నాలుగు రకాల కుంభమేళాలు- చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలలో ఈ నాలుగు కుంభమేళాలు జరుగుతాయి. బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో, కుంభరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో, సింహరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నాసిక్ లో కుంభమేళాలు జరుపుకుంటారు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శ్రీమహావిష్ణువు మోహినీ అవతారం ధరించి దేవతలకు అమృతాన్ని పంచుతున్నప్పుడు దానినుంచి నాలుగు చుక్కలు హరిద్వార్లోలోని గంగానదిలో, ఉజ్జయినిలోని క్షిప్రా నదిలో, నాసిక్ లోని గోదావరిలో, ప్రయాగలోని త్రివేణి సంగమంలో పడ్డాయి. జ్యోతిష్యశాస్త్రం సూచించిన కొన్ని ప్రత్యేకమైన రోజులలో, ఆయా ప్రదేశాలలోని నదుల్లో స్నానం చేయడం వల్ల మనం కూడా అలా పడ్డ ఆ అమృతత్వాన్ని పొందవచ్చని పెద్దలు చెబుతారు.
ఆ ప్రత్యేకమైన రోజులకే కుంభమేళ అని పేరు. కుంభమేళా సమయంలో అమృతస్నానం చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఋగ్వేదంలో దీని ప్రస్తావన కనిపిస్తుంది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
అమృతబిందువులు నేలపై పడటం వెనుక మరో పురాణ కథనం కూడా ఉంది. గరుత్మంతుడు తన తల్లి దాస్యవిముక్తి కోసం అమృతాన్ని తేవలసిన అవసరం ఏర్పడింది. అలా అమృతాన్ని తెస్తున్న మార్గంలో నాలుగుచుక్కలు ఆ అమృతభాండం నుంచి నేలజారి నాలుగు పుణ్యతీర్థాలలో పడ్డాయి. ఆ ప్రదేశాలలోనే కుంభమేళాలను ఆచరిస్తున్నారు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు..
నాలుగు రకాల కుంభమేళాలు
4 సంవత్సరాలకు ఒకసారి జరిగేది కుంభమేళా
6 సం.లకు ఒకసారి జరిగేది - అర్ధ కుంభమేళా
12 సంలకు ఒకసారిజరిగేది పూర్ణ కుంభమేళా
12 సంలకు ఒకసారి జరిగే పూర్ణ కుంభమేళాలు 12 సార్లు పూర్తయితే (144సం.లకు) మహా కుంభమేళా,
ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలలో ఈ నాలుగు కుంభమేళాలు జరుగుతాయి. బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో, కుంభరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో, సింహరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నాసిక్ లో కుంభమేళాలు జరుపుకుంటారు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
అంటే మాఘ అమావాస్య నాడు బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో కుంభపర్వం జరుగుతుంది. ప్రయాగలో మూడు కుంభస్నానాలు ఉన్నాయి. ఇక్కడ మొదటి కుంభస్నానం మకర సంక్రాంతి నుండి ప్రారంభమవుతుంది. రెండవ స్నానం మౌని అమావాస్య నాడు జరుగుతుంది. మూడవ స్నానం వసంత పంచమి రోజున జరుగుతుంది. ఈ మూడింటి కలయికే 'కుంభమేళా'.