Fridge Vastu: వాస్తు ప్రకారం ఫ్రిడ్జ్ పై ఈ 4 పెట్టకండి.. లేనిపోని సమస్యలు రావచ్చు!
Fridge Vastu: కొంతమంది ఫ్రిడ్జ్ విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ తప్పులు చేయకుండా చూసుకోవడం మంచిది. మరి వాస్తు ప్రకారం ఎటువంటి వాటిని ఫ్రిడ్జ్ పై పెట్టకూడదు వంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం కొన్ని పొరపాట్లు చేయకూడదు. అలా చేసినట్లయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వేసవిలో కచ్చితంగా ఫ్రిడ్జ్ ఉండాలి. ఫ్రిడ్జ్ లోనే మనం ఎక్కువగా పాలు, నీళ్లు, కూరగాయలు వంటి వాటిని స్టోర్ చేస్తూ ఉంటాము.
వేడి వలన ఆహార పదార్థాలు పాడైపోకుండా ఉండాలంటే కచ్చితంగా ఫ్రిడ్జ్ ఉండాలి. కొన్ని కొన్ని సార్లు కొంతమంది ఫ్రిడ్జ్ విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ తప్పులు చేయకుండా చూసుకోవడం మంచిది. మరి వాస్తు ప్రకారం ఎటువంటి వాటిని ఫ్రిడ్జ్ పై పెట్టకూడదు వంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.
పొరపాటున కూడా ఫ్రిడ్జ్ పై వీటిని పెట్టకండి
1.మందులు పెట్టకూడదు
చాలా మంది ఫ్రిడ్జ్ పై మందులు పెడుతూ ఉంటారు. వాస్తు ప్రకారం అలా మందులు పెట్టడం మంచిది కాదు. మందులని పొడిగా ఉండే చోట చల్లగా ఉండే చోట పెట్టాలి. ఫ్రిడ్జ్ పై పెట్టడం వలన ఉపయోగము ఉండదు. పైగా ప్రతికూల శక్తి కూడా కలుగుతుంది.
2.అవార్డులు వంటివి పెట్టకూడదు
అవార్డులు, ట్రాఫీలు వంటి వాటిని కూడా ప్రిజ్ పైన పెట్టకూడదు, అలా చేయడం వలన నష్టమే కలుగుతుంది. ఫ్రిడ్జ్ పైనుంచి అవి పడిపోతే విరిగిపోవడం లాంటివి జరుగుతాయి. సురక్షితమైన ప్రదేశంలో వీటిని పెట్టాలి.
3.డబ్బులు, బంగారం వద్దు
డబ్బులు, బంగారం వంటి విలువైన వాటిని ఫ్రిడ్జ్ పైన పెట్టకూడదు, అలా చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. పైగా ఇటువంటి వాటిని పెట్టడం వలన లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్టు ఉంటుంది. పైగా వీటిని అలా పెట్టడం సేఫ్ కాదు కూడా.
4.మొక్కలు పెట్టకండి
ఫ్రిడ్జ్ పై మొక్కలు వంటి వాటిని పెట్టకూడదు, వాస్తు ప్రకారం మొక్కలను ఫ్రిడ్జ్ పై పెట్టడం వలన ప్రతికూల శక్తి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం