Shani devudu: శనిదేవుడి అనుగ్రహం పొందేందుకు జూన్ నెలలో ఈ రెండు రోజులు చాలా ముఖ్యమైనవి
Shani devudu: శని దోషం, ఏలినాటి శని, అర్థాష్టమ శని వంటి వాటితో బాధపడుతున్నట్టయితే వాటి నుంచి విముక్తి పొందేందుకు జూన్ నెలలో రెండు ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. ఆరోజు శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ పరిహారాలు పాటించండి.
Shani devudu: జూన్ నెలలో శని దేవుడితో సంబంధం ఉన్న రెండు రోజులు చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా శని సడే సతీ, దయ్యాలతో బాధపడుతున్న వారికి ఈ రెండు రోజులు అత్యంత ముఖ్యం. ఈ రెండు రోజులు కొన్ని చర్యలు పాటించడం వల్ల శని దేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. శని ఆశీర్వాదాలు పొందవచ్చు.
శని జయంతి
మొదటిది జూన్ 6. అమావాస్యతో పాటు శని జయంతి కూడా అదే రోజు వచ్చింది. ఈరోజు ఏలినాటి శనితో బాధపడుతున్న వారికి చాలా పవిత్రమైన రోజు. శనీశ్వరుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం పొందవచ్చు.
శని అశుభ ఫలితాల నుంచి విముక్తి పొందేందుకు శని జయంతి చాలా మంచి రోజు. కుంభం, మకరం, మీన రాశుల వారికి ఈ ఏడాది ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది.
శని తిరోగమనం
రెండోది జూన్ 29వ తేదీ. ఈరోజు శని తన కదలికను మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం ప్రత్యక్ష మార్గంలో సంచరిస్తున్నద శని జూన్ 29 నుంచి తిరోగమన దశలో తన ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈరోజు కూడా శని ఆశీస్సులు పొందేందుకు మంచి సమయం.
వివిధ పరిహారాలు పాటించడం వల్ల శనిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత మంచి సమయం. నవంబర్ వరకు శని కుంభ రాశిలో తిరోగమన దశలోనే సంచరిస్తుంది. అటువంటి పరిస్థితిలో కుంభం, వృశ్చిక రాశి వాళ్ళు శని దేవుడికి నూనె సమర్పించాలి. నూనె దీపాన్ని వెలిగించాలి.
శని దేవుడిని సంతోషపెట్టే మార్గాలు
నిరుపేదలకు, అవసరంలో ఉన్న వారికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడు. అలాగే శనివారం హనుమాన్ చాలీసా పఠించాలి. హనుమంతుడి ముందు ఆవనూనె దీపం వెలిగించాలి. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి శనివారం ఆవనూనె దానం చేయాలి. ఈ రెండు రోజుల్లో శని దేవుడితో పాటు రావి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి.
రావి చెట్టుకు నీరు సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలు. శని దేవుడికి నూనె సమర్పించేటప్పుడు అది కాళ్ళ మీద పడకూడదు అనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అలాగే శనివారం నల్ల నువ్వులు దానం చేయాలి. శని దేవుడు త్వరగా ప్రసన్నం అయ్యేందుకు ఉన్న మరొక మార్గం శమీ వృక్షాన్ని పూజించడం. శని ఆలయానికి వెళ్ళి నూనె దీపాన్ని వెలిగించాలి. అయితే పోరపాటున కూడా శని దేవుడి కళ్ళలోకి చూడకూడదు. దర్శనం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా శని దేవుడి పాదాలు మాత్రమే చూడాలి. అప్పుడే శని ఆశీస్సులు లభిస్తాయి.
ఈ మంత్రాలు పఠించాలి
శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ మంత్రాలని పఠించడం చాలా ముఖ్యం.
ఓం శని అభయహస్తాయ నమః
ఓం శనీశ్వరాయ నమః
ఓం నీలాంజనాసమాభం రవిపుత్రం యమగ్రహం ఛాయామార్తాండసంభం తథానామి శనైశ్చరమ్