July unlucky zodiac signs: జులై నెలలో ఈ నాలుగు రాశుల వారికి కుటుంబ సమస్యలు, ఆర్థిక నష్టాలు
July unlucky zodiac signs: జులై నెలలో అనేక గ్రహాల సంచారం నాలుగు రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. దీని వల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారులకు ఆర్థిక నష్టాలు జరిగే అవకాశం ఉంది.
July unlucky zodiac signs: గ్రహాల సంచారం పరంగా జూలై నెల ప్రత్యేకంగా మారనుంది. ఆషాడ మాసం ప్రారంభం కాబోతుంది. దీనితో పాటు అనేక పెద్ద గ్రహాలు కూడా ఈ నెలలో తమ రాశిని మార్చుకుంటాయి.
నిర్ధిష్ట విరామం తర్వాత గ్రహాలు రాశిని మార్చుకుంటూ ఉంటాయి. అలా అనేక పెద్ద గ్రహాలు జులై నెలలో రాశులను మార్చుకోవడంతో పాటు రాజయోగాలు సృష్టిస్తున్నాయి. గ్రహాల స్థితి మారడంతో పాటు రవి పుష్య నక్షత్రం కలయిక ఏర్పడుతుంది. జూలైలో గ్రహాల సంచారం జూలై 6 నుంచి ప్రారంభమవుతుంది. జూలైలో ఏ గ్రహం ఎప్పుడు సంచరిస్తుందో మరియు ఏ రాశుల వారి అదృష్ట నక్షత్రం మెరుస్తుందో తెలుసుకోండి.
గ్రహాల సంచారం ఎప్పుడు?
జులై రావడానికి ఒక రోజు ముందుగానే బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న శుక్రుడు కూడా జులై 6వ తేదీన కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. అనంతరం 66 రోజుల తర్వాత జూలై 7న శుక్రుడు ఉదయిస్తాడు. దీని తర్వాత జూలై 12న కుజుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. 45 రోజుల పాటు కుజుడు వృషభ రాశిలోనే ఉంటాడు. ఇక జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. నెల రోజుల పాటు ఇదే రాశిలో సంచరిస్తాడు. చివరిగా జూలై 19న బుధుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు.
ఈ రాశులకు కలిసిరాని జులై నెల
అనేక గ్రహాల సంచారంతో కొన్ని రాశుల వారికి జులై నెల కలిసి రాలేదు. కొద్దిగా ఇబ్బందులతో కూడి ఉండబోతుంది. అవి ఏ రాశులో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
ఈ రాశిలోనే ఎక్కువ గ్రహాల సంచారం జరగబోతుంది. అందువల్ల కర్కాటక రాశి ఉన్న వారు జూలైలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. కార్యాలయంలో వాదనలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంతో పరస్పర విభేదాలు ఉండవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ కాలంలో ఆర్థిక బడ్జెట్‌ను సిద్ధం చేయండి.
కన్యా రాశి
కన్యా రాశి వ్యక్తులు జూలైలో ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవచ్చు. భూమి, భవనం, వాహనాల కొనుగోలులో ఆటంకాలు ఏర్పడవచ్చు. వ్యాపారులకు సహేతుకమైన లాభాలు వచ్చే అవకాశాలు తక్కువ. ఈ నెలలో ఎవరికైనా రుణం ఇవ్వడం మానుకోండి, లేకపోతే డబ్బు నిలిచిపోవచ్చు.
వృశ్చిక రాశి
కార్యాలయంలో ఉన్నతాధికారుల వల్ల సమస్యలు పెరగవచ్చు. అయితే ఈ నెల మీకు ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఏదైనా లాభదాయకమైన ఒప్పందం వ్యాపారులకు తర్వాత నష్టాలకు దారితీయవచ్చు. అందువల్ల ఒప్పందాలు చేసుకునే ముందు క్షుణ్ణంగా పరిశీలించాలి. నిర్లక్ష్యం కారణంగా ఆర్థికంగా నష్టపోవాల్సి రావచ్చు.
మీన రాశి
మీన రాశి వారు జూలై నెలలో కుటుంబ గందరగోళంతో పాటు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కార్యాలయంలో పని ఒత్తిడి ఉండవచ్చు. మీరు వ్యాపారంలో నష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.