Remove negative energy: ఈ సింపుల్ పరిహారాలు పాటించి మీ ఇంటి నుంచి నెగటివిటీని ఇలా తరిమేయండి
Remove negative energy: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే జీవితం అల్లకల్లోకంగా మారిపోతుంది. ప్రతి పనిలో ఆటంకాలు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లోని ప్రతికూల శక్తులను తరిమేసేందుకు ఈ సింపుల్ పరిహారాలు పాటించడం మంచిది. ఇవి మీ ఇంట్లోకి సానుకూల శక్తులను ఆహ్వానిస్తాయి.
Remove negative energy: ఇంట్లో ప్రతికూల శక్తులు తిష్ట వేసుకుని కూర్చుంటే జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. ఎటు చూసినా ఆర్థిక, కుటుంబ పరమైన సమస్యలు ఏర్పడతాయి. ఇంట్లో నెగటివిటీ ఏర్పడేందుకు కొన్ని మనం చేసే తప్పులు ఉంటాయి. విరిగిపోయిన, పాత వస్తువులు ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూలతలు ఏర్పడతాయి.
ఇటువంటి పరిస్థితుల నుంచి బయట పడేందుకు కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. ఈ సింపుల్ పరిహారాలు మీ ఇంటి నుంచి నెగటివిటీని తరిమి కొట్టేస్తాయి. వీటిని అమలు చేసేందుకు ఖరీదైన వస్తువులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. కేవలం కిచెన్ లో దొరికే ఈ చిన్న చిన్న వస్తువులు చాలు మీ తలరాతను మార్చుకునేందుకు సహకరిస్తాయి.
దాల్చిన చెక్క కాల్చండి
దాల్చిన చెక్క అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో సాధారణంగా దొరికే మసాలా. ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇంటి మూలలో దాల్చిన చెక్కను చల్లుకోవడం వల్ల ప్రతికూలతను దూరంగా ఉంచుతుంది. ఇంట్లో సానుకూల సమృద్ధిని ఆకర్షిస్తుందని చెబుతారు. మీరు చేతిలో కొంచెం దాల్చిన చెక్క పొడిని తీసుకోండి. శుద్దీకరణ కోసం ఇంటి మూలాల్లో కొద్దిగా ఈ పొడిని చల్లుకోవచ్చు. అలాగే దాల్చిన చెక్క కూడా కాల్చి ఆ పొగను ఇల్లు అంతా వ్యాపింప చేయవచ్చు.
సేజ్ కాల్చండి
స్మడ్జింగ్ గా పిలిచే సేజ్ ఆకులను కాల్చడం మరొక సింపుల్ పరిహారం. ప్రతికూల శక్తి నుంచి మీ ఇంటిని శుభ్రపరిచేందుకు మరొక శక్తివంతమైన మార్గం. సేజ్ పొగ గాలిని శుద్ధి చేస్తుంది. పరిసరాల నుంచి ఏదైనా ప్రతికూలతను తొలగిస్తుంది. సేజ్ కట్టను తీసుకుని వెలిగించి దాని నుంచి వచ్చే పొగను తలుపులు, కిటికీలు, మూలలు, అద్దాలు ఇంట్లో ప్రతి ప్రదేశానికి విస్తరించేలా చేయండి. ఇలా చేయడం వల్ల సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.
తలుపు దగ్గర ఈ మొక్క నాటండి
రోజ్మేరీ మీ జుట్టుకే కాదు ఇంటికి కూడా శక్తివంతమైన హెర్బ్ గా పని చేస్తుంది. ఇందులో పరిసరాలు శుభ్రపరిచే లక్షణాలు ఉన్నాయి. రోజ్మేరీ కొమ్మలు, ఆకులు తలుపుల దగ్గర ఉంచడం వల్ల మీ ఇల్లు చెడు శక్తు నుంచి రక్షించబడుతుంది. అలాగే ఇంటి గుమ్మం దగ్గర రోజ్మేరీ మొక్కను పెట్టుకోవచ్చు. ప్రవేశ ద్వారం లేదా బాల్కనీ తలుపుల దగ్గర ఉంచవచ్చు. ఇది ప్రతికూల శక్తుల నుంచి ఇంటిని రక్షించడంలో సహాయపడుతుంది.
సౌండ్ క్లెన్సింగ్
సేజ్ బర్నింగ్, రోజ్మేరీ మొక్క నాటిన విధంగా ఇంట్లో సౌండ్ క్లెన్సింగ్ కూడా ఇంటి నుంచి ప్రతికూల శక్తులను తొలగించేందుకు సహాయపడే ఒక గొప్ప మార్గం. అందుకోసం మీరు ఇంట్లో విండ్ చైమ్స్ వేలాడదీయవచ్చు. ఇవి ప్రతికూల శక్తులను విచ్చిన్నం చేయడంతో సహాయపడతాయి. సానుకూల శక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తాయి. విండ్ చైమ్స్ నుంచి వచ్చే తరంగాలు సానుకూలతను విస్తరించేలా చేస్తాయి.
కర్పూరం కాల్చడం
హిందూ ఆచరాలలో కర్పూరం తప్పనిసరిగా ఉపయోగించే పదార్థం. ఉదయం వేళ చేసే పూజ దగ్గర నుంచి యాగాల వరకు ఇది లేనిదే పని జరగదు. కర్పూరానికి పరిసరాలను శుద్ది చేసే గుణాలు ఉన్నాయి. ఇవి ఇంటికి రక్షణ వాతావరణాన్ని ఇస్తాయి. కర్పూరం అగరబత్తి కలిపి కాల్చి దాని నుంచి వచ్చే సువాసన, పొగ ఇల్లంతా వేయండి. ఈ పొగ మీ ఇంటి పరిసరాలను శుద్ధి చేసి ప్రతికూల శక్తులను తొలగిస్తుంది.
తెల్ల కొవ్వొత్తులు వెలిగించడం
తెల్లని కొవ్వొత్తులు శుద్ధి, రక్షణ కోసం ఆధ్యాత్మిక అభ్యాసాలలో ఎక్కువగా వినియోగిస్తారు. మీరు ఇంట్లో తెల్ల కొవ్వొత్తులు వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. మీకు ఇంట్లో ఏదైనా గందరగోళ పరిస్థితి ఉన్నట్టు అనిపిస్తే ప్రవేశ ద్వారం దగ్గర తెల్లని కొవ్వొత్తి వెలిగించడం వల్ల ప్రశాంతత లభిస్తుంది.
టాపిక్