Friday Remedies: శుక్రవారం నాడు లక్ష్మీదేవి ముందు ఇలా దీపారాధన చేస్తే.. డబ్బుకు లోటు ఉండదు.. అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు
Friday Remedies: శుక్రవారం నాడు ఇలా చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవుతుంది.
Friday Remedies: శుక్రవారం నాడు లక్ష్మీదేవి ముందు ఇలా దీపారాధన చేస్తే (pinterest)
లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని పరిహారాలని కూడా పాటిస్తూ ఉంటారు. అయితే, నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి కొన్ని పరిహారాలు అద్భుతంగా పని చేస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లయితే సంతోషంగా ఉండొచ్చు.

డబ్బుకి లోటు కూడా ఉండదు. అయితే, శుక్రవారం నాడు ఇలా చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవుతుంది.
శుక్రవారం నాడు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు
- శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఈ విధంగా దీపాన్ని పెట్టుకోవాలి. ఒక ఐదు తమలపాకులను తీసుకోండి. ఐదు తమలపాకులకి గంధం రాసి, పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి.
- ఆ తర్వాత తమలపాకుల్ని గుండ్రంగా పేర్చండి. దాని మీద ఒక మట్టి ప్రమిదని పెట్టండి.
- మట్టి ప్రమిదిని కూడా కుంకుమ గంధం, కుంకుమ పసుపుతో అలంకరించుకోండి.
- ఆ మట్టి ప్రమిదిలో రాళ్ల ఉప్పును వేసి, అందులో కూడా పసుపు, కుంకుమ వెయ్యాలి.
- రాళ్ల ఉప్పు నిండా వేసేటట్టు చూసుకోండి.
- తర్వాత ఇంకో ప్రమిద తీసుకుని అందులో ఆవు నెయ్యి వేసి రెండు వత్తులని ఏక వత్తులు చేసి ఉప్పు వేసిన దానిపై పెట్టి దీపారాధన చేయాలి.
- తర్వాత ఈ దీపానికి చుట్టూ పూలు పెట్టి అలంకరించుకోవాలి.
- ఈ దీపానికి తర్వాత హారతి ఇచ్చి అక్షితలు కూడా వేసి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండడానికి అవుతుంది.
శుక్రవారం సాయంత్రం వీటిని అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది
- శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఆవులకు పచ్చ గడ్డిని ఆహారం కింద పెడితే మంచిది. లేదంటే నెయ్యి, బెల్లం కలిపిన ఆహారాన్ని పెట్టవచ్చు.
- శుక్రవారం నిద్రపోయే ముందు లక్ష్మీదేవి విగ్రహానికి మల్లెపూలను సమర్పిస్తే మంచిది. డబ్బుకి ఇబ్బంది ఉండదు.
- వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నట్లయితే లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పిస్తే మంచిది. దాంపత్య జీవితం బాగుంటుంది.
- శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి ముందు ఐదు దీపాలని వెలిగించి, హారతి ఇస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. దీనిని పంచముఖి దీపం అని అంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంతోషంగా ఉండవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఇంకా జ్యోతిషంగ్రహ సంచారం, దేవాలయాలు, వాస్తు శాస్త్రం, జ్యోతిష పరిహారాలు, ఆధ్యాత్మిక సమాచారం, పండగలు, పూజా విధానం, వ్రత విధానం, రాశి ఫలాలు వంటి కథనాలు చదవండి.