్రిడ్జ్ ని ఉంచడానికి ఉత్తమమైన, అత్యంత పవిత్రమైన దిశ నైరుతి. ఫ్రిడ్జ్ ని ఎప్పుడూ ఉత్తరం, తూర్పు దిశల్లో ఉంచకండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుంది. ఇంట్లో సంపద రాకుండా చేస్తుంది.
గోడకు దగ్గరగా కూడా ఉంచకండి. తలుపుకు ఎదురుగా పెట్టకండి. అలా చేయడం వలన సానుకూల శక్తి దూరమవుతుంది. మానసిక ఇబ్బందుల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు.
4.శుభ్రంగా ఉంచుకోండి
వాస్తు ప్రకారం ఫ్రిడ్జ్ ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. లేకపోతే సానుకూల శక్తి ఉండదు. ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
5.వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టండి
వాస్తు శాస్త్రం ప్రకారం ఫ్రిడ్జ్ లో రంగురంగుల కూరలు, పండ్లతో పాటుగా పాలు, నీరు కూడా ఉంచండి. వీటిని ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ధనం ప్రవహిస్తుంది. సానుకూల శక్తి తొలగిపోతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం