Vastu tips for mirror: ఇంట్లో అద్దాన్ని ఈ దిశలో పెట్టారంటే ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారు-follow these vastu tips for mirror keep at home to overcome financial troubles ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips For Mirror: ఇంట్లో అద్దాన్ని ఈ దిశలో పెట్టారంటే ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారు

Vastu tips for mirror: ఇంట్లో అద్దాన్ని ఈ దిశలో పెట్టారంటే ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారు

Gunti Soundarya HT Telugu
Jun 25, 2024 02:24 PM IST

Vastu tips for mirror: అద్దం ఇంటికి అందాన్ని తీసుకొస్తుంది. కానీ ఇది ఇంట్లో ఏ దిశలో ఉంచాలి. ఎలా ఉంచితే ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారు అనే విషయాలు తెలుసుకుందాం.

ఇంట్లో అద్దం ఏ దిశలో ఉంచాలి?
ఇంట్లో అద్దం ఏ దిశలో ఉంచాలి? (pexels)

Vastu tips for mirror: జీవితంలో సానుకూల శక్తిని ప్రసారం చేయడానికి వాస్తు నియమాలను అనుసరించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. వాస్తులో ప్రతి వస్తువుకు సరైన స్థలం, దిశ నిర్ణయించబడింది. వాస్తు నియమాలను పాటించడం వల్ల ప్రతికూలత తొలగిపోయి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద లభిస్తుందని నమ్ముతారు.

yearly horoscope entry point

వాస్తు ప్రకారం తీసుకుం అనేక చర్యలు ఇంటికి సంతోషాన్ని తీసుకొస్తాయి. ఇవి ఇంట్లోని సమస్యలను తొలగించేస్తాయి. అదే సమయంలో కొన్ని తప్పులు ఇంట్లో వాస్తు దోషాలను కలిగిస్తాయి. దానివల్ల జీవితంలో సమస్యలు పెరుగుతాయి. ఇంట్లో అద్దం పెట్టుకోవడానికి వాస్తు ప్రకారం కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని అనుసరించడం వల్ల వాస్తు లోపాలు తొలగించుకుని ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు. అద్దం ఇంట్లో ఎటు ఉండాలో తెలుసుకుందాం.

అద్దం ఏ దిశలో ఎక్కడ పెట్టాలి?

వాస్తు ప్రకారం పడకగదిలో అద్దాలు పెట్టకూడదు. అద్దంలో మంచం ప్రతిబింబం కనిపించడం వల్ల వాస్తు దోషాలు వస్తాయని నమ్ముతారు. దీని వల్ల వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మంచం ఎదురుగా అద్దం పెట్టకూడదు.

వాస్తు శాస్త్రం ప్రకారం పురోగతి, ప్రయోజనాల కోసం అద్దాన్ని ఇంటి ఉత్తరం, తూర్పు గోడలపై పెట్టుకోవచ్చు. దీని వల్ల ఆర్థిక నష్టం నుంచి బయటపడతారు. సంపద పెరుగుతుంది. ఈ దిశలో అద్దం ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు.

ఇది మాత్రమే కాకుండా అద్దం ఎప్పుడు మురికిగా ఉండకూడదు. మసక బారిన అద్దం ఇంటికి మంచిది కాదని చెప్తారు. గాజు శుభ్రత గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

వాస్తు ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే చాలా మందికి అద్దంలో చూసుకునే అలవాటు ఉంటుంది. కానీ పొరపాటున కూడా ఈ పని చేయకూడదు. ఇది మీకు రోజంతా నెగటివ్ ఆలోచనలు కలిగేలా చేస్తుంది. అందుకే నిద్రలేచిన వెంటనే మీ ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు.

పగిలిన లేదా విరిగిన అద్దాన్ని ఇంట్లో ఉపయోగించకూడదు. ఇది జీవితంలో సమస్యలను పెంచుతుంది. వాస్తు ప్రకారం అద్దం ఎంత తేలికగా, పెద్దదిగా ఉంటే అంత ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్ర నిపుణులు చెబుతారు.

వాస్తు ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా గుండ్రటి ఆకారంలో ఉన్న అద్దం పెడితే ఇంట్లో ఆనందం పెరుగుతుంది. ఇది ఇంటికి ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. అయితే పొరపాటున కూడా వంటగదిలో అద్దం పెట్టకూడదు. ఇది అశుభంగా భావిస్తారు.

అంతే కాకుండా ఇంటికి దక్షిణం, పడమర గోడపై అద్దం పెట్టడం శ్రేయస్కరం కాదు. ఇది కుటుంబ జీవితంలో అశాంతిని పెంచుతుందని నమ్ముతారు. నైరుతి దిశలో అద్దం పెట్టడం వల్ల చేపట్టిన పనులు అసంపూర్తిగా నిలిచిపోతాయి.

వాస్తు ప్రకారం మురికిగా మసకబారిపోయినట్టు కనిపించే గాజును ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు లేదా ఉపయోగించకూడదు. ఇది మీ ఇమేజ్ ని చెడగొడుతుంది.

స్టోర్ రూమ్ లో అద్దాలు ఏర్పాటు చేయకూడదు. ఇది కుటుంబ సభ్యులకు మానసిక ఒత్తిడిని పెంచుతుంది.

పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎక్కువసేపు ఉంచకూడదు. వెంటనే దాన్ని ఇంట్లో నుండి తొలగించాలి. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner