జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారాన్ని ఎంతో ముఖ్యమైన దానిగా భావిస్తారు. ఎప్పుడైతే ఒక రాశి నుంచి మరో రాశిలోకి గ్రహం మారుతుందో అది 12 రాశుల వారిపై కూడా ప్రభావం చూపిస్తుంది. అయితే, ఇలా గ్రహాల సంచారం వలన కొన్ని రాశుల వారికి కలిసి వస్తే కొన్ని రాశుల వారికి మాత్రం దురదృష్టం కలుగుతుంది. మే నెలలో చాలా ముఖ్యమైన గ్రహాల సంచారం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో కొన్ని గ్రహాల సంచారం అనేక మార్పుల్ని అందిస్తుంది.
మే 12 నుంచి వారం రోజుల పాటు చూసినట్లయితే, నాలుగు శక్తివంతమైన గ్రహాల సంచారం ఉంది. ఈ నాలుగు శక్తివంతమైన గ్రహాల సంచారం లో మార్పు రావడంతో మూడు రాశుల వారికి కలిసి వస్తుంది. మరి ఆ మూడు రాశుల వారు ఎవరు, ఎవరికి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య నిపుణులు చెప్తున్న దాని ప్రకారం, మే 14వ తేదీన గురువు మిధున రాశిలోకి సంచరిస్తాడు. మే 15వ తేదీన సూర్యుడు వృషభ రాశిలోకి సంచరిస్తాడు. అదే రోజు రాహువు, కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కేతువు సింహరాశిలోకి అడుగుపెడతాడు. ఈ నాలుగు గ్రహాల మార్పు వలన మూడు రాశుల వారికి కలిసి వస్తుంది. ఆ మూడు రాశుల్లో మీరు కూడా ఒకరేమో చూసుకోండి.
ఈ వారం నాలుగు గ్రహాల మార్పు వలన ధనస్సు రాశి వారికి కలిసి వస్తుంది. పోటీ పరీక్షలు రాస్తున్నవారికి అదృష్టం కలిసి వస్తుంది. విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. సానుకూల శక్తితో సంతోషంగా ఉంటారు. మీ మాటలతో ఇతరులు మీకు పై గౌరవాన్ని పెంచుకుంటారు. మీ పనికి ఇతరులు ఇంప్రెస్ అవుతారు.
సింహ రాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది. సూర్యుడు వృషభ రాశిలోకి సంచరించడంతో మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ వారం మీరు విజయాలని అందుకుంటారు. ఎప్పటి నుంచో పూర్తి కానీ పనులు కూడా ఈ సమయంలో పూర్తయిపోతాయి. కేతువు సంచారంలో మార్పు వలన ఆధ్యాత్మికతవైపు అడుగు వేస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది.
మేష రాశి వారికి ప్రధాన గ్రహాల సంచారం వలన ఉద్యోగంలో కూడా బావుంటుంది. పై అధికారులతో మంచి సంబంధాన్ని కొనసాగిస్తారు. ఈ నెల ఆఖరిలో శుభవార్తను వింటారు. ఆరోగ్యం కూడా బావుంటుంది. ఉద్యోగ పరంగా, వ్యాపారాల పరంగా కూడా ఇబ్బందులు వుండవు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.